Musk Vs Trump: అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి పనిచేసిన ఎలాన్ మస్క్.. ఆయనతో తీవ్రంగా విభేదిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.
మరో కొత్త పార్టీకి ఓటింగ్ కోరిన ఎలాన్ మస్క్
తాను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారని హాట్ కామంట్స్ చేశారు ఎలాన్ మస్క్. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారని. సెనెట్‌లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా కొత్త పార్టీ పెట్టవచ్చా అని అభిమానులను ప్రశ్నించారు.80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అని అడిగారు.
బ్యూటీఫుల్ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత
ట్రంప్ సర్కారులో కీలక పాత్ర పోషించారు ఎలన్ మల్క్. ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్‌కు హెడ్‌గా పనిచేసిన మస్క్ ఇటీవల ఆ పదవికి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి ఎలన్ మస్క్ తన అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు. ట్రంప్ తెచ్చిన బ్యూటీఫుల్ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
అసలేం జరుగుతోంది ట్రంప్ వర్సెస్ మస్క్ మధ్య?
పొట్టోడ్ని పొడుగోడు కొడితే పొడుగోడ్ని పోచమ్మ కొట్టిందని.. ఈ ప్రపంచం మొత్తాన్ని ట్రంప్ చావ గొడుతుంటే అలాంటి ట్రంప్ ని కూడా మస్క్ మాము ఇరక్కుమ్మేస్తున్నాడా? తాజాగా డోజ్ లోంచి బయటకొచ్చాడా? ఇప్పుడు చూస్తే ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీస్కున్న బిగ్ బిల్ పై కిల్ ద బిల్ అసే స్థాయిలో పోరాటం చేస్తున్నాడు. మస్క్ ఎందుకిలా చేస్తున్నారు? ఆయనకీ బిల్ కారణంగా వచ్చే నష్టమేంటి? అసలేం జరుగుతోంది ట్రంప్ వర్సెస్ మస్క్ మధ్య?
ట్వీట్ల వర్షం కురిపిస్తున్న ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్‌ల మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం ఆరోపణలతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా.. ట్రంప్‌ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ అభిప్రాయపడ్డారు. దీనితో పాటు ట్రంప్‌పై సంచలన ఆరోపణలకు దిగాడు మస్క్. పెద్ద బాంబులాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చిందని ట్వీట్ చేసి వివరాలు వెల్లడించాడు.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం లేదంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే విధంగా ఎప్ స్టీన్ ఫైల్స్ విషయంలో ఆసక్తి కూడా పెరిగింది.
ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్
ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్..పై మస్క్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ పేరులో బిగ్, బ్యూటిపుల్ అనే శబ్ధాలను బట్టీ చెప్పొచ్చు. ఈ బిల్ మీద ట్రంప్ సర్కార్ కి ఎంతటి గొప్ప.. నమ్మకముందో. ఇది ఎంతో అందమైన పెద్ద బిల్లుగా వీరు భావించారంటే దాని అర్ధమేంటి? భారీ ఎత్తున ఈ బిల్ ట్రంప్ సర్కార్ కి లాభాలను తీసుకొచ్చి పెట్టేదనేగా అర్ధం.
ఈ బిల్లును చీల్చి చెండాడుతున్న మస్క్
ఈ బిల్లునే చీల్చి చండాడుతున్నాడు మస్క్. ఈ బిల్లుపై మాట్లాడకుండా నేను ఉండలేక పోతున్నాను. ఇదొక చెత్త బిల్లు అన్న అర్ధమొచ్చేలా చెడమడా ఈ బిల్లును తీవ్ర స్థాయిలో తిట్టి పోశాడు. అంతే కాదు.. దీని కారణంగా.. దేశ బడ్జెట్ లోటు 2. 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుంది. అమెరికన్లపై భరించలేని రుణభారాన్ని పెంచుతుంది. ఒక పక్క డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ- ప్రభుత్వ ఖర్చు ఎలా తగ్గించాలో చూస్తుంటే.. ఈ బిగ్ బిల్లు దానికి రివర్స్ లో పని చేసేలా కనిపిస్తోంది. ఈ బిల్లుకు ఓటు వేసిన వారు సిగ్గు పడాలి. వాళ్లేం చేశారో వాళ్లకే తెలుసంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశాడు మస్క్.
మస్క్ కోసం ట్రంప్ నిర్ణయం మారదు- వైట్ హౌస్
అంతే కాదు అమెరికాను ఇలా దివాలా తీయిస్తుంటే.. దేశపౌరులుగా మీకు బాధ్యతుండక్కర్లా.. అంటూ హితవు పలికారు మస్క్. అయితే మస్క్ విమర్శలను వైట్ హౌస్ పిచ్చ లైట్ తీస్కుంది. ఈ బిల్లు గురించి మస్క్ అభిప్రాయమేంటో.. ట్రంప్ కి బాగా తెలుసు. ఆయన ఒపీనియన్ ద్వారా ట్రంప్ నిర్ణయం మారదు. ఇదొక గొప్ప బిల్లు. దీన్ని ట్రంప్ తప్పక కంటిన్యూ చేస్తారంటూ.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు.
మస్క్ ఈ బిల్లును ఎందుకంత వ్యతిరేకిస్తున్నారు?
మస్క్ ఈ బిల్లును ఎందుకంత వ్యతిరేకిస్తున్నారు? ఆయన పాయింటాఫ్ వ్యూ రీజన్స్ ఏమై ఉంటాయి? అని చూస్తే.. మొదట రాజకీయాల్లో ట్రంప్ తో పాటు కలసి పని చేస్తూ వచ్చిన మస్క్ కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయ్. బేసిగ్గా మస్క్ స్పేస్ ఎక్స్, టెస్లా వంటి కంపెనీలకు సీఈవో. కానీ మస్క్ ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించి.. ఆయన రెండో సారి కూడా గద్దెనెక్కే వరకూ సపోర్టింగా ఉంటూ వచ్చారు. తన విజయంలో ఇంతటి సపోర్టునిచ్చిన మస్క్ కి ట్రంప్ సైతం భారీ ఎత్తున ప్రాధాన్యతనిస్తూ వచ్చారు.
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈఓ మస్క్
ఎప్పుడైతే ఆయన ట్రంప్ పరిపాలనలోనూ ఇన్ వాల్వ్ అవుతూ వచ్చారో.. తన వ్యాపారాలకు నష్టం రావడం మొదలైంది. మరీ ముఖ్యంగా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుకు ఎంత అందంగా ఉన్నా అది అమల్లోకి వస్తే తన టెస్లా అమ్మకాలను వికారం చేస్తుందని గుర్తించిన మస్క్.. వెంటనే ఎస్కేప్ ప్లాన్ వేశారు. దీంతో ఆయన డోజ్ నుంచి బయటకు రావాలని నిర్ణయించారు. ఈ విషయంలో ట్రంప్ కూడా గ్రాండ్ ఫేర్ వెల్ పార్టీ ఇచ్చారు. తనకింతటి సహకారమందించిన మస్క్ కి థాంక్స్ చెప్పారు. కానీ మస్క్ మాత్రం ట్రంప్ కి రిటర్న్ థాంక్స్ చెప్పలేని దుస్థితి.
టెస్లాకి పాత చట్టం ప్రకారం 7500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్
ప్రస్తుత విధానం ప్రకారం.. టెస్లా ఈవీల కొనుగోలుపై 7500 డాలర్ల ట్యాక్స్ క్రెడిట్ వెసలుబాటు ఉంది. ఉపయోగంలో ఉన్న ఈవీలకు కూడా 4 వేల డాలర్ల ట్యాక్స్ ఫెసిలిటీ ఉంది. గత బైడెన్ హయాంలో అవలంభించిన పన్ను విధానాల కారణంగా.. టెస్లా అమ్మకాలు బాగా ఊపందుకున్నాయి. ఒక వేళ బిగ్ బిల్ గానీ అమలైతే.. తాము తమ కస్టమర్లకు ఇచ్చే మినహాయింపులను తగ్గించుకోవల్సి వస్తుంది. దీంతో ఈవీ మార్కెట్ లీడర్ టెస్లాకు తీవ్ర నష్టం మిగిల్చేలా తెలుస్తోంది. 1. 2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది.
మస్క్ ఫ్రెండ్ ఐజాక్ మాన్ ను నాసా చీఫ్ గా నియమించని ట్రంప్
మస్క్ మిత్రుడు,వ్యాపార భాగస్వామి అయిన జారెడ్ ఐజాక్ మాన్ ను నాసా చీఫ్ గా నియమిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఎందుకో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీస్కున్నారు. ఈ విషయంలోనూ మస్క్ మనసు విరిగినట్టుగా భావిస్తున్నారు. దీంతో ట్రంప్ తో పెట్టుకుంటే మనకు పెద్దగా ప్రయోజనం లేదని మస్క్ ఫీలైనట్టుగానూ అంచనా వేస్తున్నారు. ఈ విషయంలోనూ అసంతృప్తికి లోనైన మస్క్ ట్రంప్ సర్కార్ తో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతున్నట్టు అంచనా వేస్తున్నారు.
మస్క్ కి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత
ఇక డోజ్ కి మస్క్ ఎప్పుడైతే.. సలహాదారుగా నియమితులయ్యారో.. అప్పటి నుంచీ మస్క్ కి తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. డోజ్ ద్వారా ఖర్చు తగ్గించమని ట్రంప్ కోరడం. అందుకు తగిన విధంగా ఆయన కొందరు ఉద్యోగులను తొలగించడం.. మెడికేడ్ వంటి కార్యక్రమాల బడ్జెట్ కోతలు.. ఇలా పలు రకాలుగా ప్రజా వ్యతిరేఖ చర్యలకు పాల్పడాల్సి వచ్చేది. దీంతో ప్రజల్లో మస్క్ కి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశమేర్పడింది. ఇది గుర్తించిన మస్క్.. ఒక వ్యాపార వేత్తగా తానిలాంటి రాజకీయ ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల లాభం లేదని భావించి వెనక్కు తగ్గినట్టుగా చెబుతున్నారు.
టెస్లా షోరూములు ధ్వంసం, అమ్మకాలు ఢమాల్
రాజకీయంగా ఎప్పుడైతే ఆయన ట్రంప్ తో అంటకాగడం మొదలు పెట్టారో.. అప్పటి నుంచి మస్క్ వ్యాపారాలకు తీవ్ర అంతరాయాలు ఎదురవడం మొదలైంది. ఇటు బహిరంగ నిరసనలు మాత్రమే కాదు అటు ఆన్ లైన్ పరంగానూ మస్క్ వ్యతిరేకత భారీగా పెరిగింది. దీంతో పాటు హత్య బెదిరింపులు కూడా పెరిగాయి. ఎన్నో హింసాత్మక ఘటనలు సైతం నమోదయ్యాయి. వీటికి టెస్లా టార్గెట్ అయ్యింది. టెస్లా షోరూములు ధ్వంసం కాగా, టెస్లా వాహన అమ్మకాలు అమాంతం పడిపోయాయి. మరీ ముఖ్యంగా మస్క్ కంపెనీ షేర్లు సగానికి సగం పడిపోయాయి. నికర విలువ వంద బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ విషయంలోనూ ట్రంప్ కారణంగా మస్క్ దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది.
మస్క్ సంపద నికర విలువ 100 బి. డా. కి తగ్గుదల
ఈ విషయంలో మస్క్ చెప్పేదేంటంటే నేను పరిపాలనకు వ్యతిరేకంగా మాట్లాడాలనుకోవడం లేదు. కానీ పరిపాలన చేస్తున్న ప్రతి తప్పిదానికి బాధ్యత వహించాలుకోవడం లేదంటారు. అంటే ప్రభుత్వం చేసే ప్రతిదీ తనకేం సంబంధం? అన్నది మస్క్ వాదన. కానీ జనం అలా అనుకోవడం లేదు. అన్నిటికీ మస్క్ కే సంబంధం అంటూ ఆయన కంపెనీలపై ఆ ప్రభావం పడుతోంది.
ట్రంప్- మస్క్’బ్రొమాన్స్’ కి అనూహ్యంగా బ్రేకులు
ఇక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించి వెరిజోన్ కి చెందిన 2. 4 బిలియన్ డాలర్ల ఒప్పందం రద్దు చేసుకోవాలని సూచించారు మస్క్. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కాంట్రాక్టును స్పేస్ ఎక్స్ కి మార్చాలని సూచించారు. అయితే ఇది కూడా ఎదురు కొట్టింది. మస్క్ ప్రభుత్వంలో చేరిందే.. స్వప్రయోజనాల కోసమన్న కోణంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కారణాలన్నిటింతో ట్రంప్- మస్క్’బ్రొమాన్స్’ కి అనూహ్యంగా బ్రేకులు పడ్డం మొదలైంది.
ఇంతకీ మస్క్ కి పొలిటిక్స్ ఎందుకు కలసి రాలేదు?
బేసిగ్గా భారత్ వంటి దేశాల్లో వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తే బాగా కలసి వస్తుంది. కానీ అమెరికాలో ఇందుకు రివర్స్ గేర్ నడుస్తోందా? అంటే మస్క్ విషయంలో చూస్తే అలాగే చెప్పాల్సి ఉంటుంది. మస్క్ ఒక సీఈఓగా తీస్కునేలాంటి డెసిషన్స్ పరిపాలనలో సాధ్యం కావడం లేదా? అంటే అదే నిజమని తెలుస్తోంది. ఇంతకీ మస్క్ కి పొలిటిక్స్ ఎందుకు కలసి రాలేదు?
ట్రంప్ ఎదుటే రూబియోకి మస్క్ కి గొడవ?
బిగ్ బిల్ దేశాన్ని దివాలా తీయిస్తుందంటోన్న మస్క్ట్రంప్ సర్కార్ రెండో సారి కొలువైన తర్వాత జరిగిన ఘటన. డోజ్ చీఫ్ గా ఉద్యోగుల్లో కోత విధించేలా నిర్ణయం. అయితే ఇక్కడే విదేశాంగ మంత్రి రూబియోకి- మస్క్ కి ట్రంప్ ఎదుటే గొడవైందంటారు. తాను తొలగించక ముందే 1500 మంది ఉద్యోగులు స్వయంగా తప్పుకున్నారని అంటారు రూబియో.. మస్క్ చెప్పినట్టు తప్పించాలంటే వారిని తిరిగి ఉద్యోగాల్లో తీసుకుని మరీ తొలగించాల్సి ఉంటుందని సెటైర్లు వేశారట విదేశాంగ మంత్రి. అప్పట్లో ఇదో సంచలన వార్తగామారింది. దీనిపై ట్రంప్ సైతం ఖండనలు ఇవ్వాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని ఖండించిన ట్రంప్
బిజినెస్ డైనమిక్స్ కి పొలిటికల్ డైనమిజానికి చాలా చాలా తేడా ఉంటుంది. ఒక అధినేత మాట కంపెనీల్లో శిరసావహిస్తారు. అదే ప్రజల విషయంలో అలా ఉండదు. ఇక్కడ స్వేచ్ఛ పీక్ స్టేజ్ లో ఉంటుంది. దీంతో ఏ చిన్నతేడా వచ్చినా రచ్చ రచ్చ అవుతుంటాయన్నీ.
2024 ఎలెక్షన్లో 288 మి. డా. విరాళం ఇచ్చిన మస్క్
వాషింగ్టన్ పోస్ట్ చెప్పే కథనాలప్రకారం 2024 యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్ కోసం మస్క్ ఇచ్చిన విరాళం.. 288 మిలియన్ డాలర్లు. ఈమొత్తం ఇండియన్ రుపీస్ లో చెబితే సుమారు 2500 కోట్లు. అందుకే కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని నేరుగా అడిగేశాయి కూడా. ఇకపై మీ విరాళాల వెల్లువ ఇలాగే కొనసాగుతుందా? అని. అలాంటిదేం లేదు. నేను ప్రచారానికి పెద్ద గొప్పగా.. ఖర్చు చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారాయన. ఏది ఏమైనా భారీ మొత్తంలో విరాళం ఇచ్చినందుకు తనకు మిగిలింది.. వరుస ఎదురు దెబ్బలు.
బిజినెస్ ఐడియాస్ పాలిటిక్స్ లోనూ వాడాలనుకున్న మస్క్
ట్రంప్ కూడా బిజినెస్ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన వారే. అయితే ఆయన అన్నీ వదులుకుని డిసైడ్ అయిన బాపతు. అదే 53 ఏళ్ల మస్క్ అలాక్కాదు. తన వ్యాపారాన్ని మరింత ఎత్తులకు తీస్కెళ్లాలని చూస్తున్నారు. ఆయన తండ్రి ఎరోన్ మస్క్ చెప్పడాన్నిబట్టీ చూస్తే.. మస్క్ కొత్త ప్రాజెక్ట్ పేరు న్యూరాలింక్. విరిగిన వెన్ను తిరిగి అంటించి.. చూపు కోల్పోయిన వారిని తిరిగి చూడగలిగేలా చేయడం.. ఈ ప్రాజెక్ట్ ప్రధానాశయం. అంటే మస్క్ బుర్రలో.. ఇలాంటి ఐడియాలు మస్త్ గా ఉన్నాయన్నమాట. అక్కడ వాడేలాంటి బిజినెస్ స్మార్ట్ నెస్ ని ఇక్కడా చూపించాలనుకున్నారు. గవర్నమెంట్ లో ఉంటే అనుకున్న పనులు సాధించవచ్చనుకున్నారు. కానీ సరిగ్గా ఇక్కడే మస్క్ బిజినెస్ మైండ్ కి భారీ షాక్ తగిలినట్టు తెలుస్తోంది.
వరుస దెబ్బలతో దిమ్మ తిరిగిన మస్క్
ఒక పక్క చూస్తే టెస్లా అమ్మకాలు భారీ ఎత్తున తగ్గుదల, షేర్ల ధరలు 50 శాతం.. పడిపోవడం. తన బిలియన్ డాలర్ల సంపద ఆవిరై పోవడం. తాను చేసినా చేయకున్నా.. ట్రంప్ పాలనాపరమైన పాపాలన్నిటికీ కారకుడు మస్కే అన్న చెడ్డ పేరు. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది ఎలాన్ మస్క్ కి.
రాకెట్లను పైకి పంపి కిందకు దించినంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే
తాను కార్లు తయారు చేసి అమ్మినంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే అన్న విషయం తెలిసొచ్చింది. ఇక్కడి నుంచి రాకెట్లను అవలీలగా పైకి పంపి.. వాటిని యాజ్ఇటీజ్ కిందకు దింపినంత సులువు కాదు రాజకీయాలంటే అని స్పష్టమై పోయింది. అందుకే మస్క్ రాజకీయాలకు దూరం కావడంలో భాగంగా తొలుత.. డోజ్ నుంచి తప్పుకున్నారు. ఆపై ట్రంప్ సర్కార్ తీసుకొస్తున్న బిల్లులపై తన వ్యతిరేకత తీవ్రతరం చేస్తున్నారు.
మస్క్ కి ఇక్కడే తన పొలిటికల్ స్పీడ్ కి సడెన్ బ్రేక్
వ్యాపారంలో లాభనష్టాలు క్వైట్ కామన్. కానీ కోరి కొని తెచ్చుకోడానికి ఎవరు మాత్రం.. ఇష్టపడతారు? మస్క్ కి ఇక్కడే తన పొలిటికల్ స్పీడ్ కి సడెన్ బ్రేక్ వేశారు. ఆయన రాజకీయాల్లోకి ఇంత భారీ విరాళాలు ఇచ్చి మరీ రావడం వెనక కొన్ని బిజినెస్ డీల్స్ ఉన్నాయ్. తన ఫ్రెండ్ ఐజాక్ మాన్ ని అత్యంత సులువుగా నాసాకు చీఫ్ చేసెయ్య వచ్చని భావించారు. కానీ తన అంచనాలన్నీ తప్పాయి. వీటికి తోడు తన కార్ల అమ్మకాలు పడిపోవడం, షోరూములపై దాడులు ఇలా వరుస దెబ్బలతో దిమ్మ తిరిగింది.
మస్క్ కి కూడా ట్రంప్ అంతటి వాడు కావాలన్న ఆశ?
కొందరు అంచనాలను బట్టీ చూస్తే మస్క్ కి కూడా ఎక్కడో తాను కూడా ఒక ట్రంప్ అంతటి వాడు కావాలన్న ఆశ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉంటుందనుకుని.. ఆయనిలా భారీ విరాళాలు ఇచ్చి మరీ ఈ రాజకీయ బురదలో అడుగు పెట్టారు. ఇక్కడ చూస్తే తాను చేసిన దానికి చేయని దానికీ.. చెడ్డ పేరొస్తోంది. దీంతో మైండ్ బ్లాక్ అయిన మస్క్.. యూటర్న్ తీస్కుని.. ఎప్పటిలాగానే పాత మస్క్ గా మిగిలిపోదామని భావించినట్టుంది చూస్తుంటే.
ఇప్పట్లో మస్క్ పొలిటిక్స్ లోకి రాక పోవచ్చు- అమెరికన్ ఎనలిస్టులు
ఇక తనకు వ్యాపారాలొద్దు. ఇప్పటికే బోలెడెంత వెనకేశామనుకుని డిసైడ్ అయ్యి.. అన్నిటికీ తెగించి.. ఒక్కసారైనా అధ్యక్షా! అనిపించుకోవాలనుకుంటే తప్ప.. ఆయన రాజకీయాల్లోకి రాక పోవచ్చు. అప్పటి వరకూ మస్క్ పొలిటిక్స్ కి దాదాపు దూరం కావచ్చనే అంటున్నారు అమెరికన్ ఎనలిస్టులు. ఒక వేళ మస్క్ పొలిటికల్ రీ- ఎంట్రీ ఇవ్వాలంటే ఆయన బిజినెస్ ని ఎవరికైనా అప్పగించి.. తనకూ వాటికి సంబంధం లేకుండా రాజకీయాల్లోకి రావల్సి ఉంటుంది. అందుకే ఈ గజిబిజి గందరగోళం నుంచి నువ్వు బయట పడాలంటే.. ఆ ట్రంప్ సావాసం వీడి.. ఒక్కసారి భారత్ కి రా, ఇక్కడి ఆలయాలను సందర్శించు. ప్రశాంతను పొందూ.. అంటూ అయోధ్య రామ మందిర దర్శనం చేసుకున్న తండ్రి ఎరోన్ మస్క్ సైతం తనయుడు ఎలాన్ మస్క్ కి సూచించారు.
X కంటెంట్ మోడ్రేషన్ ఇష్యూలో భారత్ తో గొడవలు
బేసిగ్గా ఎలాన్ మస్క్ ఇటీవల భారత్ లో పర్యటించాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక ఎక్స్ కంటెంట్ మోడరేషన్ విషయంలోనూ మస్క్ కి భారతీయ అధికారులకు పొసగడం లేదు. దానికి తోడు భారత్ లో టెస్లా కార్ల తయారీకి అవకాశం లేనట్టే భావిస్తున్నారు. ఇక్కడ కేవలం టెస్లా అమ్మకాలే తప్ప తయారీకి ఛాన్సు లేనట్టు అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. భారత్ తో ఇన్నేసి ఇష్యూస్ రైజ్ కావడంతో మస్క్ పర్యటన వాయిదా పడ్డట్టు తెలుస్తోంది.
బిగ్ బిల్ దేశాన్ని దివాలా తీయిస్తుందంటోన్న మస్క్
టోటల్ గా బిగ్ బిల్ ద్వారా.. ట్రంప్ సర్కార్ తన దూకుడు ప్రదర్శిస్తే.. ఫ్యూచర్లో టెకీస్ యూఎస్ వచ్చి పని చేసే ఛాన్సు లేదంటారాయన. ఒక్కమాటలో చెబితే ఈ బిల్లు.. అమెరికా ఆత్మను చంపేస్తుందని తన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అంటే ఈ భువిపై ఎక్కడెక్కడో జన్మించిన క్రియేటివ్ జీనియస్ లు కలిసి పని చేసే చోటు. అలాంటి చోట ట్రంప్ తన సుంకాలు, బిగ్ బిల్ వంటి చట్టాలు తేవడం వల్ల.. వారు ఇక రాకుండా పోతారనీ.. అంటారు మస్క్.