E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన వల్లి.. ధీరజ్, ప్రేమ రొమాన్స్.. నర్మదకు యాక్సిడెంట్..?

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన వల్లి.. ధీరజ్, ప్రేమ రొమాన్స్.. నర్మదకు యాక్సిడెంట్..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 25th: వల్లి భయపడిపోతున్నడని చూసిన నర్మదకు డౌట్ వస్తుంది. రాత్రంతా జాగారం చేస్తూ అలానే ఉండిపోయిన వల్లిని వేదవతి దగ్గరికి తీసుకొని వెళుతుంది. ఈరోజు చెకప్ కి వెళ్ళాలి కదా అయితే నేను మా అమ్మతో వెళ్తాను అని వల్లి ఎంత చెప్తున్నా సరే నర్మద మాత్రం వినకుండా నేనే తీసుకుని వెళ్తాను అని చెప్తుంది.. వల్లి ఎంతగా చెప్తున్న సరే నర్మద మాత్రం వినకుండా ఇవాళ ఎలాగైనా సరే నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని లాక్కొని వెళ్తుంది..

భాగ్యం శాకిచ్చిన సుకన్య..

ఆనంద్ రావు తనను తాను పొగుడుకుంటూ అద్దంలో చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటాడు. పెళ్లయిన కొత్తల్లో నాకు జుట్టు ఎలా ఉందో తెలుసా అని భాగ్యం జుట్టుని వెనకాల నుంచి వేసుకొని చాలా సంతోషంగా ఉంటాడు.. అయితే భాగ్యం మాత్రం ఈ వెటకరాలకు ఏమీ తక్కువ లేదు. నువ్వు పెళ్లయిన కొత్తలో అసలు జుట్టే లేదు అని నేను చాలా బాధపడ్డాను.. ఇంకెందుకు పెళ్లి పీటలు మీద నుంచి వెళ్ళిపోయి ఏదో ఒకటి నిన్నే చేసుకున్నాను అని భాగ్యం చెప్పగానే ఆనందరావు సెటైర్ల మీద సెటైర్లు వేస్తాడు. అయితే అప్పుడే సుకన్య ఫోన్ చేసి దొరికిపోయాం అంత తెలిసిపోయింది అంటూ భాగ్యం భయపెడుతుంది.. ఏం దొరికిపోయాము ఏం తెలిసిపోయింది సరిగ్గా చెప్పు అని భాగ్యం అడుగుతుంది.. వల్లిని చూపించడానికి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళింది నర్మదా ఒకవేళ తెలిస్తే మన బండారం బయటపడుతుంది అని టెన్షన్ పడిపోతుంది.. ఆ మాట వినగానే భాగ్యం ఫ్యూజులు ఎగిరిపోతాయి.. ఇక సుకన్య ఈ ప్లాన్ ప్రకారం చేస్తే నర్మద నుంచి కాపాడవచ్చు అని అంటుంది.. భాగ్యం కూడా అదే బాగుంది సరే అలానే చేద్దామని అంటుంది..

సేనకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ వచ్చి ఒరేయ్ సచ్చినోడా వెళ్ళిపోతున్నావు ఏంట్రా.. నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతావా నీకు ఎంత ధైర్యం రాని అంటుంది.. నువ్వు ఎప్పుడూ ఇంత ఉదయం వెళ్ళవు కదా మరి ఎందుకు ఇప్పుడు ఇంత త్వరగా వెళ్తున్నావు. ఏమైంది అని అడిగితే ఇక మీద నుంచి నేను ఇంకా త్వరగా వెళ్తాను నిన్ను పోలీస్ని చేసేంతవరకు నేను ఆగను అని ధీరజ్ అనగానే.. ప్రేమ ధీరజ్ దగ్గర ఉన్న డబ్బులను తీసుకోవాలని తన జేబులో చేయి పెట్టి తీసుకుంటూ ఉండగా సేన అలాగే విశ్వం వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతారు.. వాళ్లని చూసిన ఇంకాస్త ప్రేమని ప్రేమగా చూసుకుంటూ రొమాన్స్ చేస్తాడు.. అది చూసిన సేన రగిలిపోతాడు. ధీరజ్ చేసిన పనికి సేన షాక్ అవుతాడు.. ఇకపోతే ప్రేమ వాళ్ళని చూసి వెనక్కి వచ్చేస్తుంది.

అయ్యో.. వల్లికి టెన్షన్..

వల్లిని నర్మదా ఎంతగా వద్దని చెప్పినా కూడా అసలు వినకుండా తీసుకొని వెళుతుంది. ఒకవేళ అక్కడ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే నా బంగారం బయట పెడితే నన్ను చంపేస్తారు.. దేవుడా నన్ను కాపాడే దానికి నువ్వు రావా అంటూ వల్లి బండిమీద వెళుతూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకు నర్మదా సరిగ్గా కూర్చోలేవా అక్క ఎందుకు ఇలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. నువ్వు హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని నర్మదా అవుతుంది.. వల్లి ఈ పక్క సందులోనే మా ఇల్లు మా అమ్మ దగ్గరికి వెళ్లి ఒకసారి బాయ్ చెప్పేసి వెళ్దామని ఎంతగా అడుగుతున్న సరే నర్మద మాత్రం అసలు వినకుండా కాసేపట్లో హాస్పిటల్ కి వెళ్లి తర్వాత వచ్చేటప్పుడు మీ అమ్మని చూసి రావచ్చులే అని అంటుంది.. అయితే నర్మదా ఇంక నా మాట వినదు నా బండారం బయటపడుతుందేమో అని కంగారు పడిపోతుంది.

సుకన్య ప్లాన్ అదుర్స్..

Advertisement

సుకన్య ఆటో డ్రైవర్ గా అవతారం ఎత్తుతుంది. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అని సుకన్య ఆటో డ్రైవర్ గా వీళ్ళకి యాక్సిడెంట్ చేయాలి అని చాలా వేగంగా వచ్చి నర్మదవాలని గుద్దేస్తుంది.. అయితే ఈ ఆక్సిడెంట్ లో కింద పడిపోతుంది శ్రీవల్లి. నర్మదకు మాత్రం చిన్న గాయాలు తగులుతాయి. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద కనిపించిన వల్లి ఒక్కసారిగా కళ్ళు తెరిచి షాక్ అవుతుంది.. ఏమైంది నేనెక్కడున్నాను అమ్మ నాన్న సుకన్య నువ్వు కూడా చచ్చిపోయి స్వర్గానికి వచ్చావా..? ఇంకా చచ్చి పోలేదా అని శ్రీవల్లి అంటుంది. నువ్వేమీ చచ్చిపోలేదే హాస్పిటల్లో పడ్డావు అని అనగానే వల్లి ఏంటి నేను హాస్పిటల్ లో ఉన్నాను హమ్మయ్య చచ్చిపోలేదా అని అంటుంది.

వల్లి నాటకం సక్సెస్..

సరే నర్మదాను చూడడానికి వేదవతి ధీరజ్ ప్రేమ అందరూ హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తారు. అందుకే నర్మదా నీకు ఇంత గాయాలు అయ్యాయా.. నీకే ఇంత గాయాలు అయితే బల్లి పరిస్థితి ఎలా ఉందో అసలది కాస్త బొద్దుగా ఉంటుంది కదా అని వేదవతి కంగారు పడిపోతుంది. లోపలికి వెళ్ళగానే అందరూ వాళ్ళ నాటకం నీ మొదలు పెడతారు.. మళ్లీ కడుపు పోయింది అని కంగారు పడిపోతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షిని అవమానించిన పల్లవి..మీనాక్షికి నిజం చెప్పిన అవని.. సెంటిమెంట్ సీన్..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలు దగ్గర స్టూడెంట్ గా మీనా.. ప్రభాకు బుర్ర గిర్రున తిరిగింది.. అరుణ్, సుమతి లవ్ ట్రాక్..

Karthika Deepam 2 Serial Today Episode June 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: బాలరాజు చేత శివనారాయణకు నిజం చెప్పించిన కార్తీక్

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని అవమానించిన పల్లవి..మీనాక్షికి నిజం చెప్పిన అవని.. సెంటిమెంట్ సీన్..

Brahmamudi Serial Today Episode June 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు షాక్ ఇచ్చిన రేఖ – అడ్డుగా నిలబడిన రాజు  

Telugu Tv Serials :  సీరియల్స్ కు డబ్బులు ఎలా వస్తాయో తెలుసా..? ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చేసిందిగా..

Illu illaalu pillalu Narmada : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మదా ఏం చదివిందో తెలుసా..?

Podarillu : ‘పొదరిల్లు’ ఫైనల్ స్టోరీ ఇదేనా..? అస్సలు ఊహించని ట్విస్ట్..

Big Stories

×