Devi sri prasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషనల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్(Devi Sri prasad) ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే సింగిల్ గానే ఉన్న సంగతి తెలిసిందే. ఈయన పెళ్లి గురించి గతంలో ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఇప్పటివరకు పెళ్లి(Marriage) చేసుకోకుండా సోలో జీవితాన్నే గడుపుతున్నారు. ఇక గతంలో దేవిశ్రీప్రసాద్ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
హీరోయిన్ తో కలిసి దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వచ్చిన కొద్దిరోజులకే ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని అందుకే దేవిశ్రీప్రసాద్ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే తాజాగా దేవిశ్రీప్రసాద్ జగపతిబాబు(Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా (Jayammu Nischayammuraa) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాపిడ్ ఫెయిర్ సెషన్ లో జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు దేవిశ్రీ సమాధానాలు చెబుతూ వచ్చారు.. ఇందులో భాగంగానే జగపతిబాబు పెళ్లి గురించి ప్రశ్నలు అడగడంతో దేవిశ్రీప్రసాద్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
జగపతి బాబు దేవి శ్రీ ప్రసాద్ కు రెండు ఆప్షన్లు ఇచ్చారు. మొదటిది హీరో అవుతావా? పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రశ్న వేయడంతో వెంటనే దేవిశ్రీ సమాధానం చెబుతూ.. మీరు ఇచ్చిన రెండవ ఆప్షన్ కంటే ఫస్ట్ ఆప్షన్ చాలా బెటర్ సర్ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ రెండవ ఆప్షన్ పక్కన మీరు ఏది పెట్టిన నేను దానిని ఎంపిక చేసుకుంటాను అంటూ ఈయన సమాధానం చెప్పడంతో దేవిశ్రీప్రసాద్ కు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, పెళ్లి కంటే తనకు కెరియర్ ముఖ్యమని చెప్పకనే చెప్పేశారు.
ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవిశ్రీ?
ఇక హీరోగా ఈయనకు కొన్ని కథలు కూడా వస్తున్నాయని ఆ కథలను వినేపనిలో బిజీగా ఉన్నానని దేవిశ్రీ వెల్లడించారు. అయితే త్వరలోనే ఈయన హీరోగా మన ముందుకు రాబోతున్నారు. ఇకపోతే దేవిశ్రీప్రసాద్ బలగం వేణు(Venu) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎల్లమ్మ (Yellamma) సినిమాలో హీరోగా నటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి అయితే ఇప్పటివరకు ఈ వార్తలు గురించి ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదు కానీ తాజాగా దేవిశ్రీప్రసాద్ హీరోగా తాను సినిమాలు చేస్తానని చెప్పడంతో ఎల్లమ్మ సినిమాలో ఈయన హీరోగా నటిస్తున్నది నిజమేనని అభిమానులు భావిస్తున్నారు. మరి సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టేనా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Dheeraj Mogilineni: సినిమా అనేది గవర్నమెంట్ జాబ్ కాదు… దీపికాను టార్గెట్ చేసిన ప్రొడ్యూసర్!