E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కోటిని ఇరికించిన భానుమతి.. నిజం తెలుసుకున్న రాజేంద్ర..పల్లవికి షాక్..

Intinti Ramayanam Today Episode: కోటిని ఇరికించిన భానుమతి.. నిజం తెలుసుకున్న రాజేంద్ర..పల్లవికి షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode January 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది.. మీరందరూ ఎక్కడికి వెళ్లదు అని రాజేంద్ర అంటాడు.. ఈయన ఏం చేయబోతున్నాడు అని పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఇక పల్లవి రాజేంద్ర ఏదో చేయబోతున్నాడు అని తెలుసుకొని ఆయనను ఫాలో అవుతుంది.. రాజేంద్ర ని ఫాలో అవుతూ పల్లవి కూడా వెళ్లిపోతుంది.. అయితే రాజేంద్రప్రసాద్ లాయర్ దగ్గరికి వెళ్లడం చూసిన పల్లవి ఎందుకు వచ్చాడు లాయర్ దగ్గరికి అని అనుకుంటాడు. అయితే వెనకాల వెళ్లిన పల్లవి ఎలాగైనా సరే తెలుసుకోవాలని అనుకుంటుంది.. ఆస్తి పంచడం గురించి తెలుసుకున్న పల్లవి సంతోషపడుతుంది..

రాజేంద్రప్రసాద్ సగం ఆస్తిని అవని పేరు మీద రాయడంతో షాక్ అవుతుంది. రాజేంద్ర బయటికి రాగానే అక్కడ పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది.. నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావు నన్ను ఫాలో అవుతూ వచ్చావా ఏంటి అని రాజేంద్ర అడుగుతాడు.. అవును మిమ్మల్ని ఫాలో అవుతూనే వచ్చాను ఏం చేస్తున్నారా అని తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను అని పల్లవి అంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక న్యూస్ బాగా అర్థమైంది.. అవని పేరు మీద ఆస్తి రాసారు శ్రియ పేరు మీద ఆస్తి రాసారు. అలాగే ప్రణతి పేరు మీద కూడా రాశారు.. నా పేరు మీద మీరు ఎందుకు రాయలేదు నా భర్త పేరు మీద రాశారు అని పల్లవి నిలదీస్తుంది. నీ గురించి నాకు అన్ని విషయాలు తెలుసని రాజేంద్ర అనగానే పల్లవి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేశ్వరి ఇంట్లోకి రాగానే అందరూ ఆమెను చూసి షాక్ అవుతారు. మీరు పిలవకపోయినా వచ్చాను అని అనుకుంటున్నారా అని అంటుంది.. రాజేశ్వరి రావడంతో మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అవనీ, అక్షయ్ లు అత్తయ్య వచ్చింది అంటే ఏదో జరుగుతుంది అని అనుకుంటారు.. అందరూ ప్రేమగా పలకరిస్తే రాజేశ్వరి మాత్రం మీనాక్షి అవనీలపై సీరియస్ అవుతుంది. అయితే మీనాక్షిపై రాజేశ్వరి రెచ్చిపోతుంది.. అది అవని విని రాజేశ్వరీ కి వార్నింగ్ ఇస్తుంది.. మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడితే నువ్వు పిన్ని అనే సంగతి కూడా నేను మర్చిపోతాను అని అవని రాజేశ్వరి కి వార్నింగ్ ఇస్తుంది..

కోటిలింగం ఆరాధ్య ఇద్దరు కలిసి సరదాగా బయట మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే అక్కడ ఒక అమ్మాయిని చూసిన కోటిలింగం అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి నేను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు.. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆరాధ్య అంటే ఏంటి అని అమాయకంగా అడుగుతుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి కోటిని ఆట పట్టిస్తుంది. నాతోనే నువ్వు ఆడుకున్నావు కదా ఇప్పుడు నీతో ఎలా ఆడుకుంటానో చూడు అని భానుమతి నువ్వు వెళ్లి నువ్వు నాకు నచ్చావ్ అని డైరెక్ట్ గా చెప్తే ఆ అమ్మాయి నీ ప్రేమని ఒప్పుకుంటుంది అని చెప్తుంది. ఆ మాట వినగానే కోటి నిజంగానా బామ్మగారు థాంక్యూ అండి అని వెళ్లి చెప్తాడు..

Advertisement

ఇక పల్లవి మామయ్య ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాదు అవని మావయ్య గారు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు వెళ్తూ ఉంటుంది.. అవని మామయ్య ఏదో చేస్తున్నారు నేను ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అని పల్లవి అనుకుంటుంది.. ఆ తర్వాత అవని రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లడం చూసిన పల్లవి చాటుగా వాలేం మాట్లాడుకుంటున్నారో వినాలని అనుకుంటుంది. మీకు కొన్ని నిజాలు తెలిసినప్పటి నుంచి మీరు వింతగా ప్రవర్తిస్తున్నారు మావయ్య గారు.. ఏం చెప్పాలి అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని అవని రాజేంద్రను అడుగుతుంది.. దానికి సమాధానం చెప్పిన రాజేంద్ర. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అదే చెప్తాను.. మీరు పడిన బాధలకు నేను న్యాయం చేస్తానని అంటాడు.

ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు మావయ్య గారు అని అవని అంటుంది. ఏం లేదమ్మా మీరు మీ నాన్న గురించి ఎంత బాధ పడ్డారో నాకు బాగా అర్థమైంది.. ఇవాళ మీ నాన్న ఎవరో చెప్పేస్తాను అని అంటాడు.. ఆ చక్రధరి మీ నాన్న అన్న విషయాన్ని అందరితో చెప్పేస్తాను అని రాజేంద్ర అనగానే పల్లవి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ ఈ విషయం చెప్తే పరిస్థితి ఏంటి అని కంగారుపడుతుంది. చెప్పడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది. కానీ పిన్నికి అన్యాయం జరుగుతుంది. ఆమె తట్టుకోలేదు అని అవని ఎంత చెప్తున్నా సరే రాజేంద్ర మాత్రం వినడు. పల్లవి ఎలాగైనా సరే రాజేంద్రను ఆపాలని అనుకుంటుంది.

Also Read : మీనాపై శోభా సీరియస్.. రోహిణి తల్లికి యాక్సిడెంట్.. ప్రభావతికి శృతి షాక్..

మీరు మా నాన్న అవని వాళ్ళ నాన్న అని చెప్పాలనుకుంటున్నారు దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మీరు ఆలోచించరా అని అంటుంది.. నువ్వు ఏం చేసావో ఎన్ని చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం లో మార్పు లేదు అని పల్లవితో అంటాడు.. పల్లవి మాత్రం ఎలాగైనా సరే రాజేంద్రను ఈ నిజం బయట పెట్టకుండా ఆపాలని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×