OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో స్టోరీ నడుస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొన్ని సినిమాలు ఆసక్తిని మరీ ఎక్కువగా పెంచుతాయి. సినిమా చివరి వరకు ఏ విషయం అర్థం కాక తికమక పడుతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఐదు స్టోరీలు మొదట్లో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా తిరుగుతుంటాయి. ఆ తర్వాత ఇవన్నీ కలిపి 11: 14 టైంలో అదే రోజు రాత్రి ఒక స్టోరీ తో ఒకటి సంబంధం ఉన్నట్టు చూపిస్తారు. ఈ మూవీ చివరి వరకు సస్పెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ’11:14′ 2003 లో విడుదలైన ఈ సినిమాకు గ్రెగ్ మార్క్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఐదు వేర్వేరు స్టోరీలను అనుసరిస్తూ, అవన్నీ ఒకే సమయంలో, రాత్రి 11:14 గంటలకు జరిగే సంఘటనలతో కలిసిపోతాయి. ఇందులో రాచెల్ లీ కుక్, హిలరీ స్వాంక్, పాట్రిక్ స్వేంజీ, హెన్రీ థామస్ వంటి నటులు నటించారు. ఈ సినిమా ఒక అమెరికన్ సబర్బ్‌లో జరిగే సంఘటనలను, వాటి సంబంధాలను వెల్లడిస్తూ, ఫ్లాష్‌బ్యాక్‌లు, బ్లాక్ హ్యూమర్ లతో నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మిడిల్‌టన్ అనే పట్టణంలో రాత్రి 11:14 గంటల సమయంలో జరిగే సంఘటనల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఐదు వేర్వేరు పాత్రలు, ప్రారంభంలో సంబంధం లేనట్లు అనిపించినా, క్రమంగా అవన్నీ రెండు కారు ప్రమాదాల చుట్టూ అల్లుకుంటాయి. జాక్ తాగిన స్థితిలో కారు నడుపుతూ, రాత్రి 11:14 గంటలకు ఒక చోట ఏదో ఒక వస్తువు తన కారును తాకుతుందిని ఆనుమానంగా చూస్తే, అక్కడ ఒక మృతదేహం ఉందని తెలుసుకుంటాడు. దాన్ని దాచడానికి ప్రయత్నిస్తాడు కానీ ఈ సంఘటన అతని జీవితాన్ని మార్చేస్తుంది. మరోవైపు చెరీ అనే యువతి, గర్భం ఉన్నట్లు నటిస్తూ డఫీ, ఆరోన్ అనే ఇద్దరి నుండి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తుంది. ఆమె తన ప్రియుడు జాక్‌తో కలిసి, ఈ డబ్బుతో పట్టణం విడిచి వెళ్లాలని ఆలోచిస్తుంది.
డఫీ అనే వ్యక్తి ఒక స్టోర్‌లో పనిచేస్తాడు. చెరీ గర్భస్రావం కోసం 500ల డాలర్లు అవసరమని చెప్పడంతో, అతను తన స్నేహితురాలు బజ్జీ సహాయంతో స్టోర్ నుండి డబ్బు దొంగిలించాలని నిర్ణయిస్తాడు. ఈ క్రమంలో అక్కడ ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇది ఇలా ఉంటే మార్క్, ఎడ్డీ, టిమ్ ముగ్గురు యువకులు సరదాగా వ్యాన్‌లో తిరుగుతూ ప్రమాదకరమైన ఆటలు ఆడుతుంటారు. వారి చర్యలు ఒక ఊహించని ప్రమాదానికి దారితీస్తాయి. ఇంతలో తన కుమార్తె చెరీ గురించి ఆలోచిస్తూ, ఆమె తండ్రి ఫ్రాంక్ రాత్రి తన కుక్కతో నడుస్తూ, స్మశానంలో ఒక మృతదేహాన్ని చూస్తాడు. దాన్ని దాచడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని చర్యలు కూడా మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. చివరలో, అన్ని స్టోరీలూ 11:14 గంటలకు జరిగే సంఘటనలతో కలిసిపోతాయి. చెరీ ఒక వ్యాన్‌తో ఢీకొని మరణిస్తుంది. డఫీని పోలీసులు అరెస్టు చేస్తారు. జాక్, ఫ్రాంక్, ఇతరుల చర్యల వల్ల, వారి జీవితాలను శాశ్వతంగా మారిపోతాయి. మొత్తానికి ఈ సినిమా ఊహించని మలుపులతో ముగుస్తుంది.
Read Also : కోరిన వరాలు ఇచ్చే గది … కొడుకు కాని కొడుకుతో ప్రెగ్నెంట్ అయ్యే తల్లి … సస్పెన్స్ తో పిచ్చెక్కించే స్టోరీ