ఐపీఎల్ 2026 మినీ వేలానికి టైం దగ్గర పడింది. డిసెంబర్ 13 నుంచి 15 తేదీల మధ్య ఈ వేలం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ మీడియాలో దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. నవంబర్ 15వ తేదీ లోపు రిటైన్ అలాగే రిలీజ్ ప్లేయర్ల లిస్టును ఐపీఎల్ యాజమాన్యం ముందు ఉంచాలని 10 ఫ్రాంచైజీలకు ఆదేశాలు వెళ్లాయి. ఇలాంటి నేపథ్యంలో 10 మంది ప్లేయర్లను వదిలేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడని సమాచారం. మయాంక్ అగర్వాల్,లియామ్ లివింగ్‌స్టోన్ , రసీఖ్ సలాం దార్ ,టిమ్ సీఫెర్ట్ , నువాన్ తుషార , స్వప్నిల్ సింగ్, కృనాల్ పాండ్య, యష్ దయాల్ , లుంగి ఎంగిడీ, మోహిత్ రథీ, అభినందన్ సింగ్ లాంటి కీలక ప్లేయర్లను కూడా వదిలేసేందుకు సిద్ధమైంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇలా మొత్తం పది మందిని వదిలేసి కొత్త జట్టును కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ప్రతి ఏడాది రూ. 21 కోట్లు తీసుకుంటున్న విరాట్ కోహ్లీ ( Virat Kohli ), ఐపీఎల్ 2026 ఆడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకం చేయలేదు. ఒకవేళ అతను సంతకం చేయకపోతే, కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. అదే జరిగితే బెంగళూరు జట్టుకు 21 కోట్లు మిగులుతాయి. అటు మరో 9 మంది ప్లేయర్లను వదిలేస్తే 15 కోట్లు లభించనున్నట్లు సమాచారం అందుతుంది. అంటే బెంగళూరు చేతిలోకి దాదాపు 36 కోట్లు రాబోతున్నాయి. ఆ డబ్బులతో వేలంలో మంచి ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, 2024 ఐపీఎల టోర్నమెంట్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ అయింది.