BigTV English

Bollywood actor: సల్మాన్ జీవితం ఆమె వల్లే నాశనం.. బాలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్..!

Bollywood actor: సల్మాన్ జీవితం ఆమె వల్లే నాశనం.. బాలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్..!

Bollywood actor:సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా పెళ్లీడు వయసు వచ్చిందంటే చాలు.. మూడు లేదా నాలుగు సంవత్సరాలు అటు ఇటు చూసుకొని తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటారు. అయితే సెలబ్రిటీల విషయానికి వస్తే.. కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారినే వివాహం చేసుకుంటారు. ఇంకొంతమంది బయట వ్యక్తులను వివాహం చేసుకుంటారు. అయితే ఇందులో కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే, మరికొంతమంది నచ్చినవారిని సొంతం చేసుకోలేక ఒంటరిగా జీవిస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ (Salman Khan)కూడా ఒకరు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోగా దూసుకుపోతూ.. భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. వ్యక్తిగతంగా ఇప్పటికీ ఒంటరిగా ఉండడం గమనార్హం. 50 సంవత్సరాలు దాటినా వైవాహిక బంధానికి నోచుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నారు. దీనికి కారణం ఐశ్వర్యారాయ్(Aishwarya Rai)అంటూ సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్(Sohail Khan)ఊహించని కామెంట్లు చేశారు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.


ఐశ్వర్యరాయ్ – సల్మాన్ ఖాన్ బ్రేకప్ పై సోహైల్ ఖాన్ ఏమన్నారంటే..?

ఐశ్వర్యారాయ్ విశ్వసుందరిగా టైటిల్ గెలుచుకున్న తర్వాత బాలీవుడ్ లో పాపులర్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలసి కొన్ని చిత్రాలలో నటించడంతో వారి ప్రేమ మరింత బలపడింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రధాన మీడియాలో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీనికి తోడు వీరిద్దరూ రెండేళ్లు డేటింగ్ చేసుకున్నారు కూడా.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ తన అన్న ప్రేమ గురించి, బ్రేకప్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


ఐశ్వర్యారాయ్ ని చిత్రహింసలు పెట్టాడు..

సోహెల్ ఖాన్ మాట్లాడుతూ.. గతంలో ఐశ్వర్యరాయ్ సల్మాన్ తో ఉన్న సంబంధాన్ని ఒప్పుకోలేదు. అయితే అది తప్పే. ఆ తర్వాత కాలంలో సల్మాన్ ఖాన్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. షూటింగ్ సెట్ కే వెళ్లి ఐశ్వర్యరాయ్ ని కొట్టి హింసించడంతో ఆమె దూరం చేసుకుంది అంటూ అసలు నిజాన్ని బయటపెట్టారు. అలాగే నా అన్నయ్య కష్టకాలంలో కూడా నేను అండగా నిలిచాను. అతను శారీరకంగా, మానసికంగా కూడా ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు. ఒక రకంగా చెప్పాలి అంటే నాడు సల్మాన్ ఖాన్ ప్రేమను ఐశ్వర్యరాయ్ అంగీకరించి ఉండి ఉంటే, ఈరోజు మా అన్నయ్య కూడా పిల్లాపాపలతో సంతోషంగా ఉండేవాడు అంటూ సోహైల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపోతే సల్మాన్ ఖాన్ జీవితం నాశనం అవ్వడానికి ఐశ్వర్యరాయ్ కారణమని ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు.

ఐశ్వర్యరాయ్ ను వెంటాడిన సల్మాన్ ఖాన్..

ఇకపోతే బ్రేకప్ తర్వాత ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ ని దూరం పెట్టింది. దాంతో ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. మానసికంగా కృంగిపోయారట. అంతేకాదు ఐశ్వర్య వెంటపడుతూ ఆమెకి ఎవరిని దగ్గర కాకుండా చేశాడనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఒకరకంగా చెప్పాలంటే ఐశ్వర్యరాయ్ బ్రేకప్ వల్లే సల్మాన్ ఖాన్ ఇలా తయారయ్యాడని, పెళ్లికి దూరం అయ్యాడు అని నెటిజన్లు కూడా తమ అభిప్రాయంగా చెప్పుకొస్తున్నారు ఏది ఏమైనా ఇందులో ఏది నిజం అనేది సల్మాన్ ఖాన్ కే తెలియాలి. మరోవైపు ఐశ్వర్య రాయ్ ఆ తర్వాత కాలంలో బిగ్ బీ వారసుడైన అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×