BigTV English

Bigg Boss 9 Telugu: పవన్ ను లైన్లో పెడుతున్న రమ్య.. ఆ ముగ్గురికి పట్టపగలే చుక్కలు..

Bigg Boss 9 Telugu: పవన్ ను లైన్లో పెడుతున్న రమ్య.. ఆ ముగ్గురికి పట్టపగలే చుక్కలు..
Advertisement

Bigg Boss 9 Telugu: ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ కు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ జరుపుకుంటుంది. ఒకవైపు ఈ షో గురించి విమర్శలు అందుకున్న సరే, మరోవైపు రేటింగ్ లు పెంచుకోవడం కోసం కంటెంట్ ని క్రియేట్ చేస్తుంది.. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కొత్తగా ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఐదో వారం తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు హౌస్ లో రచ్చ చేస్తున్నారు. ఆడియన్స్ కి కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా సరే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆత్రుతతో బిగ్ బాస్ ని చూస్తున్నారు.. ప్రస్తుతం హౌస్ లో గొడవలు మాత్రమే జరుగుతున్నట్లు ఎపిసోడ్ ని చూస్తే తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళు తలనొప్పిగా మారారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్య మోక్ష హౌస్ లోకి రాగానే పవన్ ని టార్గెట్ చేసింది. అసలే హౌస్ లో కరువు లో ఉన్న కంటెస్టెంట్ లో ఉన్నారు. అందులో పవన్ పేరు ముందుగా వినిపిస్తుంది. పవన్ ను అడ్డుపెట్టుకొని రమ్య లవ్ ట్రాక్ నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. కాస్త వివరాల్లోకి వెళితే..


పవన్ కు లైన్ వేస్తున్న రమ్య..

వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు మొదటి రోజునే గొడవలకు దిగారు. గతంలో లాగా పాత కంటెస్టెంట్లతో కలిసిపోయి గేమ్ లపై ఫోకస్ పెట్టాల్సింది పోయి.. గొడవలకు ఆజ్యం పోస్తున్నట్లు అనిపిస్తుంది.. వచ్చి రాగానే మాధురి అందరి పైన విరుచుకుపడింది. అసలు ఆమె ఎందుకు గొడవ పడుతుందో అర్థం కాక హౌస్ లోని కంటెస్టెంట్లు బుర్ర గోక్కుంటున్నారు. ఇక బిగ్ బాస్ లో ఏం జరుగుతుంది ఎందుకు ఇలాంటి వాళ్లను హౌస్ లోకి తీసుకొచ్చారు అంటూ ఆడియన్స్ సైతం సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళని చూస్తుంటే ఇక ప్రతిరోజు గొడవలే అని అనుకున్నారు కానీ రమ్య మాత్రం పులిహోర కలిపేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది.. పవన్ కి రమ్య గాలం వేస్తుంది. రీతూ చౌదరీ నిన్ను సెంటిమెంటల్‌ ఫూల్‌ని చేస్తుందని, ఆమె చాలా తెలివిగా గేమ్‌ ఆడుతుందని, ఆ విషయాన్ని గ్రహించుకోమని చెబుతుంది. నీ గేమ్‌ నువ్వు ఆడాలని పవన్‌కి హిత బోధ చేసింది రమ్య మోక్ష.. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య అతి త్వరలోనే లవ్ ట్రాక్ నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read : ప్రేమను అసహ్యించుకున్న ధీరజ్.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. తెగించేసిన సాగర్..


ఆ ముగ్గురిని టార్గెట్ చేశారా..? 

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దివ్య మొదటి రోజు ఎంత రచ్చ చేసిందో అందరూ చూసే ఉంటారు.. రావడంతోనే రచ్చ రచ్చగా చేసిన ఈమె ఆ తర్వాత కన్నీళ్లను కూడా పెట్టుకుంది. ఎందుకు రచ్చ చేసింది ఎందుకు ఏడ్చింది అర్థం చేసుకోవడం కాస్త కష్టమైంది. కానీ తర్వాత రోజు నుంచి మళ్లీ స్ట్రాంగ్ మారింది.. ప్రస్తుతం హౌస్ లో ఆరో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి.. అయితే హౌస్ మేట్స్ అందరూ కూడా భరణి, దివ్య, తనూజలను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వారం నామినేషన్స్ కాస్త వాడివేడిగా జరిగాయి. మొత్తానికి చూస్తుంటే ఆరో వారం తర్వాత ఏడో వారంలో నామినేషన్స్ గొడవలకి దారితీస్తాయేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ తర్వాత హౌస్ లో వాతావరణం మారిపోయింది. ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

Bigg Boss 9 Srija : శ్రీజ నోటి దూల… ఆ వీడియో వల్లే బిగ్ బాస్ నుంచి అవుట్ ?

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లోకి శ్రీజ రీఎంట్రీ.. ఆడియన్స్ కు మెంటలెక్కించే ట్విస్ట్..

Bigg Boss 9: దివ్య వర్సెస్ మాధురి.. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా, రీతూకి దివ్య మాస్ వార్నింగ్

Bigg Boss Telugu 9: ముగిసిన నామినేషన్ ప్రక్రియ.. ఈ వారం హౌజ్ ని విడేది వీళ్లే, ఎవరేవంటే!

Duvvada Madhuri : మాధురి ఇది మీ ఇల్లు కాదు, రెచ్చిపోయిన దువ్వాడ మాధురి 

Bigg Boss Ritu Chaudhary : రీతూ చౌదరికి సీజన్ అంతా అడుక్కోవడమే పని అయిపోయింది

Ramya Moksha: ఆర్మీ ఆఫీసర్‌పై నోరు జారిన పచ్చళ్ల పాప.. నోటి దూ* ఇంకా తగ్గలేదుగా, ఇక పెళ్లయినట్లే!

Big Stories

×