బ్రేక్ ఫాస్ట్ ఓ వ్యక్తి జీవితంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఎన్నో సమస్యలకు కారణం అయ్యింది. కడుపుకు మూడు అంగుళాల రంధ్రం పడింది. పెద్ద పేగు బయటకు వచ్చింది. చివరకు అతడి మూత్రాశయాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. ఇంత సీరియస్ సమస్యలు రావడానికి ఇంతకీ అసలు ఏం జరిగింది? బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు చేసిన తప్పేంటి?
ఫ్లోరిడాకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ కోసం డైనర్ కు వెళ్లాడు. టిఫిన్ చేస్తున్న సమయంలో ఊహించని ఘటన ఏర్పడింది. ఒకేసారి అతడు తుమ్మడంతో పాటు దగ్గడంతో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా తీవ్రమైన ఒత్తడి అతడి బొడ్డు మీద పడింది. అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి ఏర్పడింది. కడుపు నుంచి ఏదో తడిగా బయటకు వచ్చిన ఫీలింగ్ కలిగింది. వెంటనే అతడు తన చొక్కాను పైకెత్తి చూడగానే బొడ్డు ప్రాంతంలో మూడు అంగుళాల రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం నుంచి పెద్ద పేగు బయటకు వచ్చింది. ఈ ఘటనను చూసి అతడు షాకయ్యాడు. అదృష్టవశాత్తు పేగుకు ఎలాంటి డ్యామేజ్ కలగలేదు. వెంటనే పారామెడిక్స్ వచ్చి పెద్ద పేగును శుభ్రమైన పట్టీతో కట్టి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు పెద్ద పేగును నెమ్మదిగా లోపలికి పంపించి కుట్లు వేశారు.
ఇలాంటి వైద్య సమస్యను డీహిస్సెన్స్ అని పిలుస్తారు. ఈ అరుదైన సమస్య చాలా రేర్ గా సంభవిస్తుంది. పెద్దపేగు ఇలా బయటకు రావడం అనేది చాలా అసాధారణం. కానీ, తుమ్ము, దగ్గు నుంచి వచ్చే ఆకస్మిక ఒత్తిడి దీనికి కారణం అయ్యింది. ఆపరేషన్ తర్వాత సదరు వ్యక్తి సుమారు 6 రోజుల పాటు ఐసీయూలో ఉన్నాడు. ఆ తర్వాత కోలుకుని నెమ్మదిగా డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జూన్ 2024న మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. తుమ్మడం లాంటి చిన్న చర్య కూడా ఎలాంటి పెద్ద సమస్యలకు కారణం అవుతుందని ఈ ఘటనతో రుజువు అయ్యింది. అయితే, వీలైనంత త్వరగా గాయం మాయం కావడం పట్ల వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పెద్ద పేగు సమస్య నుంచి కోలుకున్న ఫ్లోరిడా వ్యక్తికి తాజాగా మరో ఆరోగ్య సమస్య ఏర్పడింది. క్యాన్సర్ కారణంగా అతడి మూత్రాశయాన్ని తొలగించడానికి అతడికి పెద్ద ఆపరేషన్ జరిగింది. అదే సమయంలో అంతకు ముందు జరిగిన పెద్దపేగు గాయం పూర్తిగా నయం అయినట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిలో పలు అనారోగ్య సమస్యలు ఏర్పడినా ప్రస్తుతం అతడు వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడించారు. అతడు మళ్లీ సాధారణ పనులు చేయగలడని చెప్పారు. అరుదైన ఆరోగ్య సమస్యలకు గురై కూడా, కోలుకోవడం పట్ల సదరు ఫ్లోరిడా వ్యక్తి సంతోషం వ్యక్తం చేశారు. తనను కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పాడు.
Read Also: నెలలో ఇన్నిసార్లు స్ఖలిస్తే.. ఆ క్యాన్సర్ రాదట, ఇక మొదలు పెట్టండి అబ్బాయిలూ!