Illu Illalu Pillalu Today Episode june 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి కోడళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అందరు కలిసి ఉండాలని చెప్తుంది. మీరు క్లాస్ చెప్పడం అయిపోతే నేను ఆఫీస్ కి వెళ్ళాలి అని నర్మదా సెటైర్లు వేస్తుంది. ప్రేమ కూడా నేను కాలేజీకి వెళ్లాలని వెళ్ళిపోతుంది. శ్రీవల్లి కూడా వంట గదిలో నాకు పని ఉందని వెళ్ళిపోతుంది. వీళ్ళ ముగ్గురు నా మాట విన్నట్టా లేనట్టా అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ బయటకు వెళ్తుంటే నర్మదా ఆగు ప్రేమ నీ కళ్ళు ఎందుకు ఎర్రబడ్డాయి.. రాత్రంతా ధీరజ్ పై ప్రేమను ఎలా చూపించాలని ఆలోచిస్తున్నావు కదా అని అడుగుతుంది. అది విన్న ప్రేమ ఇదేంటి అక్క నా పక్కన కూర్చొని చూసినట్లు చెబుతుంది అని ఆలోచిస్తుంది. అదేం లేదు అక్క నేను చదువుకుంటూ ఉన్నాను.. నువ్వు ఏదేదో అనుకుంటున్నావు అనేసి ప్రేమ నర్మదతో అంటుంది. మొత్తానికి నర్మద వీరి ప్రేమ మ్యాటర్ కన్ఫామ్ చేస్తుంది. ధీరజ్ ప్రేమ వేరే అబ్బాయితో మాట్లాడుతుంది. అది చూసిన కుళ్ళుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమను కాలేజీలో డ్రాప్ చేస్తానని ధీరజ్ తీసుకుని వెళ్తాడు.. అయితే అర్జెంటు డెలివరీ ఉంది. నేను వెళ్తాను అని ధీరజ్ ప్రేమను బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోతాడు. ప్రేమ అక్కడే ఉన్న తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అతనితో చనువుగా నవ్వుతూ మాట్లాడటం చూసి ధీరజ్ కుళ్ళు కుంటాడు. ప్రేమ దగ్గరికి అటూ ఇటూ రెండు మూడు సార్లు తిరుగుతాడు. కానీ ప్రేమ మాత్రం పట్టించుకోకుండా అతనితో మాట్లాడుతూ ఉంటుంది.. ఇక ప్రేమ ఫ్రెండు తన ఫ్రెండు రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి అతనితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు.
నేనేం శత్రువుతో మాట్లాడలేదు కదా మన క్లాస్ అతనితోనే మాట్లాడుతున్నాను దాంట్లో తప్పేంటి అని ప్రేమ వాదిస్తుంది.. కానీ నువ్వు క్లాసులో చాలామంది అమ్మాయిలతో మాట్లాడతావు కదా.. నీకు అమ్మాయిల్లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా.. నువ్వు వాళ్లతోనే మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు అబ్బాయిలతో మాట్లాడతావు.. నువ్వు అబ్బాయిలతో మాట్లాడితే నాకు కోపం వస్తుంది అనేసి ధీరజ్ ప్రేమకు వార్నింగ్ ఇస్తాడు.. ధీరజ్ వెళ్తుంటే తన ఫ్రెండు ఎదురుగా కనిపిస్తాడు. ఏంట్రా అశోక్ ఇక్కడ ఉన్నావేంటి? అని అంటే ఏం లేదురా నా బైక్ నాకు కావాలి నా బైక్ నాకు ఇచ్చేసేయ్ అనేసి అడుగుతాడు.
అదేంట్రా నీ దగ్గర రెండు బైక్లు ఉన్నాయి అన్నావు కదా.. నాకు ఒక బైక్ ఇచ్చావు ఎప్పుడైనా ఇవ్వు అని అన్నావు కదా ఇప్పుడేంటి సడన్ గా ఇలా అడుగుతున్నావ్ అంటే.. ఆ బైకు కొన్ని కారణాల వల్ల అమ్మేశాను రా.. ఇప్పుడు నా బైక్ నాకు ఇచ్చేసేయ్ అని తీసుకొని వెళ్ళిపోతాడు.. ధీరజ్ ఇంకా చేసేదేమీ లేక బైకు ని తన ఫ్రెండ్ కి ఇచ్చేస్తాడు. ఇదంతా చూస్తున్న విశ్వం నీ మీద పగ తీర్చుకోవాలి రా నా చెల్లెల్ని లేపికెళ్ళి పెళ్లి చేసుకున్నావు కదా.. అని అనుకుంటాడు.. ఇక ధీరజ్ చేసేది ఏమీ లేక రైస్ మిల్లు దగ్గరికి వెళ్లి తిరుపతిని బండి కావాలని అడుగుతాడు.
అటు శ్రీవల్లి వేదవతి ఒంటరిగా ఉండడం చూసి బుట్టలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. నీ వేదవతి మాత్రం నర్మద ఉంటే నాకు చాలా టైం పాస్ అయ్యేది గలగల మాట్లాడుతుంది. దానికోసం నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటుంది. శ్రీవల్లి అక్కడికి వచ్చి అత్తయ్యని ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని అనుకుంటుంది. కానీ వేదవతి మాత్రం నీతో మాట్లాడితే ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టేస్తావ్ అనుకొని లోపల ఏదైనా పని ఉంటే వెళ్ళవమ్మా అనేసి అంటుంది.
అప్పుడే నర్మదా రావడం చూసి ఇదేంటబ్బా ఆరు గంటలకు రావాల్సింది మూడు గంటలకే వచ్చేసిందని అనుకుంటుంది. నర్మద దగ్గరకెళ్ళి ఏంటి నువ్వు ఇంత తొందరగా వచ్చేసేవ అని అడుగుతుంది. దానికి నర్మదా నాకు వాంతులు అయ్యాయి అత్తయ్య అని అనగానే వేదవతి ఎగిరి గంతేస్తుంది.. కచ్చితంగా ఇది అదే అని సంతోషంలో మునిగి తేలుతుంది. అయితే నువ్వు కచ్చితంగా నెల తప్పవని వేదవతి అంటుంది. నేను నెల తప్పడానికి మీరు మా మధ్య ఆ తంతు జరిపించలేదు కదా అని నర్మదా అంటుంది..
అయ్యో నేను ఈ సంగతే మర్చిపోయినమ్మ.. ఇవాళే మీ ఇద్దరికీ శాంతి ముహూర్తం పెట్టిస్తాను అని అంటుంది వేదవతి. అయితే నర్మద మాత్రం మా ఇద్దరికీ శోభనం జరిగిపోయింది అని అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. ఇక ధీరజు సైకిల్ తీసుకొని డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…