Mudragada Health: ముద్రగడ పద్మనాభరెడ్డిపై ఆయన కుమార్తె క్రాంతి సంచలన ట్వీట్ చేసింది. తమ తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతున్నారని.. తన సోదరుడు గిరి ఆయనకు సరైన వైద్యం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనకు అత్యవసరంగా క్యాన్సర్ చికిత్స చేయించాలని.. ఒక వైసీపీ ఎమ్మెల్యే తనను తండ్రి దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే.. గిరి అడ్డుకున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తండ్రిని కలవనీయడం లేదని.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. గిరి దగ్గర బందీగా ఉంచారని ఎక్స్ లో పేర్కొంది. తన సోదరుడు గిరి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వెలిబుచ్చారు.
గిరి అతని అత్తమామల సన్నిహితులు ఆయనను నిర్బంధించి.. ఒంటరిగా ఉంచుతున్నారని, ఎవరూ అతనిని సంప్రదించడానికి లేదా మాట్లాడటానికి అనుమతించబడటం లేదని తాను తెలుసుకున్నానని క్రాంతి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గిరి చేస్తున్న పని అమానుషమని, ఆమోదయోగ్యం కాదని క్రాంతి తెలిపారు. నిన్ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు.
ఆయన్ను ఎవరూ కలవకుండా ఒకచోట బంధించారని చెప్పడంతో.. ముద్రగడ చుట్టూ ఏం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. తన సోదరుడు గిరిపై క్రాంతి సంచలన ఆరోపణలు చేయడంతో ఈ కుటుంబ కథా చిత్రమ్ మరోసారి తెరపైకి వచ్చింది. తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా ముద్రగడకు ఎమర్జెన్సీగా అందించాల్సిన ట్రీట్ మెంట్ జరిపించడం లేదన్నారు కుమార్తె క్రాంతి. ఈ విషయంలో తాను తీవ్రంగా ఆందోళనతో ఉన్నానని, ఇటీవల ఒక మాజీ వైసీపీ ఎమ్మెల్యే తనను నాన్న దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారని, అయితే సోదరుడు గిరితో పాటూ అతని మామ కలవడానికి అనుమతించలేదని, నాన్న ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు.
Also Read: వైసీపీ మరీ తొందరపడుతోందా? జగన్ పొలిటికల్ ప్లానింగ్ ఫెయిలైనట్టేనా?
చివరికి అనుచరులను కూడా ముద్రగడను కలనివ్వట్లేదన్నారు. మొన్నటికి మొన్న వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి ముద్రగడ హాజరుకాలేదు. తాను అనారోగ్య కారణాలతో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనలేకపోయానని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు క్రాంతి ట్వీట్ తో ముద్రగడ అనారోగ్యం చుట్టూ అనుమానాలు పెరుగుతున్నాయి. ముద్రగడ కుమారుడు గిరి ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.
My father, Mudragada Padmanabham, is battling cancer, and I am deeply concerned that my brother Giri is deliberately denying him the proper treatment he urgently needs.
Recently, a former YSRCP MLA tried to take me to visit my father in good faith. But Giri and his father-in-law…
— Kranthi Barlapudi (@kr_barlapudi) June 6, 2025