Intinti Ramayanam Today Episode April 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయతో గడిపిన కొద్ది క్షణాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ వచ్చి అక్షయ్ తో కలిసి వచ్చానని అవని అనగానే అవని మురిసిపోయి లోపలికి వెళ్ళిపోతుంది.. పల్లవి ఈ విషయం చక్రధర్ తో చెప్పి ఫీల్ అవుతుంది. అవినీకి అంత చావు తెలివితేటలు రావడానికి వాళ్ళ తండ్రి కారణం వాడు అంత క్రిమినల్ బ్రెయిన్ అయి ఉంటది వాడి నుంచే అలాంటి ఆలోచనలు వచ్చాయేమో అనేసి అవనిని పల్లవి అంటుంది. ఇప్పుడు వాళ్ళ తండ్రి గురించి నీకెందుకు అవని తెలివి పనులు, నీవి తెలివి తక్కువ పనులు చేశావు. కాబట్టి నువ్వు ఇలా బాధపడుతున్నావని చక్రధరం అంటాడు.. ఆ చిరాకుతో ఇంటికి వస్తుంది పల్లవి..సీతారాముల కళ్యాణం ఇంత బాగా జరగడానికి కారణం పల్లవి అని కమల్ సంతోషంగా ఉంటాడు. పల్లవి ఇంట్లోకి రాగానే పల్లవిని పట్టుకొని నువ్వు చాలా మంచి పని చేశావు నీవల్ల ఇదంతా జరిగింది అని సంతోషంతో కమల్ పల్లవిని ఎత్తుకొని తిప్పేస్తాడు..అవని ఆరాధ్య స్కూల్ లో టీచర్ గా జాయిన్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ఆరాధ్య కోసం లంచ్ బాక్స్ ను తీసుకొని స్కూల్ కు వెళ్తాడు. ఆరాధ్య నేను అన్నం తినేసాను నాన్న నాకు అమ్మ అన్నం తినిపించింది అనేసి అనగానే ఏంటి స్కూల్ కి వచ్చి అన్నం తినిపించిందని అడుగుతాడు. ఇక్కడికి వచ్చి నీకు అన్నం తినిపించిందా అని అనగానే అక్కడికి వస్తుంది. నువ్వు నా కూతురుకి అన్నం తినిపించావా? అని అనగానే నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానండి. గ్రాఫ్ టీచరుగా అందుకే ఇక్కడ ఆరాధ్యకు అన్నం తినిపించాను అని అంటుంది. సరే అయితే నువ్వు తినలేదు కదా ఈ బాక్స్ ను తీసుకొని తినేసేయని అక్షయ అంటాడు. కానీ నాకేం అవసరం లేదు ఇక నా డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళిపోతాను ఇంకా అనేసి అవని అనగానే అక్షయ్ కూడా వెళ్ళిపోవాలనుకుంటాడు అప్పుడే ఆరాధ్య నాన్న అమ్మని తీసుకెళ్లండి నువ్వే అమ్మని డ్రాప్ చేయాల్సింది అని వాళ్ళిద్దర్నీ కలిసి ఒక కారులోనే పంపిస్తుంది..
ఇద్దరు సరదాగా కొబ్బరిబొండం తాగుతారు. అది పల్లవి చూస్తుంది. వీరిద్దరినీ ఇంట్లో గేంటెస్తే మళ్లీ బయట కలుస్తున్నారా? అత్తయ్యకు ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది. రాత్రి అక్షయ్ ఇంటికి వస్తాడు. పార్వతి అక్షయ్ ని అడుగుతుంది. ఆరాధ్యకు లంచ్ బాక్స్ ఇవ్వకుండా పోయావు.. ఆరాధ్య చెప్పిందని అంటుంది. అవును అమ్మా అవని వాళ్ళ స్కూల్లో పార్ట్ టైం టీచర్ గా జాయిన్ అయ్యిందని అంటాడు.. అవని తినిపించింది అని అంటాడు.
అప్పుడే అక్కడకు పల్లవి వస్తుంది. నువ్వు అవని అక్క మాట్లాడుకోవడం నేను విన్నాను. మీరిద్దరూ సరదాగా ఉండటం చూశాను అని అంటుంది. ఆరాధ్య అవనిని డ్రాప్ చెయ్యమని అడిగితే నేను చేశానని చెప్తాడు. రేపు షాపింగ్ కు తీసుకెళ్లమని అడిగితే తీసుకెళ్తావా అని అనగానే అంత కోరిక లేదమ్మా అని అక్షయ్ చెప్పి వెళ్ళిపోతాడు. స్వరాజ్యం దయాకర్ కూర్చొని ఉంటారు. అప్పుడే అవని సంతోషంగా ఇంటికి వస్తుంది. ఇంట్లోకి రాగానే స్వరాజ్యం అడుగుతుంది. తన కూతురు స్కూల్లోనే జాయిన్ అవ్వడంతో చాలా సంతోషంగా ఉందేమో అని దయాకర్ అంటాడు. అదే కాదు ఆయన నన్ను డ్రాప్ చేశాడు అనేసి అనగానే అందరూ సంతోషంగా ఉంటారు. అక్షయ్, అవని మళ్లీ కలిసిపోతారని సంతోషం ఉంటారు..
అటు పల్లవి పార్వతి మనసులో అనుమానం మొదలయ్యేలా అవినీ గురించి ఎక్కించి చెప్తుంది. వీళ్ళిద్దరూ కలవకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి అత్తయ్య అనేసి అంటుంది. ఇక అవని వాళ్ళు భోజనం చేసుకుంటే ప్రణతి రాలేదని చెప్పడంతో ప్రణతి కోసం లోపలికి వెళ్తారు. కానీ అక్కడ ప్రణతి ఉండదు. మనం మాట్లాడుకునే మాటలు ప్రణతి విన్నట్టుంది ఎక్కడికో వెళ్లిపోయింది అని వెతుక్కుంటూ అవని భరత్ వెళ్తారు. ప్రణతి కింద పడిపోయి ఉంటుంది. ఆమెను చూసి హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రణతి దగ్గరకు రాజేంద్ర ప్రసాద్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…