Intinti Ramayanam Today Episode January 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ శ్రీకర్ కి ఫోన్ చేస్తాడు. వదిన వెళ్ళిపోతుందన్నయని బాధపడతాడు. ఏమైంది రా అని అడిగితే మొత్తం విషయాన్ని శ్రీకర్కు కమల్ చెప్తాడు. ఇద్దరం కలిసి వదినని వెతుకుదామని శ్రీకర్ అంటాడు. ఇంట్లోకి వెళ్లిన కమల్ మీరందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారా.. వదిన వెళ్ళిపోయింది కదా మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు అనేసి అంటాడు ఇక ఆరాధ్య ఎక్కడ కనిపించలేదని అందరు వెతుకుతారు. అదే ఒక గదిలో కూర్చుని వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇక కమల్ ఇంట్లోకి వెళ్లి అందర్నీ తిడతాడు ఇక ఆరాధ్య లేదని ఆరాధ్యుని వెతుకుతారు. ఆరాధి మాత్రం తన అమ్మ ఫోటోను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అక్షయ ఆరాధన దగ్గర తీసుకుంటే నువ్వు మా అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఆపలేదు నువ్వు వెళ్ళు నాతో మాట్లాడొద్దు అనేసి అంటుంది.. ఇక పార్వతి దగ్గరకు వస్తే నువ్వు మా అమ్మని ఇంట్లో నుంచి బయటికి తోసేసావు నువ్వు కూడా నాతో మాట్లాడొద్దని అంటుంది. ఇక కమల్ ఆరాధ్య దగ్గరకు వచ్చి బంగారం నేను మీ అమ్మని తీసుకొస్తాను నువ్వు నేను చెప్పినట్టు వినాలి నువ్వు ఏడవద్దు అనేసి అంటాడు. రాజేంద్రప్రసాద్ కు ఆరాధ్యను అప్పజెప్పి కమల్ బయటికి వెళ్తానని వెళ్ళిపోతాడు.. కమల్ ఎంత చెప్పినా వినకుండా అవని నేను తప్పు చేశాను అని అందరూ నమ్ముతున్నారు కదా అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీకర్ కమలిద్దరూ అవని కోసం వెతుకుతారు. అవని గుళ్లో దేవుడి దగ్గర తన గోడుని వినిపిస్తుంది. నీ మీద భారం వేచి నేను వెళ్తున్నాను నువ్వే నన్ను గట్టెక్కించాలని అవని బాధపడుతుంది. ఇక కమల్ శ్రీకర్ ఇద్దరు గుళ్లో వెతుకుతారు కానీ అవని చూడకుండా వెళ్ళిపోతారు. అవినీ గుడి నుంచి బయటికి రాగానే దొంగలు ఆమె మెడలోని బంగారాన్ని తీసుకోవాలని ఆమెపై దాడి చేస్తారు. ఆ బంగారాన్ని తీసుకుంటారు.. ఇక అవని మళ్లీ దేవుడి దగ్గరికి వెళ్లి నా మంగళ సూత్రాన్ని కూడా నాకు దూరం చేసావా నా భర్తను దూరం చేశావు నేను ఎందుకు బతకాలని బాధపడుతూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ ఇంట్లో పని చేసే సీను అక్కడికి వచ్చి ఇంత రాత్రిపూట మీరు ఎక్కడంటే అక్కడ ఉండకూడదు అమ్మ మీకు ఇల్లు దొరికేంతవరకు మా ఇంట్లోనే ఉండండి అని వాళ్ళింటికి బలవంతంగా ఒప్పించి తీసుకెళ్లిపోతారు. పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతుంది అందులోకే భానుమతి వచ్చి ఆ అనాధ దరిద్రం బయటికి వెళ్లింది. నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మాత్రం ఆరాధ్యను మచ్చిక చేసుకోవాళి అప్పుడే అవని ఇంకా ఇంటికి రాకుండా ఉంటుందని సలహా ఇస్తుంది.. ఇక పల్లవి మాత్రం ఆ గుడ్ న్యూస్ ని వాళ్ళ నాన్నతో షేర్ చేసుకుంటుంది. చక్రధర్ నువ్వు నా కూతురు అని నిరూపించుకున్నావు. ఇక ఏదైనా సలహాలు కావాలంటే నిన్నే అడుగుతాను చాలా మంచి పని చేసావ్ అమ్మ అని పల్లవిని పొగడ్తలతో ముంచేస్తాడు.
ఇక పల్లవి మెయిన్ క్యారెక్టర్ ని బయటకు పంపించాను అక్షయ్ సైడ్ క్యారెక్టర్ లాంటోడు అక్షయ్ ని కూడా త్వరలోనే బయటికి పంపిస్తాను డాడ్ ఈ గుడ్ న్యూస్ ని మీరు ఎంజాయ్ చేయండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక అవనిని శీను ఇంటికి తీసుకుని వెళ్తాడు. తన భార్య పంకజం మాత్రం ఆమెను ఎందుకు తీసుకొచ్చారని గొడవ పెట్టుకుంటుంది. ఎంత నచ్చచెప్పినా కూడా పంకజం మినదు వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడం ఎందుకని అవని బయటికి వెళ్తుంటే శ్రీను వచ్చి దాని విషయం పట్టించుకోకండి అమ్మ మీరు ఇక్కడే ఉండండి ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికెళ్తారు అని బ్రతిమలాడి ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు.. అవనికి వెళ్ళిన అవనికి శ్రీను తినడానికి భోజనం పెడతాడు.. అవని మాత్రం ఆరాధ్య కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పల్లవి భానుమతి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఈ ఆరాధ్యను మచ్చగా చేసుకోవాలంటే ఇలాంటివి చేయక తప్పదు అని భోజనం తీసుకుని వెళుతుంది.
ఆరాధ్య మాత్రం ఎంత చెప్పినా భోజనం చేయదు అన్నం ప్లేట్ ను విసిరి కొడుతుంది. ఇంట్లోని వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా బ్రతిమలాడిన నేను తినను అని ఆరాధ్య అంటుంది. ఇక అప్పుడే కమల్ ఇంట్లోకి వస్తాడు. ఆరా దీన్ని బుజ్జగించి అమ్మ వస్తుంది నువ్వు తిని మంచిగా స్కూల్ కెళ్ళి బాగా ఆడుకుంటే అమ్మ వస్తానని చెప్పిందని ఆరాధ్యకు అన్నం తినిపిస్తాడు. అక్షయ్ అవని గురించి బాధపడుతూ ఉంటాడు అప్పుడే పార్వతీ లోపలికి వచ్చి నాది తప్పని నువ్వు అనుకుంటున్నావా అని అంటుంది. అంటున్నావు కదమ్మా నువ్వు ఎలా తప్పు చెప్తావ్ అనేసి అక్షయ్ అంటాడు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ వచ్చి అవని తప్పు చేసింది అంటే ఎవరు నమ్మరు అవని నిజంగానే తప్పు చేసిన నువ్వు నమ్ముతున్నావా మీ అమ్మ భ్రమ పడుతుందో లేక గుడ్డిగా నమ్మిందో తెలియట్లేదు కానీ మీ అమ్మకు నువ్వు నచ్చజెప్పి అవని నీ ఇంటికి తీసుకొని పని చేయాలని అంటాడు. నేను చెప్తే అమ్మ నమ్ముతుంది నాన్న అని అక్షయ్ అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..