Intinti Ramayanam Today Episode August 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. మీ అందరికి ఒక విషయం చెప్పాలి అని పార్వతి అందరితో అంటుంది. ఫంక్షన్ అయిన తర్వాత మీరు ఎవరు నా మాట కాదని అంటారని అనుకుంటున్నాను అని పార్వతి అంటుంది. రాజేంద్రప్రసాద్ మాట ఇస్తారని లాక్ చేస్తున్నావని అడుగుతాడు. లేదు నా మాటను కాదనుకున్న ఉంటారని అడుగుతున్నానని అంటుంది. దానికి అవని అత్తయ్య అందరిని ఈ ఫంక్షన్ ద్వారా కలిపింది. తను తీసుకుని నిర్ణయం కూడా మంచిదే ఉంటుంది మేమెవరము మీకు మాటిస్తున్నాను కాదనము అని అవని అంటుంది. అవని వదిన మాటిస్తే తప్పదు అని కమల్ అంటాడు. పల్లవి కూడా అవని అక్క మాట ఇచ్చిందంటే అది కచ్చితంగా జరుగుతుంది అత్తయ్య మీరేమి టెన్షన్ పడకండి అని అంటుంది. అవని కట్టుకునే చీరకి దురదల స్ప్రే కొడుతుంది పల్లవి. అవి నీకు రావాల్సిన దురదలు పల్లవికి రావడంతో షాక్ అవుతుంది. అయితే పల్లవి పూజ మధ్యలో గీక్కుంటూ నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి చీర మార్చుకొని అక్కడికి వస్తుంది. ఏమైంది అని అడిగితే ఏం కాలేదు అని అంటుంది. ఇదంతా అవని పని అని అనుకుంటుంది. పూజ అయిన తర్వాత పైకి వెళ్లి దురదలు ఎక్కువ అవ్వడంతో గీక్కుంటూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకొని అవని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి ప్రణతికి తెచ్చిన పెళ్లి సంబంధం గురించి బయట పెడుతుంది. తాను తెచ్చిన సంబంధం నే ప్రణతికి చేస్తానని అంటుంది పార్వతి.. కానీ రాజేంద్రప్రసాద్ ఎంత చెప్తున్నా కూడా పార్వతి తన మాట వినకుండా ఉంటుంది. కూతురికి తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తానని తెగేసి చెప్పేస్తుంది. అవని ఎంత చెప్తున్నా సరే పార్వతీ మాత్రం వినకుండా.. నా కూతురు జీవితం నా ఇష్టం అంటూ వాదిస్తుంది. ప్రణతి నా ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఏ సంబంధం తెచ్చిన నేను చేసుకోను అని తెగేసి చెప్పేస్తుంది. పార్వతి మాత్రం నీకేం తెలీదు నువ్వు చిన్నపిల్లవి నేను చెప్పినట్లే నువ్వు వినాలి అని రచ్చ రచ్చ చేస్తుంది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ నా కూతురు ఇష్టప్రకారమే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. నీకు ఎంత అధికారం ఉందో నా కూతురు విషయంలో నాకు అంతే అధికారం ఉంది అని అంటాడు. అవని అడిగితే నా కూతురు పెళ్లి చేసుకోవడానికి నీ పర్మిషన్ తీసుకోవాలని రెచ్చిపోతుంది. మొత్తానికి గొడవ అయితే గట్టిగానే జరుగుతుంది.
ప్రణతి తాను తెచ్చిన సంబంధాన్ని చేసుకోనని చెప్పేస్తుంది. పార్వతి మాత్రం నేను చెప్పిందే వినాలి అని అందరి ముందర ప్రణతిని కొడుతుంది. నా కూతురిని అందరి ముందర కొట్టేస్తావని రాజేంద్రప్రసాద్ పార్వతిని కొడతాడు. నీ పంతం నెగ్గించుకోవడం కోసం నా కూతుర్ని కొడతావా నీకు ఎంత ధైర్యమని అంటాడు. తనని కొట్టిన కోపంలో భరత దగ్గరికి వెళ్లిన పార్వతి భరత్ ని దారుణంగా కొడుతుంది. అయితే అవని వచ్చి పార్వతి చెయ్యి పట్టుకుంటుంది.
ఆ తమ్ముని కొట్టే అంత అధికారం మీకు లేదు. కుటుంబం గురించి మాట్లాడారు. ఉద్యోగం గురించి మాట్లాడారు మరి మీ పెద్దబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నారు అంత పెద్ద అర్హతలు ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే పార్వతి నువ్వు ఎవరివే అసలు నా కూతురు గురించి ఆలోచించొద్దు అని చెప్పడానికి అని అంటుంది. నిన్ను ఇంట్లోకి రానివ్వలేదని కక్ష కట్టి నీ తమ్ముని రెచ్చగొట్టి నా కూతుర్ని బుట్టలో పడేసేలా చేసావా అని అడుగుతుంది. మీ కంటికి నేను పిచ్చి దానిలా కనిపిస్తున్నానా అని పార్వతి అడుగుతుంది.
పిచ్చిదన్న అయితే బాగుండు ఒక మాట చెప్తే అర్థమవుతుంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పద మావని అని అందరిని తీసుకొని రాజేంద్రప్రసాద్ వెళ్లిపోతాడు. ప్రణతిని పార్వతి ఎంత బ్రతిమిలాడుకున్నా కూడా నా మంచి కోరేది మాత్రం వదినే అని అక్కడికి వెళ్ళిపోతుంది.. ఇక పిచ్చిదాని లాగా పార్వతి అన్ని అక్కడున్న వస్తువులన్నీ పడేస్తుంది.. పార్వతీ మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ బాధపడుతుంది తన కన్న కూతురు తన మాట వినలేదని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది..
Also Read : బాలు పై ప్రశంసలు.. అసలు నిజం తెలుసుకున్న ప్రభావతి..
తల్లి బాధను చూసి అక్కడికి వచ్చిన అక్షయ్.. తనకి మాటిస్తాడు. నీ మాట ప్రకారమే నేను నువ్వు కోరుకున్న వాడితో చెల్లి పెళ్లి చేసేలా చేస్తాను అని మాటిస్తాడు. ఇక అక్షయ్ అవని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు.. అయితే అక్కడికి వెళ్లినా అక్షయ్ వాళ్లకి ఫేవర్ గా మాట్లాడుతాడు. పెళ్లి గురించి మీకు ముందే చెబుదామని అనుకున్నాను అని అవని అంటుంది. వాళ్ళ అమ్మ ప్లాన్ ప్రకారం అక్షయ్ వచ్చాడన్న విషయం తెలియక వాళ్ళు అక్షయ్ ని నమ్ముతారు. అక్షయ మాత్రం పార్వతికి ఫోన్ చేసి వాళ్లు నమ్మారు అన్న విషయాన్ని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…