Illu Illalu Pillalu ToIlluday Episode August 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు కోడళ్లతో కలిసిపోయాడేమో అని కావాలని గుర్తు చేస్తుంది శ్రీవల్లి. శ్రీవల్లి మీరు అందుకేనా ప్రేమ పెళ్లిళ్లు చేసుకొనిందని మరోసారి అగ్గి రాజేస్తుంది.. ఇంకా ధీరజ్, సాగర్ నాన్న కళ్ళలో నీళ్ళు చూడడం మనకు బాధగా అనిపిస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు.. నర్మదా తప్పు చేసింది అని అంటాడు సాగర్. ధీరజ్ మాత్రం వదిన తప్ప ఏమీ లేదురా అంతా ప్రేమదే తప్పు అని అంటాడు. ప్రేమది నర్మది ఇద్దరిదీ తప్పే అని ఒకరి మీద ఒకరు అనుకుంటూ ఉంటారు..
అప్పుడే అక్కడికి వచ్చిన చందు.. ప్రేమ నర్మల్ది కాదురా తప్పు. మీరిద్దరూ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు అంటే ఒకరి ప్రేమని ఒకరు అంగీకరించి అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటారు కదా.. మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇంట్లో జరుగుతున్న గొడవలకు వాళ్లకు సంబంధం లేదు అని చందు అంటాడు. నర్మద, ప్రేమల బాధను చూసి ప్రేమ కరిగిపోతుంది. ఉదయం ముగ్గురిని చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సేటు రామరాజు అంటూ వస్తాడు. అది గమనించిన చందు అక్కడికి వచ్చి సేటును బ్రతిమలాడి పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన నర్మదా ఏంటి ప్రాబ్లం బావగారు అని అడుగుతుంది. నా జాబుకు సంబంధించినదని చెప్పాను కదా మళ్లీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అందరం కలిసి సాల్వ్ చేద్దామని నర్మదా అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజు ఏంట్రా కంగారు పడుతున్నావ్.. ఏదైనా సమస్య? అసలు నువ్వు అమాయకుడివి ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు. ఏం లేదు నాన్న అని చందు అంటాడు. నర్మదను కూడా ఈ విషయం గురించి మర్చిపో చిన్న విషయమే నేను చూసుకుంటాను అని అంటాడు. శ్రీవల్లి దగ్గరికి వెళ్లిన చందు మీ నాన్న వాళ్ళు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. ఎంప్టీ చెక్కించి మోసం చేస్తారా..? ఇప్పుడే అక్కడికి వెళ్లి తేల్చుకుందాం పదండీ అని బలవంతంగా శ్రీవల్లిని లాక్కొని వెళ్తాడు.
చందు బండి స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ పోదామని అంటాడు. ఎదురుగా నర్మద రావడం చూసి షాక్ అవుతుంది. ఏంటి బావగారు ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది. అయితే శ్రీవల్లి మా మొగుడు పిల్లలు మ్యాటర్ నీకెందుకు అని చందును పక్కకు తీసుకొని వెళుతుంది.. బావ ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్తే నర్మదకు అనుమానం వస్తుంది. ఈ విషయాన్ని వెంటనే మావయ్యకి చెప్తుంది అని అంటుంది. అందుకే మనం ఇప్పుడు గొడవ పడకుండా ఏం చేయకుండా కామ్ గా ఉండిపోదాం రేపు నేను డబ్బులు వచ్చేలా చేస్తాను అని అంటుంది..
ఇక చందు ఆఫీస్ కి వెళ్ళగానే. శ్రీవల్లి నర్మద దగ్గరకొచ్చి మా మొగుడు పెళ్ళాల మ్యాటర్ గురించి నీకెందుకు..? మా ఇద్దరి మధ్య సవా లక్ష ఉంటాయి అవి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి మా విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది. ఏదో కష్టాల్లో ఉన్నారు కదా తీరుద్దామని ఏదైనా ఐడియా చేద్దామని అడిగాను ఇంక మీదట నేను కూడా నీకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను.. పెత్తనం తీసుకున్నాను ఏదో సాధించానని ఫీల్ అయిపోతున్నావేమో మా మధ్యలోకి నువ్వు వచ్చావంటే మర్యాదగా ఉండదు అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది.
నీ ఫ్యామిలీ గురించి నీ నాటకాల గురించి మొత్తం త్వరలోనే బయట పెడతానని నర్మదా శ్రీవల్లికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తుంది. ఇక ఉదయం పడుకొని ఉన్న ధీరజ్ ఇంట్లో ఉన్న పొగకి లేస్తాడు. అక్కడ తన ఫోటో గోడ మీద పెట్టి మై ఎనిమి అని రాసి పూజలు చేస్తూ ఉంటుంది ప్రేమ. క్షుద్ర పూజలు చేస్తున్నావా ఏంటి అని అడుగుతాడు ధీరజ్. నువ్వు సుఖంగా ఉండాలి నన్ను బాగా చూసుకోవాలని పూజ చేస్తున్నాను అని ప్రేమ అంటుంది. నేను నీకు వస్తుతో సమానం అన్నావు కదా ఇప్పుడు నాకు కాఫీ కావాలి అర్జెంటుగా వెళ్లి కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. ఆ కాఫీ తాగాక పుల్లయమ్మ కొట్టు దగ్గరికి వెళ్లి అట్లు తీసుకురా అని అడుగుతుంది. ధీరస్ చేసేదేమీ లేక నాలుగు కిలోమీటర్లు వెళ్లి టిఫిన్ తీసుకొని వస్తాడు.
Also Read : భరత్ ను కొట్టిన పార్వతి.. రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ నిర్ణయం..పార్వతికి అవని క్లాస్..
అటు నర్మదా ఆఫీస్ కి వెళ్తుంటే సాగర్ నర్మద తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేసినా కూడా నర్మదా సాగర్ ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళకి కోపం వస్తే ఆ కళ్ళతోనే చంపేస్తారేమో అంత మంటలు ఉన్నాయి అని సాగర్ అనుకుంటూ ఉంటాడు.. ఇక ఆఫీస్ కి వెళ్ళబోతున్న నర్మదా ప్రేమతో కలిసి శ్రీవల్లి వాళ్ళ అమ్మానాన్నని పిలిపించేందుకు ప్లాన్ చేస్తుంది. శ్రీవల్లి అక్కడికి వచ్చి జీడిపప్పు ఉప్మా ని ఉప్మా రవ్వ కూడా లేకుండా తినేస్తానని వాళ్ళ చేతిలో ఉన్న గిన్నె తీసుకొని తినేస్తుంది. ప్రేమ నర్మదలు శ్రీవల్లిని ఆడుకుంటారు. బొద్దింకబడిన ఉప్మాని తింటే చచ్చిపోతారేమో కదా అని ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకోవడం విని శ్రీవల్లి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..