Nindu Noorella Saavasam Serial Today Episode: నది దగ్గర ఆరుకు అమర్ పిండ ప్రదానం చేస్తుంటాడు. అక్కడే నిలబడిన రామ్మూర్తి, మిస్సమ్మ ఎమోషనల్ అవుతుంటారు. ఇంతోల రామ్మూర్తి కార్యం కాకముందే అక్క వెళ్లిపోయిందా అమ్మా అని మిస్సమ్మను అడుగుతాడు. మిస్సమ్మ తెలియదు నాన్నా.. ఈ ఘడియల్లోనే కార్యం జరగాలని అక్క చెప్పింది. అప్పుడే తాను మళ్లీ పుడతుందట అని చెప్పగానే.. అందుకే కదమ్మా అల్లుడుగారు వద్దంటున్నా బలవంతంగా ఒప్పించి ఈ కార్యం జరిపిస్తున్నాం. లేదంటే అక్క కొన్ని రోజులైనా మనతో ఉండేది అంటాడు. అదే నేను ఆశ పడ్డాను నాన్న.. మీకైనా అక్కతో కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు అవి కూడా లేవు. ఇన్నాళ్లు అక్క నాకు కనిపించినా అప్పుడు అక్క అని నాకు తెలియదు.. ఆత్మ అని కూడా తెలియలేదు. నిజం తెలిసిన వెంటనే అక్క దూరం అవుతుంది. అంటూ మిస్సమ్మ ఏడుస్తుంది.
బాధపడకు తల్లి అక్క మళ్లీ వస్తుంది. మనల్ని కలుస్తుంది నాకు ఆ నమ్మకం ఉందమ్మా అంటూ రామ్మూర్తి, మిస్సమ్మను ఓదారుస్తాడు. మరోవైపు మంగళ దగ్గర ఉన్న మనోహరి నేను ఇన్నాళ్లు ఎదురుచూసిన క్షణం వచ్చింది. కాసేపట్లో ఆరు ఆస్థికలు గంగలో కలుస్తాయి. నాకు దాని పీడ శాశ్వతంగా విరగడి అవుతుంది అని చెప్పగానే.. మంగళ మనసులోనే ఎక్కడ విరగడి అవుతుంది. ఆ కలశంలో ఉన్నవి అరుంధతి అస్థికలు కాదు బూడిద అని అనుకుంటుంది. ఇక మనోహరి కోపంగా అది బతికున్నన్ని రోజులు నాకు మనఃశాంతి లేకుండా చేసింది. చచ్చాక కూడా సాధించింది. దాన్ని నాశనం చేయడానికి నేను చేయని ప్రయత్నం లేదు. కానీ ఈ క్షణం నా ఆశ నెరవేరబోతుంది అని చెప్పగానే.. మంగళ మాత్రం మనసులో లేదు నీకు మళ్లీ నిరాశ ఎదురవబోతుంది మనోహరి. నువ్వు కన్న కలలన్నీ కరిగిపోతాయి. అరుంధతి ఆత్మ ఎక్కడికి వెల్లదు. ఇక్కడే ఉంటుంది అని మనసులో అనుకుంటుంటే..
మనోహరి కోపంగా ఏంటి సైలెంట్ గా ఉన్నావు.. అని అడుగుతుంది. దీంతో మంగళ కంగారుగా ఏం లేదు.. అని చెప్తుంది. ఏదైనా చెయ్యకూడని పని ఏదైనా చేశావా…? ఏదైనా ఉంటే ముందే చెప్పి చావు అంటుంది మనోహరి. దీతో మంగళ కోపంగా అయ్యయ్యో అందరూ నన్ను అనుమానిస్తున్నారేంటి..? నా ముఖం మీద తప్పు చేసినట్టు ఏమైనా రాసి పెట్టి ఉందా..? అని అడుగుతుంది. నీ జాతకం అలాంటిది మరి అని మనోహరి తిట్టగానే.. నీది మహర్జాతకం మరి అని మనసులో అనుకుంటుంది. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు తర్వాత ఏదైనా తేడా జరిగిందో నిన్ను అసలు వదిలిపెట్టను.. ఆరును చంపినట్టు నిన్ను చంపేస్తాను.. అనగానే నువ్వు చంపడం ఎందుకు..? కలశం మార్చానని తెలిస్తే అల్లుడుగారే చంపేస్తారు.. అల్లుడు గారు అరుంధతికి పెట్టాల్సిన పిండాన్ని నాకు పెడతారు అని మనసులో అనుకుని ఏం చేయలేదని చెప్పాను కదా..? అంటుంది మంగళ. సరేలే అంటుంది మనోహరి.
తర్వాత ఘోర, చంభాలను కొట్టి వారి దగ్గర ఉన్న ఆస్తికలను అంజు తీసుకుని వస్తుంది. అప్పుడే అమర్ బూడిదను గంగలో కలుపుతుంటే అంజు వచ్చి ఆగండి డాడీ అంటుంది. అమర్ ఆగి ఏంటి అంజు అంటాడు. అప్పుడు అంజు జరిగిన విషయం చెబుతుంది. అందరూ షాక్ అవుతారు. వెంటనే అంజు అస్తికలు అమర్‌కు ఇవ్వగానే.. అమర్ మళ్లీ పూజ చేసి ఆస్తికలు గంగలో కలిపేస్తాడు. అంతవరకు మిస్సమ్మకు కనిపించిన ఆరు కనిపించకుండా పోతుంది. దీంతో మిస్సమ్మ ఏడుస్తూ అక్కా అంటూ ఆ చుట్టు పక్కల వెతుకుతుంది. ఎక్కడా ఆరు కనిపించదు. దీంతో ఏడుస్తూ ఉన్న మిస్సమ్మ స్పృహ తప్పి పడిపోతుంది అందరూ కంగారు పడుతుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.