Woman Cuts Boyfriend Genitals| ప్రియుడే తన ఆమె లోకంగా బతుకుతోంది. ఏదో ఒక రోజు అతడు తనను పెళ్లి చేసుకుంటాడని ఎదురుచూస్తోంది. ఇంతలో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. అతడు పెద్దలు కుదర్చిన సంబంధం చేసుకోబోతున్నట్టు తెలిసింది. అంతే.. భారీ పథకం వేసిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌పై ఊహించని ప్రతీకారం తీర్చుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎహ్తీషామ్ అలియాస్ బబ్లూ, హీనాలది 8 ఏళ్ల ప్రేమ బంధం. రేపోమాపో తమ పెళ్లి జరుగుతుందన్న ఆశతో ఉన్న హీనాకు బబ్లూ ఇటీవల గట్టి షాకిచ్చాడు. ఇన్నాళ్లుగా తనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అతడు ఆమెను దారుణంగా మోసం చేశాడు. ఆమెకు ఏమాత్రం చెప్పకుండా పెద్దలు కుదిర్చిన సంబంధానికి ఓకే చెప్పాడు.
పదిహేను రోజుల క్రితం బబ్లూకు ఆ యువతితో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. చివరకు ఈ విషయం హీనాకు తెలియడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. ప్రేమ పెళ్లి పేరిట ఇంతకాలం తనతో సన్నిహితంగా మెలిగి ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా మరో వివాహానికి అతడు సిద్ధమవడాన్ని హీనా జీర్ణించుకోలేకపోయింది. ఫలితంగా, ఆమె మనసులోని ప్రేమ కాస్తా పగలా మారి పోయింది. అతడిపై ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలన్న తలంపుతో భారీ పథకానికి తెర తీసింది.
Also Read: ఆస్పత్రిలో భర్త ఆపరేషన్.. డబ్బులు, నగలతో పరారైన భార్య.. హత్య కేసు
ఈ క్రమంలో ఆదివారం బబ్లూను ఏకాంతంగా కలుసుకుందామని చెప్పి హీనా అతడిని ఒక హోటల్ కు రప్పించింది. ఏం జరగబోతోందో ఊహించలేకపోయిన బబ్లూ యథాప్రకారం, ఆమె వద్దకు వచ్చాడు. అదే అతడి తప్పైంది. తొలుత వారి సంవాదం మామూలుగానే మొదలైంది. ఇద్దరూ శారీరికంగా కలుకున్నారు. ఆ తరువాత తనను వదిలి వెళ్లి వద్దని ఆమె బబ్లూని ప్రాధేయపడింది. తనను పెళ్లి చేసుకోవాలని కాళ్ల వేళ్లా పడింది. కానీ బబ్లూ తాను ఏమీ చేయలేనని.. ఇంట్లో తల్లిదండ్రుల తమ ప్రేమను అంగీకరించడం లేదని చెప్పాడు. దీంతో హీనా అతడిని చివరి సారిగా అడిగింది. తనను పెళ్లి చేసుకోకుంటే ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఆ తరువాత ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అప్పటికే అంతా ప్లాన్ చేసి పెట్టుకున్న హీనా.. బట్టలు లేకుండా ఉన్న బబ్లూపై ఒక్కసారిగా దాడి చేసి అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘర్షణలో హీనా కూడా గాయాలపాలైంది. బబ్లూ అతి కష్టం మీద తన ఫోన్ తీసుకొని బాత్ రూమ్ కు వెళ్లి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చించారు. బబ్లూ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
మరోవైపు.. బబ్లూను తనను హోటల్‌కు రప్పించి దాడి చేసినట్టు హీనా పోలీసులకు తెలిపింది. దాడి తరువాత తనూ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటే బబ్లూనే అడ్డుపడ్డట్టు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన చేతి మణికట్టుకు గాయాలైనట్టు తెలిపింది. మరోవైపు బబ్లూ మాత్రం పోలీసులకు మరో కథనం చెప్పాడు. తాము కారులో ఉండగా ఆమె తనపై అకస్మాత్తుగా దాడి చేసినట్టు తెలిపాడు ఇలా ఇద్దరూ పరస్పర విరుద్ధమైన కథనాలు చెప్పడంతో పోలీసులు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
‘‘అసలు మొదట దాడి ఎవరు చేశారు. ఈ ఘటన ఎక్కడి జరిగిందీ? హీనా చెప్పినట్లు హోటల్ లోనా? లేక కారులోనా? అని తేల్చుకునేందుకు లోతైన దర్యాప్తు ప్రారంభించాము. బాధితుడు తనను కాదని పెద్దలు కుదిర్చిన వివాహానికి అంగీకరించడం నిందితురాలికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. చివరకు క్రమంలో వారు చర్చించుకునేందుకు ఓ చోట కలిశారు. ఈ క్రమంలోనే ఆమె పదునైన వస్తువుతో అతడిపై దాడికి దిగింది. ఆ తరువాత తనని తాను గాయపరుచుకోబోతే బాయ్‌ఫ్రెండ్ అడ్డుపడ్డట్టు నిందితురాలు తెలిపింది’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఉదంతం స్థానికంగా కలకలానికి దారి తీసింది. దర్యాప్తులో ఏం తేలబోతోందనే ఉత్కంఠ స్థానికుల్లో నెలకొంది.