BigTV English

Trump Travel Ban: మా దేశానికి రావద్దు.. ఆ 12 దేశాలకు ట్రంప్ బిగ్ షాక్

Trump Travel Ban: మా దేశానికి రావద్దు.. ఆ 12 దేశాలకు ట్రంప్ బిగ్ షాక్

Trump Travel Ban: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ ఉగ్రవాదుల నుంచి రక్షించేందుకు మరో 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ 12 దేశాల వల్ల అమెరికాకు పెను ప్రమాదం పొంచి ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కొత్తగా నిషేధం విధించిన దేశాల్లో అఫ్ఘానిస్తాన్, మయన్మార్‌, ఛాద్‌, కాంగో, ఎరిత్రియా, హైతీ, ఇరాన్‌, లిబియా, సొమాలియా, సుడాన్‌, యెమన్‌ దేశాలపై పూర్తి బ్యాన్‌ విధించగా.. బురుండి, క్యూబా, సియెర్రా లియోన్‌, టోగో, తుర్కిమెనిస్తాన్, వెనిజులపై తాత్కాలికంగా నిషేధం విధించారు.


ఈ సందర్భంగా కొలరాడో ఘటనను ప్రస్తావించారు ట్రంప్. ఈజిప్ట్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడి చేశారన్నారు ట్రంప్. తాము నిషేధం విధించిన దేశాల కారణంగా అమెరికాకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని తెలిపారు. అంతేకాదు ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయన్నారు. ఈ నిషేధం కారణంగా బీ1, బీ2, F, M, J కేటగిరి వీసాలను ఇక పరిమితం చేయనున్నారు.

ఇరాన్, క్యూబా, అఫ్ఘానిస్తాన్‌లో ఉగ్రవాద చర్యలు ఎక్కువగా ఉండటంతో నిషేధం విధించామని.. ఇక ఇతర దేశాల ప్రజలు వీసాలపై అమెరికాకు వచ్చి.. ఇక్కడే ఉండిపోతున్నారని అమెరికా చెబుతోంది. ఛాద్‌ నుంచి B1, B2 వీసాలపై అమెరికాకు వచ్చి తిరిగి వెళ్లనివారి సంఖ్య 49.54 శాతంగా ఉందని.. అదే సమయంలో ఎరిత్రియా విషయానికి వస్తే ఇది 55.43 శాతంగా ఉందని చెబుతున్నారు.


ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించడం ఇదే తొలిసారి కాదు. తన ఫస్ట్‌ టర్మ్‌లో కూడా ఏడు ఇస్లామిక్ దేశాలపై నిషేధం విధించారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చే వారిని ఎలాంటి తనిఖీలు చేయకుండా ఇకపై అంగీకరించేది లేదన్నారు. అమెరికా ప్రజలను కాపాడుతానని ట్రంప్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటున్నారని వైట్‌ హౌజ్‌ ప్రకటించింది.

Also Read: ఇండియా, అమెరికాలోకి చైనా భయానక ఫంగస్.. ‘ఆగ్రో’ టెర్రరిజానికి డ్రాగన్ కుట్ర?

ఇదిలా ఉంటే.. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు యూఎస్ లో ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ బుధవారం.. ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సైన్ చేశారు. ఈ చర్య ట్రంప్ ప్రభుత్వానికి, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది.

అంతేకాకుండా ఇప్పటికే హార్వర్డ్‌తో సంబంధం ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను.. ప్రారంభించే అధికారాన్ని ఈ ఉత్తర్వు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కట్టబెట్టింది. ఇది అమెరికా ఉన్నత విద్యా విధానంలో, అంతర్జాతీయ విద్యార్థుల రాకపోకల విషయంలో ఒక కీలక మార్పుగా పరిగణిస్తున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×