E-Paper
Advertisement

ఘోస్ట్ షిప్లో వెంటాడి వెంటాడి చంపే మాస్క్ కిల్లర్… టెర్రీఫయింగ్ టైమ్ లూప్ సైకలాజికల్ థ్రిల్లర్

ఘోస్ట్ షిప్లో వెంటాడి వెంటాడి చంపే మాస్క్ కిల్లర్… టెర్రీఫయింగ్ టైమ్ లూప్ సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

Psychological Horror Thriller: ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి టూర్ కి వెళ్తున్నారా ? అక్కడికి వెళ్ళాక ఎవరో తెలియని వ్యక్తి వెంటాడితే… వెంటపడి వెంటపడి చంపితే ఎలా ఉంటుంది? నిమిష నిమిషానికి గుండె హైస్పీడ్ ట్రైన్ పరిగెత్తుతున్న రేంజ్ లో కొట్టుకుంటుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమాను చూసినా అలాగే ఉంటుంది. ఆ హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లరే ‘Triangle’. 2009లో విడుదలైన ఈ మైండ్-బెండింగ్ మాస్టర్‌పీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? తెలుగులో ఉందా లేదా ? అనే విషయాలపై తెలుసుకుందాం పదండి.

స్టోరీలోకి వెళ్తే…

ఇందులో హీరోయిన్ పేరు జెస్. ఆమె సింగిల్ మదర్. ఆమెకు ఆటిజం ఉన్న చిన్న కొడుకు ఉన్నాడు. కొడుకు సంరక్షణలోనే రోజులు గడుపుతూ, తన జీవితంలో కొంత ప్రశాంతత కోసం ఆమె తన స్నేహితుడు గ్రెగ్, అతని స్నేహితుల బృందంతో కలిసి అట్లాంటిక్ సముద్రంలో ‘ట్రయాంగిల్’ అనే యాచ్‌పై ప్రయాణానికి బయలుదేరతారు. స్నేహితులతో సరదాగా మొదలవుతుంది ట్రిప్.

Advertisement

మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ ఆకస్మికంగా భయంకరమైన తుఫాను వచ్చి వాళ్ళ పడవను ముంచేస్తుంది. ఒక స్నేహితురాలు సముద్రంలో కొట్టుకుపోగా, మిగిలినవారు పడవ అవశేషాలపై ప్రాణాలు చేతపట్టుకుని ఉంటారు. అప్పుడు దూరంగా ఒక భారీ ప్యాసింజర్ క్రూయిజ్ షిప్ ‘అయోలస్’ కనిపిస్తుంది. సాయం కోసం వాళ్ళంతా ఆ ఓడ ఎక్కుతారు. కానీ ఆ ఓడలో ఒక్క మనిషి కూడా ఉండడు. గడియారాలన్నీ ఆగిపోయి ఉంటాయి. ఓడ అంతా వింత నిశ్శబ్దం నిండి ఉంటుంది. జెస్‌కు మాత్రం ఈ ఓడను ఇంతకుముందే చూశానని, ఇక్కడికి ముందే వచ్చానని డేజావు భావన కలుగుతుంది.

కొద్దిసేపటికే ముఖానికి ముసుగు వేసుకున్న ఒక అజ్ఞాత వ్యక్తి తుపాకీతో వారిపై దాడి చేస్తాడు. ఒక్కొక్కరిని క్రూరంగా చంపేస్తాడు. జెస్ ధైర్యంగా పోరాడి ఆ హంతకుడిని ఓడ పైనుంచి సముద్రంలోకి తోసేస్తుంది. చనిపోయే ముందు ఆ హంతకుడు “నువ్వు అందరినీ చంపేయాలి, అప్పుడే ఇంటికి వెళ్ళగలవు” అని చెబుతాడు. ఆ క్షణంలో జెస్ దూరంగా తమ పాత పడవను చూస్తుంది. అందులో తన స్నేహితులతో పాటు ‘మరో జెస్’ కూడా ఉంటుంది.

Advertisement

అప్పుడు జెస్‌కు అర్థమవుతుంది. తాను ఒక అనంతమైన టైమ్ లూప్‌ లో చిక్కుకుపోయానని. ఈ ఓడపై వందల సార్లు ఇవే ఘటనలు జరిగాయి. వందల సార్లు జెస్ స్నేహితులు చనిపోయారు. ఓడ అంతా శవాలు, రక్తం, ముసుగులతో నిండి ఉంటుంది. తన కొడుకు దగ్గరకు తిరిగి వెళ్లాలంటే ఈ లూప్‌ను బ్రేక్ చేయాలని జెస్ భావిస్తుంది. కానీ ఆ లూప్ బ్రేక్ చేయడానికి తానే ముసుగు వేసుకుని హంతకురాలిగా మారాల్సి వస్తుంది. ఆ లూప్‌లో నుంచి జెస్ ఎలా తప్పించుకుని ఇంటికి చేరుకుంటుంది? అక్కడకు వెళ్ళాక తన కొడుకును తానే కోపంగా కొడుతూ, వేధిస్తూ ఉండటం చూసి ఏం చేస్తుంది ? ఆమె కొడుకు ఎలా చనిపోతాడు ? మరి ఈ టైమ్ లూప్ ఎలా ఎండ్ అవుతుంది ? అన్నది చూసి తెలుసుకోవలసిన కథ.

తెలుగు స్ట్రీమింగ్ ?

‘ట్రయాంగిల్’ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక్కసారి చూస్తే చాలు, మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేసే చిత్రం. క్రిస్టోఫర్ స్మిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. ప్రస్తుతం Apple TVలో కేవలం ఇంగ్లీష్‌లో రెంటల్ లేదా బై ఆప్షన్ ద్వారా మాత్రమే చూడవచ్చు. ఒకసారి చూస్తే మరచిపోలేని టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా మనసును కలచేస్తుంది.

Read Also : ప్రతీ ఆడపిల్ల తండ్రి ఇలాగే ఉండాలి భయ్యా… కార్పొరేట్ సిండికేట్ ను చితగ్గొట్టే శివంగి

Tags

Related News

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×