E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం చెప్పేసిన చక్రధర్.. పల్లవి గుట్టు రట్టు.. కూతురు కోసం భానుమతి కన్నీళ్లు..

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం చెప్పేసిన చక్రధర్.. పల్లవి గుట్టు రట్టు.. కూతురు కోసం భానుమతి కన్నీళ్లు..
Advertisement

Intinti Ramayanam Today Episode March 11th: నిన్నటి ఎపిసోడ్ లో..పల్లవి తన తండ్రిని తనకు కాకుండా చేసింది అని అవని పై కోపాన్ని పెంచుకుంటుంది.. అవని మా డాడ్ మా మామ్ ని విడదీసింది అని తనపై రివెంజ్ తీర్చుకోవాలి అని అంటుంది. వెళ్లి అవనితో తాడోపేడో తేల్చుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. వేదో సాధించావు అని విర్రవీగుతున్నావ్ కదా.. మా మామ్పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. మా నాని మీ నాన్నని చాలా సంతోషంగా ఉన్నావు కదా అనేసి పల్లవి అవనిని అంటుంది. ఇప్పుడు నేనేం చేశాను మీ నాన్న కదా ఒప్పుకున్నాడు అని అవని అంటుంది.. మా నాన్నని అలా ఒప్పించేలా చేశావు నువ్వు తెలివైన దానివే అవును ఒప్పుకుంటాను అని పల్లవి అవని అంటుంది.. మా అమ్మ చాలా వీక్ మీ అమ్మ లాగా స్ట్రాంగ్ కాదు. అందుకే ఇన్ని రోజులు మా మామ్చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మాత్రం దారుణమైన పరిస్థితిలో ఉంది అని పల్లవి తన తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నిన్ను కానీ మా మామ్ ని ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చిన ఆ చక్రధర్ ని అసలు వదిలిపెట్టను అని పల్లవి వెళ్ళిపోతుంది..

ఇన్ని రోజులు నేను ఎంతో మందిని ఇబ్బంది పెట్టాను. ఇప్పటివరకు ఈ నేను ఎంతమంది ఉసురు పోసుకున్నానో తెలియలేదు కానీ నాకు మాత్రం అవని వల్లే కళ్ళు తెరుచుకున్నాయి అనేసి అంటాడు. మార్పు మంచిదే రా నువ్వు ఇన్ని రోజులు మారావ్ అనుకున్నాను. కానీ ఇంతగా మారిపోవడం నాకు కూడా ఆశ్చర్యమేస్తుంది అని అతను అంటాడు. నువ్వు అన్ని నిజాలే చెప్పాలని అనుకుంటున్నప్పుడు కొన్ని అవమానాలు కూడా తప్పవు నిన్ను కొంతమంది మాటలతో ఇబ్బంది పెడతారు అది నువ్వు గుర్తుంచుకోవాలి అని అతను చెప్తాడు.. అన్నిటికీ సిద్ధపడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను రా అనేసి చక్రధర్ అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెళ్లడానికి రెడీ అవుతారు. ఇక అందరూ కలిసి సరదాగా కమల్ ని రెడీ చేసి ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతారు. తన ముగ్గురు కొడుకులు సంతోషంగా ఉన్నారు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మేము ముఖ్యమైన అగ్రిమెంట్ ని చేయించుకోబోతున్నాము అని పార్వతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ముగ్గురు అన్నదమ్ములు.. బయటికి వెళ్తుంటే అవని నువ్వు వాళ్లకి ఎదురు వెళ్ళమ్మా అనేసి పార్వతి అంటుంది. చక్రధర్ మాత్రం తాను చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నిజాలు అన్నీ బయటపెట్టాలి అని అనుకుంటాడు. అవినీకి చక్రధర్ ఫోన్ చేసి అసలు నిజాన్ని చెప్పాలని అనుకుంటాడు. అత్తయ్య నేను మామయ్యకి రాగిజావ చేసి తీసుకురమ్మంటారా అని అవని అడుగుతుంది. నేను చేస్తానులేమ్మా నువ్వు వెళ్లి నీ పని చూసుకో అనేసి పార్వతి అంటుంది..

అప్పుడే అవనీకి చక్రధర్ ఫోన్ చేస్తాడు.. నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు.. మీరు నా కన్నతండ్రి అని ఒప్పుకున్నారు. నేను మీ చేత చెప్పించాలనుకున్న నిజం ఇదొక్కటే. మీరు ఇంకేం చెప్పినా కూడా నేను వినను అనేసి అవని అంటుంది. నేను చెప్పబోయే నిజం మీ గురించి కాదు. మీ మామయ్యని ఎవరు చంపాలనుకున్నారో వాళ్ల గురించి చెప్పాలని అనుకుంటున్నాను అని చక్రధర్ అనగానే వెంటనే వస్తున్నాను అని అవని కంగారుగా వెళ్ళిపోతుంది.. పార్వతి ఎంత పిలుస్తున్నా సరే అవని మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఏమైందని అనుకుంటుంది. మామయ్య గారిని చంపాలి అనుకున్నది ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని వాళ్లకి శిక్ష పడేలా చేయాలి అని అవని అనుకుంటుంది..

Advertisement

ఇక భానుమతి తన కూతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం కావడం లేదు నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను అని బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతుంది. భానుమతి రాజేశ్వరిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తప్పు చేస్తే చేశాడు. ఇన్నేళ్ల తర్వాత ఆ తప్పుని బయట పెట్టడం ఎందుకు అని భానుమతి అడుగుతుంది.. అవని మీనాక్షిలు ఇద్దరు కూడా నా ఉసురు తగిలి నాశనం అయిపోతారు అని రాజేశ్వరి శాపాలు పెడుతుంది. మనిద్దరం అనుకోవడం కాదే వాళ్ళిద్దరూ కచ్చితంగా నాశనం అయిపోతారు జరిగేది అదే అని భానుమతి కూడా ఉంటుంది.. చక్రధర్ దగ్గరికి వెళ్లిన అవని మీరు నాకు కన్న తండ్రి అని ఒప్పుకున్నారు. మా మామయ్య గారిని ఎవరు చంపారో చెప్పండి అని అవని అడుగుతుంది.

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ అమూల్య బ్యాగ్రౌండ్ తెలిస్తే ఔరా అన్నాల్సిందే..

మీ మావయ్య గారిని చంపాలనుకుంది పల్లవినే.. మీరు చంపాలని అనుకోలేదా ఎలా నమ్మాలి అని అవని అడుగుతుంది.. పల్లవి నాకు పంపించిన వాయిస్ నోట్ కూడా ఉంది.. ఒకసారి అది విను అని అవనికి ఇస్తాడు అందులో మీ గురించి రాజేంద్ర ప్రసాద్ కి నిజం తెలిసిపోయింది డాడ్. అతన్ని చంపాలని ఫిక్స్ అయ్యాను అని అందులో ఉంటుంది.. ఇక అంతే కాదు పల్లవి ఫోటోను కూడా చూపించడంతో అవని ఇంకాస్త రెచ్చిపోతుంది. మా మామయ్య గారిని చంపాలని చూసిన పల్లవిని అస్సలు వదిలిపెట్టను అని అంటుంది.. తను ఎంతైనా నీ సొంత చెల్లెలు నువ్వు ఇలాంటివి బయట పెట్టొద్దు తనకు ఒక ఛాన్స్ ఇవ్వు మారుతుంది అని చక్రధర్ బ్రతిమలాడుతాడు.. నువ్వు మారుతుంది అన్న నమ్మకం నాకు లేదు మా ఇంట్లో వాళ్లకి నేనైతే ద్రోహం చేయలేను పల్లవి గురించి అసలు నిజాన్ని బయట పెడతాను అని అవని ఆవేశంగా ఇంటికి వెళ్తుంది.. పల్లవి నీ ఏం చేస్తుందో తెలియదు వాళ్ళు చంపేస్తారు అని చక్రధర్ పల్లవికి ఆ నిజం చెప్తాడు పల్లవి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×