BigTV English

Gold Loans: గోల్డ్ లోన్ల విషయంలో భారీ ఊరటనిచ్చిన RBI

Gold Loans: గోల్డ్ లోన్ల విషయంలో భారీ ఊరటనిచ్చిన RBI

బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు మొండి బకాయులుగా మారుతున్న క్రమంలో RBI కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తాకట్టు పెట్టే బంగారం ధర, దానిపై ఇచ్చే లోన్ వేల్యూ మధ్య అంతరాన్ని తగ్గించింది. బంగారం ధరలో 75 శాతం వరకు లోన్ గా ఇచ్చే వెసులుబాటు ఉంది. దీన్ని 85 శాతానికి ఆర్బీఐ పెంచింది. అంటే గతంలో లక్ష రూపాయల విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే వచ్చే లోన్ కేవలం 75 వేల రూపాయలు మాత్రమే. ఇప్పుడది 85 వేల వరకు పెరుగుతుంది. అయితే ఇక్కడ కూడా కండిషన్స్ అప్లై. రూ.2.5 లక్షల లోపు తీసుకునే రుణాలకు మాత్రమే ఈ నిబంధన ఉంటుంది. ఆ పై రుణాలకు మాత్రం అది మారిపోతుంది.


85శాతానికి LTV
లోన్ టు వేల్యూ. బంగారం ధర, దాన్ని తాకట్టు పెట్టి మనం తీసుకునే రుణం మొత్తం మధ్య ఉన్న నిష్పత్తినే లోన్ టు వేల్యూ (LTV) అని పిలుస్తారు. ఇటీవల గోల్డ్ లోన్ మార్గదర్శకాల ముసాయిదా విడుదల చేసిన ఆర్బీఐ రెండున్నర లక్షల లోపు ఉన్న రుణాలకు కూడా దీన్ని 75శాతంగానే నిర్ణయించింది. అయితే ఇప్పుడు వాటిలో మార్పులు చేసింది. రూ. 2.5 లక్షల లోపు రుణాలకు బంగారంపై ఇచ్చే LTVని 85శాతానికి పెంచుతున్నట్టు తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. ఈమేరకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు LTV పరిమితి 75శాతంగా పరిగణిస్తున్నారని, అయితే ఈ విషయంలో అసలు, వడ్డీ రెండిటినీ లెక్క వేస్తున్నారని చెప్పారు మల్హోత్రా. కొత్త మార్గదర్శకాల ప్రకారం LTV పరిమితి 85శాతంగా ఉంటుందన్నారు. కొన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, చిన్న బ్యాంక్ ల విషయంలో LTV పరిమితిని ఏకంగా 88 శాతానికి పెంచుతున్నట్టు చెప్పారు.

రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నరుణాలకు LTV పరిమితిని 80 శాతంగా, రూ.5 లక్షలు దాటిన రుణాలకు పరిమితిని 75శాతంగా ఆర్బీఐ నిర్ణయించింది. అయితే తాకట్టు పెట్టే బంగారం వస్తువుల రూపంలో ఉంటే ఒక కేజీ వరకు గరిష్ట పరిమితి ఉంటుంది. వెండి అయితే 10 కేజీలకు మించకూడదనేది ప్రాథమిక నిబంధన. ఇక గోల్డ్ కాయిన్స్ ని తాకట్టు పెట్టుకుని కూడా రుణాలు ఇస్తారు కానీ.. తాకట్టు బంగారం గోల్డ్‌ కాయిన్స్‌ రూపంలో ఉంటే ఒక్కో కాయిన్‌ 50 గ్రాములకు, వెండి కాయిన్స్‌ అయితే 500 గ్రాములకు మించకూదు.


రుణదాతలు పాటించాల్సిన నియమాలపై కూడా కొన్ని మార్గదర్శకాలు ఆర్బీఐ విడుదల చేసింది. బంగారంపై తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తే.. అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇచ్చేయాలి. గరిష్టంగా ఏడు వర్కింగ్ డేస్ కి మించకుండా బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు.. రుణం ఇచ్చేవారికి, తీసుకునేవారికి మధ్య జరిగిన ఒప్పందంలో ఉండాల్సిన వివరాలను కూడా ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది. ఈ ఒప్పందంలో తాకట్టు పెట్టే వస్తువుల వివరాలను, వాటి బరువు, విలువ కచ్చితంగా పేర్కొనాల్సి ఉంటుంది. అప్పు తిరిగి చెల్లించని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ముందుగానే స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. అప్పు చెల్లించకపోతే బంగారాన్ని ఎప్పుడు వేలం వేస్తారు. ముందుగా ఎన్ని నోటీసులిస్తారు. దానికి స్పందించకపోతే వేలం ఎప్పుడు మొదలు పెడతారు.. అనే వాటికి సంబంధించిన వివరాలు కూడా ఒప్పందంలో ఉండాలి. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం బంగారం రుణాల విషయంలో బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లకు నిబంధనలు ఒకేరకంగా ఉంటాయి.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×