Annadata Sukhibhava Scheme 2025: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తాము ప్రవేశపెట్టిన పథకాలకు గురించి నిత్యం ఏదో ఒక అప్‌డేట్ ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించి కీలక సమాచారం రైతన్నలకు ఇచ్చింది. అర్హత లిస్ట్‌లో పేరు లేని రైతులు వెంటనే తమ సమీపంలోని రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలన్నారు.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రేపో మాపో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి అంతా రంగం సిద్దమైంది. పీఎం కిసాన్‌కి సంబంధించి రెండు వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.5 వేలు కలిపి రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే అర్హుల జాబితా విడుదలైంది. ఇప్పటికే అర్హుల జాబితాను ప్రకటించింది.
ఇదిలాఉండగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది వ్యవశాయ శాఖ. రైతుల ఫిర్యాదుల స్వీకరణ జులై 5 అంటే శనివారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో మొదలుకానుంది. దీనికి సంబంధించి గ్రీవెన్స్ మాడ్యూల్ శుక్రవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు.
వెబ్ ల్యాండ్‌లో డేటా సరిగా లేకపోతే అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు అవుతారని తెలిపింది. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత పొందలేని రైతులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ స్కీమ్‌కి సంబంధించి అర్హుల ఎంపిక పూర్తయింది. వారి వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం సునాయసమే.
ALSO READ: మామిడి రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త
రైతులు తమ ఆధార్ నెంబర్‌ను నమోదు చేయాలి. అక్కడ అడిగిన వివరాలు నమోదు చేస్తే అర్హులమో కాదో తెలుసుకోవచ్చు. నిధులు పడకుంటే రైతులు వ్యవసాయ-ఉద్యాన సహాయకుడిని లేదా వ్యవసాయ అధికారిని నేరుగా కలవొచ్చు. దీనికితోడు రైతు సేవా కేంద్రంలో ఫిర్యాదు చేస్తే చాలు. సంబంధిత సిబ్బంది ఆ ఫిర్యాదును పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. అనర్హులైన రైతులు 155251 నెంబర్‌కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని డైరెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు.
భూమి యజమాని చనిపోతే వెబ్‌ల్యాండ్, అడంగల్ 1బీలో వారసుల వివరాలు నమోదు చేయకపోతే సమస్యలు వస్తాయని తెలిపారు ఆ శాఖ డైరెక్టర్. ఆటో మ్యూటేషన్ గ్రామాల్లో 5 వేల పైన సిరీస్ ఖాతాలను సిబ్బంది నోషనల్‌గా భావించే అవకాశం ఉందని చెబుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల భూమి ఉన్నా.. లేని ఖాతాలుగా నమోదవుతాయి. డేటా లోపాల వల్ల భూవిస్తీర్ణం కనిపించదు.
ఆ తరహా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా చర్యలు తీసుకుంటారు అధికారులు. మొత్తానికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి తాము అర్హులం అయ్యామో లేదో తెలుసుకునే అవకాశం రైతులకు ఉంది. ప్రభుత్వ వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లాలి.
అందులో చెక్ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది. తొలుత దాన్ని క్లిక్ చేస్తే చాలు, వెంటనే రైతు తన ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. పక్కనే ఉండే కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు అర్హుల వివరాలు దర్శినమిస్తాయి. ఆ రైతు ఈ-కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో తెలుస్తుందని అంటున్నారు అధికారులు.