Illu Illalu Pillalu Today Episode October 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన ఇద్దరు కోడళ్ళు కూడా మంచి పని చేశారంటూ రామరాజు లోలోపల సంతోష పడతారు. ఊర్లోని వాళ్ళందరూ రామరాజు దగ్గరికి వచ్చి మంచి కోడల్ని తెచ్చుకున్నావు నువ్వు మంచోడివి అంటూ అనడంతో అందరూ కూడా సంతోషంతో మునిగిపోతారు. శ్రీవల్లి వీళ్ళందర్నీ చూసి షాక్ అవుతుంది. ఇందాకే మావయ్య గారు వాళ్ళిద్దర్నీ నా ఇంటి పరువును తీస్తున్నారు అన్నారు. అప్పుడే కలెక్టర్ వచ్చి ఈవిడని మెచ్చుకోగానే అంత మర్చిపోయి ఉంటారు అని తనలో తానే కుళ్ళుకుంటుంది.. వీళ్ళిద్దరినీ ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి. నేనే గ్రేట్ అని అనిపించుకోవాలి. శ్రీవల్లి భద్రతో కలిసి నర్మదా ఉద్యోగానికి ఎసరు పెడుతుంది. ఇక తర్వాత నర్మదా వల్ల నాన్న మాట్లాడిన మాటలకి రామరాజు సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ ధీరజ్ కి ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేను ఆగలేను ధీరజ్ కి నా మనసులోని మాటను బయట పెట్టాలి. ఏం చేయాలన్నా సరే నేను ధీరజ్ ని వదలను. ఈ ప్రేమని కచ్చితంగా ధీరజ్ కి తెలిసేలా చేయాలి అని ఆలోచిస్తూ తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. ధీరజ్ కోసం కొన్న ఒక లాకెట్ ని ధీరజ్ కి ఇవ్వాలని అనుకుంటుంది. దాని ద్వారా తన ప్రేమను వ్యక్త పరచాలని అనుకుంటుంది. ధీరజ్ ని దూరంగా ఉండటం చూసి ప్రేమ అక్కడికి వెళ్లి నువ్వంటే నాకు చెప్పలేని ప్రేమ అన్నట్లు మాట్లాడుతుంది.
నాకు ఏమైపోతుందో నాకు తెలియట్లేదు అందుకే నీకోసం నేను ఇది కొన్నాను దీనిని కొద్దిసేపు ఆగిన తర్వాత చూసి నీ మనసులోని మాటని చెప్పాలి అని అడుగుతుంది. దానికి ధీరజ్ ఏంటో నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు అని అంటాడు. ధీరజ్ దాని ఓపెన్ చేసే టైం కి అమూల్యను విశ్వం చేయి పట్టుకొని లాగడం చూసి కోపంతో రగిలిపోతూ కిందకి వచ్చి కొడతాడు. విశ్వం నీ దారుణంగా ధీరజ్ కొట్టడం చూసిన ప్రేమ అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా ధీరజ్ ఆగడు. ఇక చందు కూడా వదలకుండా విశ్వం నువ్వు కొడతాడు.
ప్రేమ రక్తం వచ్చేలా కొడతావా కనీసం కొంచమైనా ఆలోచించవా..? మృగంలాగ ప్రవర్తిస్తున్నావు నీకు అర్థం అవుతుందా అని ధీరజ్ పై సీరియస్ అవుతుంది. ఆ మాట విన్న ధీరజ్ నువ్వు ఇలా మారిపోతావ్ అని అస్సలు అనుకోలేదు నీ మెడలో తాళి కట్టి నేను తప్పు చేశాను. మీవాళ్ళతో ఇన్ని రోజులు మాట్లాడలేదు అనుకున్నాను. కానీ నీకు వాళ్ల మీద ప్రేమ ఉంది నాకోసం నువ్వు మాట్లాడలేదని అనిపిస్తుంది. నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది అని ప్రేమ ఇచ్చిన గిఫ్ట్ ని పడేసి వెళ్ళిపోతాడు.
రామరాజు ఇంట్లో సీరియస్ గా ఉంటాడు. అతని టెన్షన్ చూసి వేదవతి భయపడుతూ ఉంటుంది. మావయ్య గారు కచ్చితంగా నర్మదని తిడతాడు ఇదే మంచి ఛాన్స్ ఇంకాస్త ఎక్కించి నర్మదని దారుణంగా తిట్టించాలని అనుకుంటుంది.. వేదవతికి సలహా ఇస్తుంది శ్రీవల్లి. మావయ్య గారు కోపానికి కచ్చితంగా నేను కాలిపోయేలా ఉన్నాను అని భయపడుతూ ఉంటుంది. తిరుపతిని రామరాజు దగ్గరికి పంపిస్తుంది. రామరాజు చెంపలు పగలగొట్టి పంపిస్తాడు. ఇక శ్రీవల్లి మావయ్య గారు అని అంటుంది. నర్మద గురించి లేనిపోనివి ఎక్కించి చెప్తుంది. రేపు మీ అమ్మ నాన్నని రమ్మని చెప్పమ్మా నేను చాలా మాట్లాడాల్సి ఉంది అని రామరాజు అంటాడు.
నిద్రపోతున్న గుర్రాన్ని లేపి మరి తన్నించుకోవడం అంటే ఇదే.. నర్మదను తెప్పించాలనుకుంటే నేనే ఇరుక్కున్నాను ఏంటి అని శ్రీవల్లి తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది. సాగర్ చేసిన దానికి నర్మదా సీరియస్ అవుతుంది. నా మీద ప్రేమతో నువ్వు చేసావు మా నాన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడతాడని అస్సలు ఊహించలేదు. మనం ఇంటికి వెళ్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందోనని నాకు భయంగా ఉంది అంటూ నర్మదా అంటుంది. నువ్వేం భయపడకు మా నాన్న సీరియస్ అయితే నా భార్య కోసం భరిస్తాను అని అంటాడు.
Also Read: శ్రీకర్ కు శ్రీయా డెడ్ లైన్.. అవనికి సపోర్ట్ గా అక్షయ్.. పల్లవి ఎంట్రీ..
సేన విశ్వం ధీరజ్ కొట్టాడని తెలుసుకొని కోపంగా కిందకు వస్తాడు.. నా కొడుకు మీదే చెయ్యి వేస్తాడా వాడికి ఎంత ధైర్యం? రామరాజు కొడుకు నా కొడుకుని కొట్టేంత మొనగాడైపోయాడా వాడు అంత చూస్తాను అని అంటాడు. కానీ విశ్వం మాత్రం వద్దు నాన్న ఇప్పుడు గొడవలు ఎందుకు వాడికి ప్రేమనే బుద్ధి చెప్పింది కదా అనేసి ఆపుతాడు. ఏంట్రా ఇంత భయపడుతున్నావు నేను చవటానికన్నానా అని నాకే డౌట్ వస్తుంది అంటూ సేన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భద్ర విశ్వం దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు ఇలా మారిపోయావు అని అడుగుతుంది.. ప్రేమ ధీరజ్ల మధ్య పెరుగుతున్న దూరం గురించి నేను ఆలోచిస్తున్నాను అని విశ్వం అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రేమ ధీరజ్లు ఇంకాస్త ప్రేమగా దగ్గరవుతారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…