Intinti Ramayanam Today Episode October 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. మొత్తానికి పల్లవి వెళ్లిపోవడంతో అక్షయ్ అవనీల మధ్య ఉన్న దూరం కూడా దూరం అవుతుంది. ఇద్దరు కలిసిపోతారు. కమల్ పల్లవి చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడుతూ తన వస్తువులన్నిటిని కూడా తగలబెట్టాలని ఒకచోట వేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవని కమల్ ని అడ్డుకుంటుంది. నాకు చాలా బాధగా ఉంది వదిన నీ జీవితం ఇలా మారిపోవడానికి కారణం పల్లవిని అని తెలిసి నేను సహించలేకపోతున్నాను. భార్య నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా భార్య చేసినదానికి నన్ను క్షమించు వదిన అని అవని కాళ్లు పట్టుకుంటాడు కమల్.. అవని అక్షయ్ ఇద్దరూ కలిసిపోవడం చూసిన పార్వతీ రాజేంద్రప్రసాద్ సంతోషంగా ఉంటారు. కమలేకం గా వాళ్ళ చేత కేక్ కట్ చేయించాలని ఉంటాడు. అప్పుడే ఒక అతను వచ్చి షాక్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అందరూ సంతోషంగా ఉన్న సందర్భంలో అవని ఇంటిని తాకట్టు పెట్టి తెచ్చిన వ్యక్తి అక్కడికి వస్తారు. మీరు 50 లక్షలు కోసం ఈ ఇంటిని నా పేరు మీద రాశారు మీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను.. ఇంటిని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని అంటాడు.. నేను కోట్లు విలువ చేసే ఇంటిని 50 లక్షలు కోసం నీకెందుకు రాసిస్తాను అని అవని అంటుంది. ఆ కాగితలో అలానే రాసి ఉంది కదా మరి మీరు కచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు.. అవని నేను నిజంగా అప్పుడు చేసినప్పుడు వేరేలా ఉంది మామయ్య ఇప్పుడు వేరేలా ఉంది అని అంటుంది.
శ్రియ శ్రీకర్ని పక్కకు తీసుకొని వెళ్లి మీ వదిన తప్పులు మీద తప్పులు చేస్తున్న నువ్వేమీ పట్టించుకోవేంటి. కోర్టులో బల్లగుద్ది వాదించే నువ్వు మీ వదిన ఈ ఇంటిని తన పేరు మీద ఉందని చెప్పేసి అమ్మేసింది కోట్లు కొట్టేసింది. నువ్వు ఏమి మాట్లాడకుండా ఉంటే కచ్చితంగా మనల్ని రోడ్డు మీదకి ఈడుస్తారు అని శ్రీకర్ కి క్లాస్ పీకుతుంది.. మనము ఎక్కడికో వెళ్లి వాళ్లతో వీళ్ళతో ఇబ్బంది పడే కన్నా మా పుట్టింటికి వెళ్లి మంచిగా ఉండడం మేలు. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను నువ్వు వస్తే రా రాకుంటే వెళ్ళిపో అనేసి శ్రీయా అంటుంది.
అవని అక్షయ్ దగ్గరకొచ్చి ఏవండీ నేను ఇళ్లమ్మ లేదు నేను ఏ తప్పు చేయలేదండి అని అడుగుతుంది. నువ్వు ఇంత పెద్ద ఇంటిని తాకట్టు పెట్టి నా కష్టాన్ని తీర్చాలని అనుకున్నావు కానీ అదే రివర్స్ అయ్యి మనందరిని రోడ్డు మీదకి లాగేస్తుంది. ఒక్క మాట నాతో చెప్పి ఉంటే నేను ఏదో ఒకటి చేసేదవాడిని కదా అని అవనితో అంటాడు. ఇక చేసేదేమీ లేదు నువ్వు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల అందరం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు అందరికీ మంచి చేయాలని చూస్తే కచ్చితంగా దాని వెనకాల ఇలాంటి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి నిన్ను నేను నమ్ముతున్నాను. నువ్వే తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఎక్కడో జరిగిన మోసానికి మనందరం ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది అని అక్షయ్ బాధపడతాడు.
పార్వతి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వచ్చి ఏంటండీ బాధపడుతున్నారా అని అడుగుతుంది. ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను తలుచుకుంటే నాకు ఏమైపోతుందో అర్థం కావట్లేదు పార్వతి. గుండెల్లో బరువైక్కుతుంది చిన్నోడు కాపురం వీధిన పడింది. ఇప్పుడేమో మనందరం వీధిన పడిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నాకు బాధగా ఉంది అని అంటాడు. దాంతో గుండెపోటు వస్తుంది. పార్వతి అందరిని రమ్మని పిలుస్తుంది.
ఇక రాజేంద్రప్రసాద్ కి నొప్పి ఎక్కువ పోవడంతో హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఇక్కడ డాక్టరు ఆయన పరిస్థితిని వివరించి దేవుడే ఇంకా ఆయన రక్షించాలి మా ప్రయత్నం మేము చేస్తామని అంటారు. తండ్రి పరిస్థితిని చూసి అందరూ తల్లడిల్లి పోతారు. ఇక పార్వతి రాజేంద్రప్రసాద్ ఏదైనా భయపడుతూ ఉంటుంది. అప్పుడే పల్లవి అక్కడికి రావడం చూసి నాకు కమల్ నువ్వు ఇక్కడికి వస్తే మా నాన్నకి ఇంకా ఏదో ఒకటి జరుగుతుంది. నువ్వు ఇక్కడికి రావడం మహా పాపం వెళ్లిపో అని అంటాడు.
కానీ పల్లవి మాత్రం వినకుండా అక్కడికి వస్తుంది. నేను 50 లక్షలు తీసినందుకే మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు మరి ఈ అవని అన్ని తప్పులు చేసినా మీరేమీ మాట్లాడరేంటి అని అంటుంది. ప్రణతి నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నువ్వు చేసిన మోసాల గురించి అందరికీ తెలుసు అని అంటుంది. మరి నువ్వు చేసింది ఏంటి పెళ్లికి ముందే వేరొకరితో తిరగడం కడుపు తెచ్చుకోవడం, అభార్షన్ చేయించుకోవడం ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవడం.. నువ్వు మాట్లాడే అర్హత లేదు.
Also Read : వర్కర్స్ మనోజ్ గిఫ్ట్స్.. మీనాకు దొరికిన మాణిక్యం.. బీరువా కోసం బాలు రచ్చ..
అవని ఇన్ని తప్పులు చేసినా కూడా మీరు ఆమెని నెత్తిన పెట్టుకున్నారు. ఇంట్లోంచి గెంటే లేదేంటి? అత్తయ్య నువ్వు చంపాలని చూసింది అయినా కూడా మీరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండి పోయారు. నేను చేసింది తప్పేలా అవుతుంది? నీ భార్య గురించి నువ్వు అర్థం చేసుకుని ఇంతేనా అని కమల్ ని అడుగుతుంది. ఇంత జరిగినా కూడా అవని అంటే ఏంటో మాకు తెలుసు నీ గురించి కూడా మాకు అర్థం అయిపోయింది నువ్వు ఇక నుంచి వెళ్ళమ్మా అని పార్వతి పల్లవి చంప పగలగొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..