BigTV English
Advertisement

Vishwak Sen: మాట వినని విశ్వక్ సేన్.? సినిమా క్యాన్సెల్ చేసిన నిర్మాత.!

Vishwak Sen: మాట వినని విశ్వక్ సేన్.? సినిమా క్యాన్సెల్ చేసిన నిర్మాత.!

Vishwak Sen: ఇండస్ట్రీలో ఒకట్రెండు హిట్లు వచ్చిన తర్వాత నటీనటుల యాటిట్యూడ్ చాలా మారిపోతుందని అంటుంటారు. అలా యాటిట్యూడ్ మారిపోయి కెరీర్‌ను తప్పుదోవ పట్టించిన వారు కూడా ఉన్నారు. యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా అలాంటి వాడే అని తన హేటర్స్ అంటుంటారు. కానీ విశ్వక్ మాత్రం తన డెడికేషన్‌తో, హార్డ్ వర్క్‌తోనే అందరికీ సమాధానమిస్తాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అందరికీ షాకిచ్చిన ‘లైలా’ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా తనకు సంబంధించిన ఒక హాట్ న్యూస్ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన యాటిట్యూడ్ వల్ల ఒక నిర్మాతలు చుక్కలు చూపించి సినిమా ఆగిపోయేలా చేశాడట విశ్వక్ సేన్.


ఇబ్బంది పెడుతున్నాడు

ప్రతీ సినిమాకు జోనర్ మార్చుకుంటూ ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే తపన విశ్వక్ సేన్‌లో ఎప్పుడూ ఉంటుంది. అందుకే కష్టమైనా కూడా పూర్తిగా తన గెటప్ మార్చేసి అమ్మాయిగా మారిపోయి ‘లైలా’ అనే సినిమా చేశాడు. ఇందులో లైలాగా మారడం కోసం తాను ఎంత కష్టపడ్డాడో తాజాగా వీడియో విడుదల చేసి మరీ చెప్పాడు. ఈ వీడియో చూసిన తర్వాత విశ్వక్ డెడికేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అంతా బాగానే ఉంది అనుకునేలోపు విశ్వక్ సేన్‌పై వైరల్ అవుతున్న ఒక వార్త తనను ప్రేక్షకులు నెగిటివ్‌గా చూసేలా చేస్తోంది. అంతా ఓకే అనుకున్న సినిమాకు డేట్స్ ఇవ్వకుండా నిర్మాతను ఇబ్బంది పెడుతున్నాడని ఇండస్ట్రీలో వార్త వైరల్ అయ్యింది.


విశ్వక్ వల్లే

శ్రీధర్ గంట అనే కొత్త దర్శకుడితో ‘బందూక్’ అనే సినిమాను సైన్ చేశాడు విశ్వక్ సేన్. గతేడాదిలోనే ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా క్యాన్సెల్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వక్ సేన్ వల్లే ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చిందని, అందుకే నిర్మాతకు సినిమాను క్యాన్సెల్ చేయడం తప్పా వేరే మార్గం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇదే కథను వేరే నటుడితో మళ్లీ ప్రారంభించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట నిర్మాతలు. అలా విశ్వక్ సేన్ ‘బందూక్’ క్యాన్సెల్ అయ్యిందని సమాచారం.

Also Read: సూపర్ హీరో పాత్రలో సూర్య.. మలయాళ దర్శకుడితో కలిసి ప్రయోగం..

మొదటిసారి కాదు

ప్రస్తుతం విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతిలో ‘లైలా’ (Laila) అనే సినిమా ఉంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు ఈ యంగ్ హీరో. దీని తర్వాత అనుదీప్ కేవీతో ఒక మూవీని చేయనున్నాడనే సమాచారం. విశ్వక్ సేన్‌పై ఇండస్ట్రీలో నెగిటివిటీ రావడం ఇదేమీ మొదటిసారి కాదు. అసలు తన యాటిట్యూడ్ సరిగా ఉండదని, సినిమా సైన్ చేసిన తర్వాత సరిగా రెస్పాన్స్ ఇవ్వడు అంటూ ఇప్పటికే పలువురు మేకర్స్.. ఈ హీరో గురించి ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. కానీ విశ్వక్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×