Illu Illalu Pillalu Today Episode june 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమను కాలేజీలో డ్రాప్ చేస్తానని ధీరజ్ తీసుకుని వెళ్తాడు.. అయితే అర్జెంటు డెలివరీ ఉంది. నేను వెళ్తాను అని ధీరజ్ ప్రేమను బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోతాడు. ప్రేమ అక్కడే ఉన్న తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అతనితో చనువుగా నవ్వుతూ మాట్లాడటం చూసి ధీరజ్ కుళ్ళు కుంటాడు. ప్రేమ దగ్గరికి అటూ ఇటూ రెండు మూడు సార్లు తిరుగుతాడు. కానీ ప్రేమ మాత్రం పట్టించుకోకుండా అతనితో మాట్లాడుతూ ఉంటుంది.. ఇక ప్రేమ ఫ్రెండు తన ఫ్రెండు రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి అతనితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. ధీరజ్ ప్రేమను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పలేక నువ్వు వేరే అబ్బాయితో మాట్లాడితే నాకు కోపం వస్తుంది ఇంకెప్పుడు నువ్వు అబ్బాయితో మాట్లాడద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ధీరజ్ ఫ్రెండ్ బైక్ తీసుకొని ధీరజ్ కి షాక్ ఇస్తాడు. నర్మదేమో ప్రెగ్నెంట్ అని వేదవతి ఫుల్ ఖుషి అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి వేదవతి ఒంటరిగా ఉండడం చూసి బుట్టలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. నీ వేదవతి మాత్రం నర్మద ఉంటే నాకు చాలా టైం పాస్ అయ్యేది గలగల మాట్లాడుతుంది. దానికోసం నేను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటుంది. శ్రీవల్లి అక్కడికి వచ్చి అత్తయ్యని ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని అనుకుంటుంది. కానీ వేదవతి మాత్రం నీతో మాట్లాడితే ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టేస్తావ్ అనుకొని లోపల ఏదైనా పని ఉంటే చూసుకో వెళ్ళవమ్మా అనేసి అంటుంది. నర్మదా రావడం చూసి ఇదేంటబ్బా ఆరు గంటలకు రావాల్సింది మూడు గంటలకే వచ్చేసిందని అనుకుంటుంది. నర్మద దగ్గరకెళ్ళి ఏంటి నువ్వు ఇంత తొందరగా వచ్చేసేవ అని అడుగుతుంది.
నర్మదా నాకు వాంతులు అయ్యాయి అత్తయ్య అని అనగానే వేదవతి ఎగిరి గంతేస్తుంది.. కచ్చితంగా ఇది అదే అని సంతోషంలో మునిగి తేలుతుంది. అయితే నువ్వు కచ్చితంగా నెల తప్పవని వేదవతి అంటుంది. నేను నెల తప్పడానికి మీరు మా మధ్య ఆ తంతు జరిపించలేదు కదా అని నర్మదా అంటుంది.. అవును కదా నా మతిమండ మీకు ఆ కార్యం జరిపిస్తాను ఈరోజు ఎలాగైనా ముహూర్తం పెట్టిస్తాను అని వేదవతి అంటుంది.. కానీ మీరేం ముహూర్తం పెట్టించాల్సిన అవసరం లేదు మాకు ఆల్రెడీ శోభనం జరిగిపోయింది అని బాంబు పేలుస్తుంది..
వీళ్లిద్దరు మాట్లాడుకోవడం శ్రీవల్లి చాటుగా వింటుంది. శోభనం జరిగిందా అదేంటే ఎక్కడ జరిగింది ఒక ముహూర్తం పాడు పద్ధతి ఏమీ లేకుండా మీరు ఎలా శోభనం చేసుకున్నారు అని వేదవతి టెన్షన్ పడుతుంది. నా హైదరాబాద్ డ్రిప్ కి వెళ్ళాం కదా అక్కడే జరిగిపోయింది అని నర్మదా సిగ్గు పడిపోతుంది.. వేదవతి మాత్రం సీరియస్ గా ఉంటుంది.. అయితే శ్రీవల్లి నర్మదకు నిజంగానే కడుపు వచ్చిందా అయితే మా అమ్మ చెప్పినట్లే అత్తయ్య కోడల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది అలా జరగకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
అత్త కోడల ప్రేమను చూసి శ్రీవల్లి కుళ్ళుకుంటుంది.. ఎంత చేస్తున్న కూడా నర్మదంటేనే ఈవిడకి ప్రేమ.. వేదవతి మాత్రం నర్మదను చాలా సుకుమారంగా చూసుకుంటుంది. ఇక ప్రేమ బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అటుగా వచ్చిన ధీరజ్ సైకిల్ మీద రావడం చూసి తన ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారు.. కింగు లాంటి ధీరజ్ ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత సైకిల్ కి షిఫ్ట్ అయ్యాడా అంటూ అవమానిస్తారు. వాళ్లకి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది ప్రేమ.
ధీరజ్ తో ఎలాగైనా వెళ్లాలని ప్రేమ కష్టపడి పరుగులు పెట్టి ధీరజ్ కి ఎదురుగా వస్తుంది. ఏమని అలా చూసిన ధీరజ్ నువ్వు బస్ స్టాప్ లో ఉన్నావ్ కదా ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. బస్సులు రావని అర్థమైపోయింది అందుకే నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఏదైనా షేర్ ఆటో పట్టుకొని ఇంటికి వెళ్దాం లే అనుకున్నాను. నన్ను డ్రాప్ చేయవా అని ప్రేమ అడుగుతుంది.. నిన్ను డ్రాప్ చేయడానికి నేను బండి మీద రాలేదు సైకిల్ మీద వచ్చాను అని ధీరజ్ అంటాడు..
సైకిల్ మీద నీకు డబల్ తగ్గడం రాదు కదా అని ప్రేమ ధీరజ్ ని హేళన చేస్తుంది. ధీరజ్ ఏ మాత్రం తగ్గేదేలే ఎక్కువ అని ప్రేమను ఎక్కించుకుంటాడు.. వీళ్ళిద్దరి మధ్య సరదాగా కన్వర్జేషన్ ఉంటుంది.. ఈ ఎపిసోడ్ కి వీళ్ళిద్దరి సైకిల్ రైడ్ హైలెట్గా నిలుస్తుంది.. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు.. సాయంత్రం అవ్వగానే అందరూ సరదాగా ముచ్చట్లు పెట్టుకొని ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…