E-Paper
Advertisement

వస్త్ర వ్యాపారి గొప్ప మనసు.. దీపావళి కానుకగా ఉద్యోగులకు నోట్ల కట్టలు.. వీడియో వైరల్!

వస్త్ర వ్యాపారి గొప్ప మనసు.. దీపావళి కానుకగా ఉద్యోగులకు నోట్ల కట్టలు.. వీడియో వైరల్!
Advertisement

Diwali Bonus: దీపావళి పండుగ వచ్చిందంటే కంపెనీలూ తమ ఉద్యోగులకు స్వీట్ బాక్సులు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ గుజరాత్‌లోని సూరత్ నగరం వేదికగా ఓ వస్త్ర వ్యాపారి చేసిన వినూత్న ఆలోచన అందరి హృదయాలను గెలుచుకుంటోంది. వ్యాపారి రామస్వరూప్ ముండే తన వద్ద పనిచేసే 20 మంది సిబ్బందిని ఊహించని విధంగా ఆశ్చర్యపరిచారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నగదును బోనస్‌గా అందించి వారి జీవితాల్లో నిజమైన పండుగ వెలుగులను నింపారు.

భార్య చేతుల మీదుగా అందజేత

వస్త్ర వ్యాపారి బోనస్ ఇచ్చే పద్ధతి ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 10 రూపాయల నుంచి 500 రూపాయల నోట్ల కట్టలను అందంగా ఓ ప్లేటులో పేర్చి.. మహిళా ఉద్యోగులకు ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది. భార్య చేతుల మీదగా ఉద్యోగులకు ఈ నోట్ల కట్టలను అందించడం ప్రశంసలు అందుకుంటోంది. అంత పెద్ద మొత్తంలో లభించిన దీపావళి కానుకను చూసి ఉద్యోగులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొందరైతే కృతజ్ఞతతో ఆనందభాష్పాలు రాల్చారు.

Advertisement

‘ఉద్యోగులు.. నా సొంత కుటుంబం!’

ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని రామస్వరూప్ ముండే తెలియజేశారు. తమ వద్ద పనిచేసేవారిని కేవలం సిబ్బందిగా కాకుండా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తానని తెలిపారు. పండుగ రోజున వారి కుటుంబాల్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, విచారాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ బోనస్ ఇచ్చినట్లు చెప్పారు. ‘దీపావళి వెలుగులు నా ఒక్క ఇంట్లోనే కాదు. నా అభివృద్ధికి రాత్రింబవళ్లు కష్టపడే ప్రతి ఉద్యోగి ఇంట్లోనూ నిండాలి’ అని ఆయన పేర్కొనడం విశేషం.

Advertisement

Also Read: దీపావళి ముందు తీవ్ర విషాదం.. రోడ్డుపై లేడీ డ్రైవర్ బీభత్సం.. బైకర్‌ను 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన థార్!

నెట్టింట ప్రశంసల జల్లు

ఈ బోనస్ పంపిణీకి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. సదరు వస్త్ర వ్యాపారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘డబ్బు మనిషిని ఐశ్వర్యవంతుడిని చేస్తుందేమో. కానీ ఇలాంటి మంచి మనస్సు ఉన్నవారే అసలైన ధనవంతుడు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘భగవంతుడు అందరికీ ఇలాంటి యజమానినే ఇవ్వాలి. పేరుకు తగ్గట్టే ఆయన ప్రవర్తన కూడా గొప్పగా ఉంది’ అని మరొకరు కొనియాడారు. మరికొందరు నెటిజన్లు సరదాగా ఆ కంపెనీలో ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలని కామెంట్లు పెట్టారు.

Also Read: దీపావళి వేళ రికార్డు స్థాయి వ్యాపారం.. కేవలం ఢిల్లీలోనే రూ.లక్షల కోట్లకుపైగా.. దేశవ్యాప్తంగా ఎంతంటే

Tags

Related News

ఉద్యోగానికి దరఖాస్తు చేయనే లేదు.. విద్యార్థికి రూ.50 లక్షలు జీతం ఇస్తామని రెండు కంపెనీ ఆఫర్లు

దీపావళి వేళ రికార్డు స్థాయి వ్యాపారం.. కేవలం ఢిల్లీలోనే రూ.లక్షల కోట్లకుపైగా.. దేశవ్యాప్తంగా ఎంతంటే

గోల్డ్ లోన్ కాదు అప్పుల ఊబి.. మళ్లీ మళ్లీ రుణాలు తీసుకుంటున్న భారతీయులు.. ఈ సమస్యలు తప్పవన్న ఆర్థిక నిపుణులు

జొమాటో కొత్త ఫీచర్ చూశారా? ఇక 40 కి.మీ దూరం నుంచైనా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు!

జనవరి 1 నుంచి కొత్త చెక్ బుక్ రూల్స్.. రూ.50 వేలు దాటితే పాత చెక్కులు చెల్లవా? ఆర్‌బీఐ ఏమందంటే!

కాలేజీ చదువుతో పాటు బిజినెస్.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షలు సంపాదించిన స్టూడెంట్.. ఎలాగంటే

జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం లేదా? మీరు చేస్తున్న తప్పులివే

Big Stories

Advertisement
×