E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి కొత్త డ్రామా.. సెంటిమెంట్ కు కమల్ ఫీల్.. అవనికి నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి కొత్త డ్రామా.. సెంటిమెంట్ కు కమల్ ఫీల్.. అవనికి నిజం తెలుస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode January 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని శ్రియకున్న లక్షణాలు నీకు ఏమీ లేవు కదా అని పల్లవిని అడుగుతుంది. నువ్వు కొంచెం తిన్న వాంతులు చేసుకుంటున్నావు  కాళ్లు వాపులు వస్తున్నాయి. మరి పల్లవికి ఎందుకు అలా లేదు బాగానే తింటుంది కదా.. హోటల్ లో ఉన్న మెనూన్ అంత ఆర్డర్ చేస్తుంది అని అవని అంటుంది.. చూసావా బావ నా తిని మీరు అందరు పడుతున్నారని పల్లవి అంటుంది. నేను తినడం ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదనుకుంటాను. అందరూ నా తిండి మీద పడే ఏడుస్తున్నారు.. చూసావా బావ అని పల్లవి ఎమోషనల్ అవడంతో శ్రీకర్ అందులో తప్పేముంది పల్లవి అడగడం కూడా తప్పేనా అని అంటాడు.. ఇక భానుమతి ఒక్కొక్కరే ఒళ్ళు తీరుబట్టి ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు మీరేమీ ఇదొకండి అని అంటుంది..పల్లవికి చక్రధర్ కానిస్టేబుల్ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు.. మీ ఇంట్లో ఏమైనా గొడవ జరుగుతుందని అడుగుతాడు.. మీనాక్షి వచ్చిన విషయాన్ని పల్లవికి చెప్పడంతో పల్లవి ఇంత ప్లాన్ చేస్తున్నారా అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. డాక్టరు పల్లవిని కూడా చెక్ చేయండి అని అంటుంది అవని. కానీ పల్లవి మాత్రం అస్సలు ఒప్పుకోదు.. బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్న కూడా నాకు బ్లడ్ అంటే భయం అని అంటుంది.. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా పల్లవి ఒప్పుకోదు.. పల్లవి నీ చెక్ చేసి డాక్టరు ఈమె ప్రెగ్నెంట్ కాదు అని కన్ఫర్మ్ చేస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ కూడా పల్లవిని తిడతారు. మా ఎమోషన్స్ తో ఆడుకుంటావా? కొంచమైనా బుద్ధి ఉందా నీకు అని అందరూ తిడతారు.. ఆఖరికి భానుమతి కూడా నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని తిట్టిపోస్తుంది.. ఇక అవని నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్తావని అస్సలు ఊహించలేదు. పల్లవి నేను మా నాన్న కోసం ఇదంతా చేశాను అని అనగానే అందరూ షాక్ అవుతారు.

Advertisement

ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా పల్లవి ఎందుకు చెప్పిందని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ అనడం అయిపోయిందా నేను చెప్పేది వింటారా అని ఆ పల్లవి గట్టిగా అరుస్తుంది.. అవును నేను చెప్పింది అబద్ధమే తల్లి నవ్వుతున్నానని నేను అబద్ధమే చెప్పాను. మీరందరూ శ్రేయాన్ని మహారాణి లాగా చూసుకుంటున్నారు.. నన్ను మాత్రం పనిమనిషి లాగా చూస్తున్నారు అది నాకు నచ్చలేదు అందుకే అబద్ధం చెప్పాను. మీరనుకుంటున్నట్టు నేనెవరిని మోసం చేయలేదు. ఏంటి మా నాన్న కోసం చేశాను అని అన్నారు కదా.. మా నాన్న కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు కదా అని పల్లవి అంటుంది.

బావ నువ్వు తల్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని నేను అలా అబద్దం చెప్పాను. తప్ప వేరే ఉద్దేశం లేదు బావ అని కమల్ని కూడా కన్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది.. నేను చెప్పింది అబద్ధమే తల్లి నవ్వలేదన్న బాధ నాకు కూడా ఉంటుంది ఆమాత్రం నువ్వు అర్థం చేసుకోలేవు అని అవనిని అంటుంది. మొత్తానికి పల్లవి డ్రామా సక్సెస్ అవుతుంది… నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేశావు అని అవని కూడా అనుకుంటుంది.. అందరూ కూడా పల్లవిని చూసి జాలి పడతారు.. ఆ తర్వాత పల్లవి చెప్పింది నిజమేనని అనుకుంటారు.. గదిలో ఉన్న పల్లవి ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే కమల్ అక్కడికి వస్తాడు..

Advertisement

కమల్ బావని ఎలాగైనా సరే మరో నాలుగు సెంటిమెంట్ డైలాగులతో నా దారిలోకి తెచ్చుకోవాలని పల్లవి అనుకుంటుంది. తను అనుకున్నట్లుగానే కమల్ని సెంటిమెంట్ డైలాగులతో తన దారిలోకి తెచ్చుకుంటుంది.. నేను ఇక మీదట నుంచి నిన్ను ప్రేమగా చూసుకుంటాను. ఎప్పుడూ ఇలాంటివి చెయ్యొద్దు అని కమల్ మాట తీసుకుంటాడు. ఇక ఇదంతా జరగడానికి కారణం అవనీని దాని సంగతి చూడాలి అని పల్లవి అవని దగ్గరికి వెళ్తుంది. అవని వంట గదిలో ఉండగా పల్లవి వెళ్తుంది.. నువ్వు నేను అబద్ధం చెప్పానని అందరి ముందర చెప్పి నా పరువు తీసావు. నన్ను దోషిని చేసావు. ఆ తర్వాత తీవ్రత ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించలేదు కదా అని పల్లవి అంటుంది.

Also Read: మీనా పై రోహిణికి అనుమానం.. రవికి నిజం చెప్పిన శృతి.. ఇంట్లో బాంబ్ పేల్చిన బాలు..

నువ్వు నన్ను ఒక ఎత్తు దెబ్బతీస్తే నిన్ను పది ఎత్తులు దెబ్బ తీసేయలేనా ఆలోచిస్తాను అది నువ్వు ఆలోచించవా అని పల్లవి అంటుంది.. ఆ తర్వాత అవని నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా సరే నేను మాత్రం నీ దానికి భయపడను అని అంటుంది.. నువ్వు నీ ఇష్టం వచ్చింది చేసుకో.. నీకు భయపడే రకాన్ని నేను కాదు అని పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది అవని.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×