Intinti Ramayanam Today Episode july 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతూ ఉంటుంది.. దిగాలిగా కూర్చున్న అవనిని చూసినా రాజేంద్రప్రసాద్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతున్నావా అవని అని అడుగుతాడు.. నేను సెలెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు మామయ్య.. ఆయన సెలెక్ట్ అవ్వలేదని నాకు బాధగా ఉంది అని అవని అంటుంది. ఒక ఇంటర్వ్యూ కాకపోతే మరో ఇంటర్వ్యూలు అయినా జాబ్ వస్తుంది ఆ సంగతి పక్కన పెట్టండి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అది కాదు మామయ్య ఆయన పరిస్థితి మీకు తెలిసిందే కదా.. ఈ జాబ్ ఆయనకి వచ్చి నేను చాలా బాగుండేది కానీ అక్కడ మన కంపెనీ గురించి అడిగి ఆయన్ని అవమానించారు అని అవని అంటుంది.. ఇంటర్వ్యూలు అంటే అంతే ఉంటాయి.. ఈరోజు కాకపోతే మరొక రోజు వస్తుందిలే అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు..పార్వతికి మందులు అయిపోయాయి రా కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మందులు వేసుకోకుండా ఉంటే అసలు బాగోదని నీకు తెలుసు కదా అని భానుమతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పాల ప్యాకెట్ కోసం అవని, అక్షయ్ షాప్ వద్దకు వెళ్తారు.. ఇక్కడ ఒకే పాల ప్యాకెట్ ఉండడంతో షాప్ అతను ఇద్దర్నీ స్టేరో సగం పంచుకోమని చెప్తాడు. నాకు కాఫీ తాగపోతే ఏమి తోచదు. అయితే నాకు కాఫీ పెట్టివ్వండి అని అవని పాల ప్యాకెట్ ని అక్షయ్ కు ఇస్తుంది. అయితే అవని అక్షయ్ ఇంటికి వెళుతుంది.. అక్షయ్ అవనీని భరించలేను అని అవని అంటుంది. కాఫీ పెట్టడానికి కూర్చో తీసుకొని వస్తానని లోపలికి వెళ్తాడు.. అవని కూడా అక్షయ్ తో పాటు లోపలికి వెళ్తుంది. పాలు పొంగడంతో అక్షయ్ చెయ్యి కాలుతుంది..
అక్షయ్ చెయ్యి కాల్చుకోవడంతో అవని నేను పులిని అది ఇది అన్నారు కాఫీ కూడా పెట్టలేరా అని అంటుంది.. అక్షయ్ మళ్ళీ అవని ప్రేమలో పడిపోతాడు.. ఇలాంటివన్నీ చూస్తుంటే ఏవేవో గుర్తొస్తున్నాయి అని అవని అంటుంది.. కానీ అక్షయ్ మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.. ఇక అవని కూర్చొని ఉంటే అక్షయ్ కాఫీ తెచ్చి ఇస్తాడు. అదేంటి ఒక కప్పు నే తెచ్చారు మీరు తాగరా అని అవని అడుగుతుంది.. నేను తర్వాత తాగుతాను నువ్వు తాగు అని అక్షయ్ అంటాడు.
ఆ మాట విన్నా అవని ఇద్దరం షేరింగ్ చేసుకుందామని కాఫీని షేర్ చేసుకుంటారు. బయటనుంచి లోపలికి వెళ్తున్న పార్వతీ భానుమతిలను రాజేంద్రప్రసాద్ ఆపుతాడు. లోపల నా కొడుకు కోడలు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నారు అందుకే నేను ఇక్కడ కాపలా ఉన్నాను అని అంటాడు.. నా కొడుకు అలాంటి పని ఎప్పుడూ చేయడు అని పార్వతి అంటుంది. కానీ నేను చెప్పింది నిజమో కాదు లోపలికి వెళ్లి చూడండి అని అంటాడు. రాజేంద్రప్రసాద్ చెప్పినట్టే లోపల కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ అక్షయ్, అవని కనిపిస్తారు..
ఇదంతా ఏంట్రా అక్షయ్ అని పార్వతి అడుగుతుంది. పాలు ప్యాకెట్ కి వెళ్తే కాఫీ కావాలన్నమ్మ అందుకే కాఫీ తెచ్చి ఇచ్చాను అంతే మీరు అనుకున్నట్టు ఇంకేది లేదు అని అక్షయ్ అంటాడు. ఆ తర్వాత అవని పాలు ప్యాకెట్ కు డబ్బులు ఇచ్చాను కదా కాఫీ డబ్బులు కూడా నేనే ఇస్తాను అని వెళ్ళిపోతుంది. అవని వెళ్ళగానే ఇంట్లోకి కొందరు సీమంతం కి పిలవాలని వస్తారు.. అమ్మాయి సీమంతం మీరు రావాలి అని వాళ్ళు పిలవగానే ఆమె పేరు పార్వతి అని తెలుసుకొని నానా మాటలు అంటారు.
మీ పేరు పార్వతి అని తెలిస్తే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు.. నీ గురించి ఈ వీధంతా కథలుగా చెప్పుకుంటున్నారు.. కోడల్ని రాచిరంపాలు పెడుతున్నా వంట కదా అని అనగానే అక్షయ్ వాళ్ళని తిట్టి బయటికి పంపిస్తాడు. శ్రియ, పల్లవి ఇద్దరు కూడా రాత్రి శ్రీకర్ నన్ను ఎలా కొట్టాడో తెలుసా అని చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు. పల్లవి కూడా కమల్ బావ నన్ను దారుణంగా కొట్టాడు ఇది కంటిన్యూ అయితే మాత్రం మనం రోజు తన్నులు తినాలి అని అనుకుంటారు.. కమల్ శ్రీకర్ మాత్రం ఏమీ తెలియనట్లు ఉంటారు..
Also Read: అడ్డంగా ఇరుక్కున్న రోహిణి.. రెచ్చిపోయిన ప్రభావతి..ఇదేం ట్విస్ట్..
వీళ్ళని కంట్రోల్లో పెట్టాలంటే కచ్చితంగా అత్తయ్య ఇక్కడ ఉండాలి అని శ్రేయ పల్లవి నిర్ణయించుకుంటారు. ఎలాగైన సరే అత్తయ్య నువ్వు ఒప్పించి ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటారు. ఇక పార్వతీ వాళ్ళింటి నుంచి బయటికి వచ్చిన వాళ్ళు నేరుగా అవని వాళ్ళ ఇంటికి వెళ్లిన వాళ్లు అవని దగ్గర కూడా పార్వతి గురించి నానా మాటలు అంటారు.. అవని మాత్రం తన అత్తయ్య గురించి ఏం మాట్లాడిన ఊరుకోను అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. అది చూసి పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..