Intinti Ramayanam Today Episode December 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో అక్షయ్ బర్త్డే వేడుకల్ని గ్రాండ్గా ఏర్పాటు చేస్తారు అందరూ సంతోషంగా సరదాగా ఉంటారు. దయాకర్ వెళ్లిపోయిన తర్వాత కమల్ అందరూ డాన్స్ చేయాలని అడుగుతారు. పల్లవి కమల్ డాన్స్ చేస్తారు. అలాగే అక్షయ్ అవని కూడా డాన్స్ చేస్తారు. పల్లవి భానుమతి ఇద్దరు కుళ్ళుకొంటారు.. ఇక కేక్ కటింగ్ చేయాలని కేకులు తెప్పిస్తారు. ముందుగా అవని కేక్ తెప్పించి పెడుతుంది. అలాగే పార్వతి కూడా కేక్ తెచ్చిస్తుంది. అమ్మ తెచ్చిన కేకే నేను కట్ చేస్తాను అని అంటాడు. అందరికీ కేక్ తినిపిస్తాడు. బర్త్డే వేడుకల్ని మొత్తానికి పార్వతి అనుకున్నట్లు గ్రాండ్ గా చేస్తుంది. ఫంక్షన్లో అక్షయ్ తన గురించి చెప్పిన విషయాల్ని గుర్తు చేసుకొని పార్వతి మురిసిపోతుంది. తన కొడుకుకు తనపై ఉన్న ప్రేమను గుర్తు చేసుకొని సంతోషంగా ఫీల్ అవుతుంది. అక్కడికి అవని వచ్చి తన తప్పు లేదని క్షమాపణలు చెప్తుంది. కానీ పార్వతి వినకుండా వెళ్ళిపోతుంది అవని బాధ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే… అవని పల్లవి బామ్మ ఇద్దరు కలిసి కావాలని అత్తయ్య దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయాలని చూశారు.. ఇక బర్తడే కి అక్షయ్ కు కార్ తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తుంది పార్వతి. అమ్మ నీకోసం పాతిక లక్షలు పెట్టి కార్ బుక్ చేసింది నీకు వెంటనే కార్ ఇవ్వాలని అనుకుంది కార్ చాలా బాగుంది అన్నయ్య అనేసి అక్షయ్ ని అడుగుతారు. ఇక అవని పల్లవి చేసిన ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. అక్షయ్ పార్వతి మురిసిపోతుంటాడు. ఇక కమల్ అమ్మని కోసం ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో చూసావా అన్నయ్య అది అమ్మ ప్రేమ అంటే అనేసి అంటాడు. రాజేంద్రప్రసాద్ కూడా ఇవాళ ఉదయమే నాకు ఈ కార్ గురించి చెప్పింది మీ అమ్మ సాయంత్రం లోపల మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఈ కారు అక్షయ్ కి నేను గిఫ్ట్ గా ఇవ్వాలి మన ఇంటి ముందర ఉండాలని చేసేదేముంది తప్పక తీసుకొని వచ్చాను అనేసి అంటాడు. ఈ కారు ఖరీదు గురించి కాదు మీ అమ్మకు నీ మీద ఉన్న ప్రేమ గొప్పది అనేసి అనగానే అక్షయ్ పార్వతీతో థాంక్యూ అమ్మ అనేసి అంటాడు. తల్లి కొడుకుల ప్రేమను చూసి అవన్నీ కూడా మురిసిపోతుంది కానీ పల్లవి ప్లాన్ వల్ల తన ఇరుక్కునిందని ఆలోచిస్తుంది. పల్లవి మాత్రం వీరిద్దరినీ చూసి కుళ్ళుకుంటుంది..
ఇక కమల్ కార్ ని ఒకసారి ట్రై చేయమని అడుగుతాడు. కానీ అవని కమల్ బైకు విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి అక్షయ్ కమల్ ను కారును ట్రై చేస్తాడు. ఈ కారు స్టార్ట్ అవ్వదు. కమల్ చాలా ట్రై చేస్తాడు. కారు స్టార్ట్ అవ్వలేదని బయటికి వచ్చి అందరితో చెప్తారు. అమ్మ పెట్టిన తొందరగా వాడు చెక్ చేయకుండా మనకి తీసుకొచ్చి ఇచ్చినట్టు ఉన్నాడు రేపు వాడిని అడిగి తెలుసుకుందాం అనేసి అనగానే పర్లేదు నాన్న రేపు వెళ్లి షో రూమ్ దగ్గర అడుగుదాం లేండి అనేసి. మరి ఏం పర్లేదు అమ్మ పొద్దున్నే దీని గురించి చూద్దాంలే అనేసి అక్షయ్ అనగానే కాస్త ఊరట పడుతుంది. కానీ పార్వతి బాధ పడుతూనే ఉంటుంది. రాజేంద్రప్రసాద్ కూడా పార్వతిని ఓధారుస్తాడు. ఏం కాలేదు పార్వతి కొత్తది కదా అలా ఉంటుంది రేపు దాన్ని చూసి మరి అక్షయ్ కి నువ్వే ఇవ్వు అనేసి అనగానే పార్వతి కుదుటపడుతుంది. ఇక అవని సంతోషంగా తన భర్తను చూస్తూ మురిసిపోతుంది. పల్లవి చక్రవర్తులు మాత్రం దయాకర్ కోసం వెతుకుతారు. మొత్తానికి దయాకర్ అయితే పట్టుకుంటారు. డబ్బులు గిఫ్టుగా ఇస్తామని అనగానే అతను లొంగిపోయి అసలు నిజాన్ని బయటపెడతాడు. అక్షయ్ పార్వతి కొడుకు కాదు మా అక్క అనురాధ కొడుకు అంటే రాజేంద్రప్రసాద్ బావ మొదటి భార్య కొడుకు ఆమె చనిపోయిన తర్వాత పార్వతిని పెళ్లి చేసుకున్నాడని నిజం చెప్తాడు. నిజం ఎవరికీ తెలియదు అందుకే బావ భయపడుతున్నాడు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు నాకు ఇస్తున్నాడు అనేసి అంటాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి బాంబు పేల్చాలని పల్లవి అనుకుంటుంది.
ఉదయం లేవగానే అవని అందరికీ కాఫీ ఇస్తుంది. ఇక పల్లవి ఎదురుగా రావడం చూసి ఏంటి నీ ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నావా అనేసి అడుగుతుంది. అది ఫీల్ ఫెయిల్ అయితే పోనీలే అక్క ఇంకొక మాస్టర్ ప్లాన్ నా దగ్గర ఉంది అది ఇంప్లిమెంట్ చేస్తే ఇంట్లో వాళ్ళు చల్లా చెదురు అవుతారని అవనికి చెప్తుంది. ఏంటి ఆ ప్లాన్ ఏంటా నిజమని అవని అడుగుతుంది. రాత్రి మన ఇంటికి వచ్చిన దయాకర్ మామయ్య ఫ్రెండే కాదు ఆయన మావయ్యకు బామ్మర్ది. అక్షయ్ బావకు మేనమామ అని చెప్పగానే అవని షాక్ అవుతుంది.. అక్షయ్ బావ పార్వతి అత్తయ్య కొడుకే కాదట రాజేంద్రప్రసాద్ మావయ్య మొదటి భార్య కొడుకు అంట ఈ విషయం బావగారికి కూడా తెలియదు బావగారికి చెప్తే ఇక ఇంట్లో ఎంత పెద్ద రచ్చవుతుందో తెలుసా నీకు అనేసి అంటుంది. అవని ఈ విషయాన్ని పార్వతిని అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి అవని అసలు నిజం తెలుసుకుంటుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..