E-Paper
Advertisement

Kissik Talks: పెళ్లిపై రేఖ షాకింగ్ కామెంట్.. కాబోయే భర్తకు అలాంటి లక్షణాలు ఉండాలంటూ!

Kissik Talks: పెళ్లిపై రేఖ షాకింగ్ కామెంట్.. కాబోయే భర్తకు అలాంటి లక్షణాలు ఉండాలంటూ!
Advertisement

Kissik Talks: ఆనందం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేఖ వేదవ్యాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొదటి సినిమాతోనే ఊహించని పాపులారిటీ అందుకున్న ఈమె.. ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అందం , అభినయంతో, నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె కన్నడ నటిగా పేరు దక్కించుకొని.. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. అయితే కథల ఎంపిక విషయంలో కాస్త తడబడడం, అదే సమయంలో అనారోగ్య బారిన పడడంతో సినిమాలకు దూరమయింది.

పెళ్లి చేసుకోకపోవడంపై రేఖ క్లారిటీ..

మధ్యలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఒక బుల్లితెర షోలో కనిపించి.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచిన రేఖ తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ షో కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసింది. ఇక ఇందులో 40 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పై హోస్ట్ వర్ష ప్రశ్నించింది. ఇక దీనిపై రేఖ మాట్లాడుతూ..” ఇండియా మొత్తం మీద బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ , నేను మాత్రమే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా మిగిలిపోతామేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. మంచి అబ్బాయి ఇప్పటివరకు దొరకట్లేదు. నన్ను చూస్తే ఎవరికీ నమ్మకం కుదరదేమో. నన్ను చూస్తే ఎవరికైనా సరే ఎవరో ఒకరు లవర్ ఉండే ఉంటారు కానీ బయటకు చెప్పట్లేదు అనుకుంటారు. కానీ నేను మాత్రం నిజంగా ఇంకా సింగిల్ గానే ఉన్నాను అంటూ పెళ్లి చేసుకోకపోవడం క్లారిటీ ఇచ్చింది.

అలాంటివాడే భర్తగా రావాలి..

Advertisement

అలాగే కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ.. అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ ఒక 100 లక్షణాలతో పెద్ద లిస్ట్ అంటూ ఏమీ లేదు. ఈ భూమి మీద ఎవరూ పర్ఫెక్ట్ కాదు. నేను కూడా పర్ఫెక్ట్ కాదు. కాబట్టి వచ్చే వాడికి అలాంటి క్వాలిటీస్ ఉండాలని నేను కోరుకోను. కాకపోతే నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తి నా జీవితంలోకి వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అయితే నేను 5.6″ ఉన్నాను నాకంటే కాస్త హైట్ గా ఉంటే సరిపోతుంది. లేదంటే నాకంటే పొట్టిగా ఉంటే నేను ఏవండీ అని పిలవలేను కదా అంటూ సరదాగా వాఖ్యానించింది.

అభిమానులకు క్రేజీ ఆఫర్..

రేఖ మాట్లాడుతూ.. ముఖ్యంగా ఎవరైతే నన్ను ఇష్టపడతారో వారికి ఒక క్రేజీ ఆఫర్ ఇస్తున్నాను. నా వెనుక పడే వాళ్ళు నిజాయితీగా ఉండి, మంచి మనసున్న వాళ్లయితే డైరెక్ట్ గా నాకు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. Anandam@ Rekha ఇది నా ఇంస్టాగ్రామ్ ఐడీ.. ఆ మెసేజ్లు చూసి నాకు నచ్చితే రిప్లై ఇస్తాను. కాకపోతే నేను రిప్లై ఇచ్చేవరకు వెయిట్ చేయండి అంటూ కోరింది.

Advertisement

also read:Kissik Talks:హీరోయిన్ గజాలతో విభేదాలు.. రేఖ రియాక్షన్!

కర్మ కచ్చితంగా వెంటాడుతుంది..

ముఖ్యంగా ప్యూర్ లవ్ గురించి ఆమె మాట్లాడుతూ.. ఒకరితో మనం ట్రావెల్ చేస్తే ఆటోమేటిగ్గా వారు మనల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా లేదా అనే విషయం తెలుస్తుంది. ముఖ్యంగా ప్రేమలో మోసపోకుండా ఉంటేనే మంచిది. మోసపోతామేమో అనే ఆలోచన ఉన్నప్పుడు ప్రేమించకపోవడమే బెటర్ అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. ఇక మోసం చేసేవారికి ఏం చెప్తారు అనే విషయం పై మాట్లాడుతూ ఒకరు మనల్ని మోసం చేశారు అంటే.. వాళ్లను మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా కర్మ వెంటాడుతుంది అంటూ రేఖ తెలిపింది.

Related News

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

వర్షిణితో ముఖేష్ పులిహోర.. బిగ్ బాస్ హౌస్‌లో ఏంటా పనులు? పబ్లిక్ చూస్తోంది!

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×