RGV: కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ (RGV) ఒకప్పుడు ‘శివ’, ‘క్షణక్షణం’ లాంటి అద్భుతమైన చిత్రాలను తెలుగు తెరకు అందించి తన టాలెంట్ నిరూపించారు. అంతేకాదు ‘రక్త చరిత్ర’, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ వంటి చిత్రాలతో రాజకీయాలను మళ్లీ కళ్లకు కట్టినట్టు చూపించారు. తాను ఏం చేయాలనుకున్నా నిర్మొహమాటంగా, ధైర్యంగా తెరపై చూపించగలిగే సత్తా కలిగిన డైరెక్టర్లలో వర్మ పేరు ప్రధమంగా వినిపిస్తుంది. అందుకే సంచలన డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు. తనపై ఎంతమంది విమర్శలు చేసినా.. అటువైపు ఎంత పెద్ద వివాదం క్రియేట్ అవుతున్నా.. తనకేమీ పట్టనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఈయన ఇప్పుడు మరొకసారి వివాదం సృష్టించేలా సౌత్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి (Chiranjeevi ), రజినీకాంత్ (Rajinikanth) పై అవమానకర కామెంట్లు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.
అమితాబ్ వల్లే చిరంజీవి, రజనీకాంత్ స్టార్స్ అయ్యారు – ఆర్జీవీ
ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. “ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమ పడిపోయింది. మన సినిమాలనే వాళ్ళు కాపీ కొడుతున్నారు. అయితే ఒకప్పుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) సినిమాలు మన సౌత్ సినీ పరిశ్రమకు స్ఫూర్తిగా ఉండేవి. మనవాళ్లు అమితాబ్ బచ్చన్ సినిమాలను కాపీ కొట్టేవారు. అప్పట్లో ఎన్టీ రామారావు(NT Rama Rao), ఏఎన్నార్ (ANR), రజనీకాంత్(Rajinikanth ), చిరంజీవి (Chiranjeevi) లాంటి వారు కూడా అమితాబ్ బచ్చన్ సినిమాలను రీమేక్ చేసిన వాళ్లే.. అలా చేయడం వల్లే ఇలా హిట్లు కొట్టి స్టార్ హీరోలు అయ్యారు.
ఒకరకంగా చెప్పాలి అంటే అమితాబ్ బచ్చన్ వల్లే మన వాళ్లు ఇక్కడ అభిమానులకు ఆరాధ్య దైవంగా మారారు.
ఇక అలా ఆయన సినిమాలను కాపీ కొడుతూ వచ్చిన మనవాళ్ళకి సడన్ గా 1990లో అమితాబ్ బ్రేక్ ఇచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక.. అదే మాస్ సినిమాలు తీస్తూ వచ్చారు. ఒకరకంగా చెప్పాలి అంటే.. సౌత్ లో సినిమా ఇండస్ట్రీకి ఆదరణ పెరగడానికి అమితాబ్ బచ్చన్ కారణమని, అయితే ఈ విషయాన్ని ఎవరు ఒప్పుకోరని కూడా తెలిపారు వర్మ.
బాలీవుడ్ పతనం.. సౌత్ టైం వచ్చింది – ఆర్జీవీ
ఒకప్పుడు సౌత్ పరిశ్రమను చాలా మంది తక్కువ చూపు చూశారు. కానీ ఇప్పుడు అదే సౌత్ పరిశ్రమ కోసం ఆరాటపడుతున్నారు. ఒక్క సౌత్ సినిమాలోనైనా నటించాలని బాలీవుడ్ నటీనటులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కాలచక్రం అనేది ఎప్పుడూ ఒకే దగ్గర ఆగిపోదు. ఒక్కోసారి ఒక్కో పరిశ్రమకు టైం వస్తుంది. ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమ టైం వచ్చింది. బాలీవుడ్ పతనం అయిపోయింది అంటూ తెలిపారు.
ఇకపోతే ఆర్జీవి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమితాబ్ చేసిన సినిమాలను వీళ్ళు రీమిక్స్ చేశారు. అంతమాత్రాన ఆయన సినిమాలతోనే వీరు స్టార్స్ అయిపోలేదు కదా.. వీరు స్టార్స్ అవడం వెనుక ఎంత కష్టం ఉంటుంది అంటూ చిరంజీవి, రజనీకాంత్ అభిమానులే కాదు.. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అభిమానులు కూడా వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనిపై వర్మ వివరణ ఇస్తారని మాత్రం కోరుకోవడం లేదు అని చెప్పవచ్చు.
ALSO READ:Manchu Vishnu: MAAలో కొత్త రూల్స్ అప్లై.. ఏంటో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!