Virat Kohli: దేశవాళీ క్రికెట్ తప్పనిసరిగా ఆడాలని బీసీసీఐ ఆదేశించడంతో టీమిండియా ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీ బాట పట్టారు. ఈ క్రమంలో రంజీ మ్యాచ్ ఆడేందుకు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ {Virat Kohli} సిద్దమైన సంగతి తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత దేశవాళి క్రికెట్ రంజీ ఆడబోతున్నాడు విరాట్. నేడు (జనవరి 30)న ఢిల్లీ తరపున బరిలోకి దిగబోతున్నాడు. నేడు ఢిల్లీ జట్టు రైల్వేస్ జట్టుతో తలపడబోతోంది.
Also Read: Natasa-Pandya: పాండ్యా భార్య నటాషా అరాచకం.. మొగుడితో చేయాల్సిన పనులు ప్రియుడితో ?
ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీ {Virat Kohli} ప్రాక్టీస్ చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక గురువారం ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూప్ – డి చివరి రౌండులో రైల్వేస్ తో ఢిల్లీ జట్టు తలపడునుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో సుమారు పదివేల మంది అభిమానులు ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ ని వీక్షించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శన పై అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ {Virat Kohli} నాలుగోవ స్థానంలో బ్యాటింగ్ కి దిగబోతున్నారు. ఈ మ్యాచ్ ని “జియో సినిమా” లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది. మరోవైపు ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం వద్దకు చేరుకున్నారు. విరాట్ కోహ్లీ అభిమానులు ఏకంగా రెండు కిలోమీటర్ల వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వీరంతా పెద్ద ఎత్తున ఆర్సిబి అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రౌడ్ చూస్తే విరాట్ కోహ్లీ {Virat Kohli} కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడోనని క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఓవరాల్ గా 23 రంజీ మ్యాచ్ లు ఆడారు. 2006 నవంబర్ లో ఢిల్లీ జట్టు తరుపున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేసిన విరాట్.. తన తొలి మ్యాచ్ తమిళనాడుపై ఆడాడు.
Also Read: Mohammed Siraj: మరో కొత్త పిల్లను పట్టిన సిరాజ్..ఏకంగా హోటల్ లోనే అన్ని ?
ఈ మ్యాచ్లో కోహ్లీ {Virat Kohli} ఐదవ స్థానంలో బ్యాటింగ్ కి దిగి 25 బంతులలో 10 పరుగులు చేశాడు. ఇక తన తొలి రంజీ సెంచరీని 2007 – 08 లో రాజస్థాన్ పై నమోదు చేశాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 13 పరుగులకు అవుట్ అయిన కోహ్లీ.. రెండవ ఇన్నింగ్స్ లో 192 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఇలా ఆరేళ్లపాటు రంజి బరిలోకి దిగిన కోహ్లీ.. చివరిసారిగా 2012 నవంబర్ లో ఉత్తరప్రదేశ్ పై మ్యాచ్ ఆడాడు. రంజీల్లో విరాట్ కోహ్లీకి ఐదు సెంచరీలు ఉన్నాయి. అలాగే రంజీల్లో ఇప్పటివరకు 1547 పరుగులు చేశాడు.
The 2 KM long queue at the outside of Arun Jaitley stadium for Virat Kohli's Ranji Match. 🤯🥶
– KING KOHLI, THE BIGGEST BRAND IN CRICKET…!!!! 🐐
— Tanuj Singh (@ImTanujSingh) January 30, 2025
The whole world is crazy for Virat Kohli to get a glimpse of him.
– How many spectators come to watch international matches? The same number of spectators will come to watch Ranji Trophy matches because of Virat Kohli. #RanjhiTrophy #ViratKohli𓃵 pic.twitter.com/clxVHSYYbB
— CricTalkWith – Atif 🏏 (@cricatif) January 30, 2025