Ram Charan:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కరోనా సమయంలో ఎన్నో జాగ్రత్తలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసి, వారి ఆరోగ్యం మెరుగుపడడంలో తన వంతు సహాయం చేసింది. ఇక అప్పటినుంచి నిత్యం ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్గా పలు విషయాలను సోషల్ మీడియాలో పంచుకునే ఈమె.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో తన తల్లి గురించి చేసిన ఒక ఆసక్తికర పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఉపాసన పిన్ని ప్రీత రెడ్డి (Preetha Reddy), ఉపాసన తల్లి శోభన (Shobhana) చేసిన సైక్లింగ్ గురించి షేర్ చేసిన పోస్టును ఇప్పుడు ఉపాసన తన సోషల్ మీడియా పోస్టులో పెట్టింది. ఇక ఈ పోస్టు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
హైదరాబాదు నుంచి చెన్నైకి సైక్లింగ్ చేసిన ఉపాసన తల్లి..
ఈ పోస్టులో ఏముంది అనే విషయానికి వస్తే.. ఎటువంటి హడావిడి లేకుండా.. ఏ మెడల్ లేదా ఏదైనా మూమెంట్ కోసం ఎదురు చూడకుండా మా అమ్మ (ఉపాసన తల్లి శోభన) హైదరాబాదులోని తన ఇంటి వద్ద నుంచి.. చెన్నైలోని తన తల్లిదండ్రుల ఇంటి వరకు సైక్లింగ్ చేస్తూనే వెళ్లారు.. సుమారుగా 600 కిలోమీటర్లు ఆమె సైకిల్ మీదే వెళ్లారు.60 ఏళ్ల వయసులో పైగా మోకాలికి ఆపరేషన్, నెక్ లో ప్లేట్స్..ఇంకా పలు గాయాలు ఉన్నప్పటికీ తనకు తాను ఛాలెంజింగ్ గా తీసుకొని అంత దూరం సైక్లింగ్ చేసిందని ఉపాసన తెలిపింది.
ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగానే శోభన కామినేని ఇలాంటి సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఉపాసన తల్లి శోభన కామినేని చేసిన ఈ సాహసానికి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో కూడా అనారోగ్యాన్ని జయించి ఆమె చేసిన ఈ సాహసం ఎంతోమందికి ఆదర్శం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ: HHVM: కన్ఫ్యూజన్లో పడ్డ చిత్ర బృందం.. ఇప్పటికైనా ఫిక్స్ అవుతారా?
ఉపాసన కెరియర్..
ఉపాసన గురించి ప్రస్తావన వస్తే ఈమె రామ్ చరణ్ సతీమణి మాత్రమే కాదు అంతకుమించి అని చెప్పవచ్చు. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు కూడా. వైద్యరంగంలో ఈమె చేసిన విశిష్ట సేవకు ఎన్నో అవార్డులు సైతం గెలుపొందారు. అంతేకాదు అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా పనిచేస్తున్న ఈమె డౌన్ టు ఎర్త్ పర్సన్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా డబ్బును చూడకుండా మనిషి వ్యక్తిత్వాన్ని మాత్రమే చూస్తూ వారి కోసం తపన పడుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో కూడా ముందుండే ఉపాసన కష్టం వచ్చింది అంటే సహాయపడడంలో ముందుంటుంది. మొత్తానికైతే మెగా ఫ్యామిలీకి తగ్గ కోడలు గానే పేరు సొంతం చేసుకుంది ఉపాసన. ఒకవైపు తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు కోడలిగా, భార్యగా , తల్లిగా అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుంది.