Illu Illalu Pillalu Today Episode june 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తుంది. ఇంత తొందరగా నిద్ర లేచాను ఏంటి? అసలు నిద్ర పట్టడం లేదేంటి? నిజంగానే నేను ప్రేమలో ఉన్నానా అని ఆలోచిస్తూ ఉంటుంది.. ధీరజ్ కి తనకి మధ్య లవ్ ఉందో లేదో తెలుసుకోవడానికి బుక్ తీసుకుని బయటకు వస్తుంది. బయటకూర్చున్న ప్రేమను చూసి ధీరజ్ దెయ్యం అంటూ కేకలు వేస్తాడు.. ఏహే ఆపు దయ్యం కాదు నేనే అని ప్రేమ అంటుంది. ఇంత అర్ధరాత్రి బుక్కు పట్టుకుని ఏం రాస్తున్నావు అని ధీరజ్ అడుగుతాడు.. చదువుకుంటున్న కానీ ఇప్పుడు ఇదంతా నీకెందుకు అని ప్రేమ అడుగుతుంది. ధీరజ్ నేను నీకు ఒక విషయం చెప్పాలి అని ప్రేమ అడుగుతుంది. ఏంటి ఆ విషయం అర్ధరాత్రి కూర్చొని మాట్లాడాల్సిన అంత అర్జెంటు విషయం ఏంటో చెప్పు అని ధీరజ్ అంటాడు. నేను హోమ్ ట్యూషన్ చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు నాకోసం చాలా చేస్తున్నావు కదా నీకోసం నేను చేయాలి కదా అని అనగానే.. ధీరజ్ షాక్ అవుతాడు. నువ్వు ఇలాంటి డెసిషన్స్ అస్సలు తీసుకోకు. మొన్న ఎంత పెద్ద రచ్చ జరిగిందో తెలుసు కదా.. మళ్లీ ఇప్పుడు మరో రచ్చ కి దారి తీస్తావా నువ్వు అని ధీరజ్ అంటాడు. నామీద నీకు ఎంత బాధ్యత ఉందో నీ మీద కూడా నాకు అంతే బాధ్యత ఉంది నువ్వేం మాట్లాడద్దు అని ధీరజ్ లాంటిది.. వేదవతి మాత్రం కోడళ్లకు క్లాస్ పీకుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి కోడళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇక మీరు క్లాస్ చెప్పడం అయిపోతే నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని నర్మదా సెటైర్లు వేస్తుంది. ప్రేమ కూడా నేను కాలేజీకి వెళ్లాలని వెళ్ళిపోతుంది. శ్రీవల్లి కూడా వంట గదిలో నాకు పని ఉందని వెళ్ళిపోతుంది. వీళ్ళ ముగ్గురు నా మాట విన్నట్టా లేనట్టా అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ బయటకు వెళ్తుంటే నర్మదా ఆగు ప్రేమ నీ కళ్ళు ఎందుకు ఎర్రబడ్డాయి.. రాత్రంతా ధీరజ్ పై ప్రేమను ఎలా చూపించాలని ఆలోచిస్తున్నావు కదా అని అడుగుతుంది. అది విన్న ప్రేమ ఇదేంటి అక్క నా పక్కన కూర్చొని చూసినట్లు చెబుతుంది అని ఆలోచిస్తుంది. అదేం లేదు అక్క నేను చదువుకుంటూ ఉన్నాను.. నువ్వు ఏదేదో అనుకుంటున్నావు అనేసి ప్రేమ నర్మదతో అంటుంది.
నర్మద మాత్రం ప్రేమ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టదు. ఏంటి? రాత్రంతా ధీరజ్ ని చూడకుండా నువ్వు చదువుకుంటూనే ఉన్నావా అని గుచ్చి గుచ్చి అడుగుతుంది.. కానీ ప్రేమ మాత్రం నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు ఏంటి అక్క అనేసి అడుగుతుంది. ఆ తర్వాత ధీరజ్ ఇప్పుడు వస్తాడు కదా నిన్ను చూడకుండా వెళ్ళిపోతే మీ ఇద్దరి మధ్య ఏమీ లేనట్టు. లేదా నువ్వు చూస్తే మాత్రం కచ్చితంగా మీ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైనట్టే అని నర్మదా పరీక్ష పెడుతుంది. ఇంట్లోంచి బయటకు వస్తాడు ధీరజ్. ప్రేమ నన్ను చూడకుండా వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటుంది. కానీ ధీరజ్ మాత్రం ప్రేమను చూసి ఏమైంది నీకు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్ నిన్న రాత్రి భోజనం పెడుతూ వింతగా ప్రవర్తించావు.. ఇప్పుడు ఇలా ఏదేదో చేస్తున్నావేంటి ఏమైంది అసలు నీకు? హైదరాబాద్ ఎర్రగడ్డకి ఏమైనా తీసుకెళ్లాల అని అడుగుతాడు.
ఏమి కాలేదు నీకు టైం అయింది కదా నువ్వెళ్ళు అనేసి ప్రేమ అంటుంది. కానీ ధీరజ్ మాత్రం నువ్వు వెళ్ళేది కాలేజీకె కదా నేను డ్రాప్ చేస్తాను రా అనేసి అంటాడు. ప్రేమ వద్దులే అని అంటుంది. ధీరజ్ మాత్రం వదలకుండా కాలేజ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను రా అనేసి అంటాడు. దానికి నర్మదా కన్ఫామ్ మీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనేసి అంటుంది.. ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్తారు. ప్రేమ సరదాగా ధీరజ్ తో మాట్లాడుతుంది.
అటు శ్రీవల్లి భాగ్యం కు ఫోన్ చేసి పది లక్షల విషయాన్ని ఎలాగైనా తేల్చుకోవాలని అనుకుంటుంది. ఈయన ఈ పది లక్షలు ఇచ్చేంతవరకు నన్ను వదిలేలా లేరు. రాత్రంటే ఏదో నర్మదా ప్రేమల మీద చెప్పేసి మేనేజ్ చేశాను. కానీ ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలి అని కంగారు పడుతూ ఉంటుంది.. శ్రీవల్లి కంగారుపడినట్లుగానే చందు శ్రీవల్లి అంటూ పిలుస్తాడు. శ్రీవల్లి మాత్రం తప్పించుకోలేక వంట గదిలో ఏదో పని ఉందన్నట్లు మేనేజ్ చేస్తుంది. చందు రాగానే మీ అమ్మకు ఫోన్ చేసావా? 10 లక్షలు గురించి మీ అమ్మ ఏం చెప్పింది అని అడుగుతాడు. వల్లి మాత్రం అయ్యో బావ బయట వర్షం వచ్చేలా ఉంది బట్టలు తీయాలి అని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది.
శ్రీవల్లినీ వదలకుండా చందు బయటకు వస్తాడు. బట్టలు ఆరేసినవి తీయాలన్నావ్..? ఇప్పుడు ఆరేస్తున్నావు ఏంటి..? అసలు ఏం జరుగుతుంది నీకు తెలియట్లేదా అని సీరియస్ అవుతాడు. కానీ శ్రీవల్లి మాత్రం బయటికి వెళ్లిపోయి చందు నుంచి తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. చివరికి మాత్రం చందు కి శ్రీవల్లి అడ్డంగా దొరికిపోతుంది.. శ్రీవల్లి నీకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో అడుగుతున్నాను అది సేటు వచ్చి ఆఫీసులో కూర్చున్నాడు. నాకు ఆఫీస్ కి వెళ్ళాలంటే భయంగా ఉంది అని చందు అంటాడు.
అయితే శ్రీవల్లి ఇక తప్పించుకోడానికి వీలు లేకుండా చందు అడ్డుపడతాడు. అమ్మకు ఫోన్ చేయమని చెప్పాను కదా మరి ఎందుకు నువ్వు ఫోన్ చేయలేదు ఆ సేటు వచ్చి నా పీకల మీద కూర్చున్నాడు. నాన్నకు చెప్తాను అని చెప్తున్నాడు. అయితే నువ్వు ఇంకా మీ అమ్మకు ఫోన్ చేయలేదా అని అడుగుతాడు. కానీ శ్రీవల్లి మాత్రం నేను ఫోన్ చేశాను బావ. ఇదంతా కాదు కానీ.. పది రోజుల్లో ఇస్తానని చెప్పారు మన పెళ్లి ఆగిపోతుందని నేను నా తల మీదకు తెచ్చుకొని పది లక్షలు అప్పు చేసి తీసుకొచ్చి మీకు ఇచ్చాను. ఇంకా నిర్లక్ష్యంగా మీ అమ్మ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా చేస్తున్నారు. మా నాన్నకు చెప్తే ఆ తర్వాత ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని శ్రీవల్లితో చందు అంటాడు.
ఇదంతా కాదు గాని మీ అమ్మకు ఫోన్ చేసి ఒకసారి అడుగు అని చందు అంటాడు. కానీ శ్రీవల్లి బయటకు వెళ్తుంటే చందు ఆపి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ 10 లక్షలు మేటర్ మనిద్దరిదే కదా.. నువ్వు ఇక్కడే ఫోన్ మాట్లాడు అని అంటాడు. శ్రీవల్లి ఫోన్ చేయగానే భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తావ్ ఏంటమ్మా.. నువ్వు అడ్డంగా ఇరికించావే నన్ను అని శ్రీవల్లి తిట్టుకుంటుంది. నేను వేరే ఊరికి వెళ్లాను కదా.. రెండు రోజుల్లో ఆ డబ్బులు ఇచ్చేస్తాను అని భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది.. చందు ఎందుకు ఇలా చేస్తుంది మీ అమ్మ కొంచెం కూడా ఆలోచించదా అని సీరియస్ అవుతాడు. అలాగే రెండు రోజుల్లో కనుక మీ అమ్మ డబ్బులు ఇవ్వకపోతే నేను అసలు ఇంటికి కూడా రాను తెలుసా అని శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. అటు ధీరజ్ ప్రేమ వేరే వ్యక్తితో మాట్లాడడం చూసి సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..