E-Paper
Advertisement

Guntur Crime: అర్ధరాత్రి భర్తను చంపిన భార్య.. ఆ రాత్రంతా *అ* వీడియోలు చూస్తూ, గుంటూరు జిల్లాలో దారుణం

Guntur Crime: అర్ధరాత్రి భర్తను చంపిన భార్య.. ఆ రాత్రంతా *అ* వీడియోలు చూస్తూ, గుంటూరు జిల్లాలో దారుణం
Advertisement

Guntur Crime:  పచ్చని సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. ప్రియుడి లేదా ప్రియురాలి మోజులో పడి హత్యలు లేదంటే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా ప్రియుడి మోజులో పడి భర్తని చంపేసింది. పైగా అశ్లీల వీడియోలు చూస్తూ రాత్రంతా గడిపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రియుడి మోజులో పడి

Advertisement

గుంటూరు జిల్లాలోని చిలువూరు ప్రాంతానికి చిరు వ్యాపారి శివ నాగరాజు-లక్ష్మీ మాధురిలకు 2007లో పెళ్లి జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వివాహం జరిగి దాదాపు 18 ఏళ్లు అవుతోంది. లక్ష్మీ విజయవాడ లోని ఓ థియేటర్‌లో టికెట్ కౌంటర్‌ వద్ద పని చేసేది. ఈ క్రమంలో సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత ఫ్రెండ్ షిప్‌గా మారింది. చివరకు అక్రమ సంబంధానికి దారి తీసింది. ఊర్లో తన భర్త ఉంటే ప్రియుడితో ఏకాంతానికి కష్టమని భావించింది భార్య. అందుకోసం పెద్ద స్కెచ్ వేసింది. భర్త వ్యాపారాన్ని నామోషీగా భావించి ఆ వ్యాపారం క్లోజ్ చేయించింది. లక్ష్మీ ప్రియుడు గోపి హైదరాబాద్‌లో కారు ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నాడు. అతని వద్దకు ఉద్యోగానికి పంపించింది.

Advertisement

ప్రియుడి సాయంతో భర్తని చంపేసి.. ఆ రాత్రంతా  *అ* వీడియోలు చూస్తూ

ఆ తర్వాత లక్ష్మిని ప్రశ్నించినవారు ఎవరూ లేదు. కొద్దిరోజుల తర్వాత నాగరాజు.. హైదరాబాద్‌ నుంచి తన గ్రామానికి వచ్చేశాడు. ఆ తర్వాత అసలు కథ ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం మొదలైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇంటి నుంచి పాత వ్యాపారాన్ని కంటిన్యూ చేశాడు నాగరాజు.

ఏం జరిగిందో తెలీదు గానీ.. రెండు రోజుల కిందట నాగరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రియుడితో సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నట్లు భావించిన లక్ష్మి, అడ్డు తప్పించుకోవాలని భావించింది. జనవరి 18న రాత్రి ఆమె బిర్యానీ చేసింది. అందులో భారీ మొత్తంలో నిద్రమాత్రలు పొడిగా చేసి బిర్యానీలో కలిపి భర్తకు పెట్టింది.

బిర్యానీ తిన్న నాగరాజు తెలివిలేకుండా నిద్రపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో ప్రియుడు రావడంతో ముందుగా వేసుకున్న ప్లాన్ ని అమలు చేసింది. నిద్రపోతున్న నాగరాజు గుండెలపై గోపి కూర్చోగా, లక్ష్మి దిండుతో నోరు-ముక్కు మూసి చంపేశారు. నాగరాజు మృతి చెందాక గోపి వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఏం చెయ్యాలో తెలియక అశ్లీల వీడియోలు చూస్తూ గడిపింది.

ALSO READ: హైదరాబాద్ లో తీవ్ర విషాదం.. ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య

తెల్లవారుజామున సమయంలో ఇరుగు పొరుగును పిలిచి గుండెపోటుతో తన భర్త చనిపోయాడని కొత్త ప్లాన్ క్రియేట్ చేసింది. కొద్దిరోజులుగా ఆ దంపతుల మధ్య జరుగుతున్న ఘటనపై ఇరుగుపొరుగువారు అనుమానం పడ్డారు. ఉదయం 9 గంటల సమయంలో నాగరాజుకు అంత్యక్రియలకు తరలించనున్నారు. నాగరాజు స్నేహితులు వచ్చి, అతడి డెడ్ బాడీని పరిశీలించారు.

చెవిలో నుంచి రక్తం రావడం, గాయం కనిపించడంతో నాగరాజు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుని ఛాతీ వద్ద ఎముకలు విరిగినట్టు, గాలి ఆడకుండా చేయడంతో మృతి చెందినట్టు తేలింది. భార్య లక్ష్మిని విచారించగా పైవిషయాలను బయటపెట్టింది. ఆమెని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×