Intinti Ramayanam Today Episode March 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ఇంటికి పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. అందరూ పలకరింపులు తర్వాత ఇంట్లోకి రావడానికి నీళ్లు ఇస్తే కాళ్ళు కడుక్కుంటామని అంటారు. పద్ధతులు పట్టింపులు రాజేంద్రప్రసాద్ కుటుంబం వాళ్లకి పద్ధతులు పట్టింపులు ఎక్కువమని చెప్పాను కదా ఈ మాత్రం ఉంటాయనేసి అనుకుంటారు. ఇంట్లో ఏర్పాటు చేస్తారు. ఇక ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పరిచయాలు పెంచుకోవడానికి అందరితో మాట్లాడతారు. ఇక అక్షయ్ భార్య అవని గురించి అడుగుతారు అందరూ నీళ్లు నములుతారు.. ఇంట్లో అందర్నీ పరిచయం చేస్తారు కానీ అవనిని పరిచయం చేయరు అయితే మీ పెద్ద కోడలు ఎక్కడ అని అడిగితే అప్పుడే అవని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. అవనిని చూసి అందరూ షాక్ అవుతారు.. ఈమె ఎవరు మీ పెద్ద కోడలా అని పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అడుగుతారు. కానీ ఆరాధ్య వచ్చి మా ట్యూషన్ టీచర్ అని అబద్దం చెప్తుంది. ఇక ప్రణతి ఫోన్ చేసింది ఎందుకని తెలుసుకోవాలని అవని ప్రయత్నిస్తుంది కానీ అందరూ అవని నీ ప్రణతి దగ్గరికి పోనివ్వకుండా చూసుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి ఎంగేజ్మెంట్ కి అంత సిద్ధం చేస్తారు రాజేంద్రప్రసాద్ కుటుంబం. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుందని ఇది మంచి సంబంధం అని ఒకటేసారి ఎంగేజ్మెంట్ ని చెయ్యాలని చూస్తారు. ప్రణతికి మాత్రం ఆ పెళ్ళంటే ఇష్టం ఉండదు దాంతో అవనీకి ఫోన్ చేసి అవని ఇంటికి రమ్మని పిలుస్తుంది. అయితే అవనికి ప్రణతి అసలు నిజం చెప్పలేక పోతుంది. ఇక అందరూ కలిసి ప్రణతికి ఇది చాలా సంబంధం పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పేస్తారు. అమ్మ మాట కాదని లేక ప్రణతి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఒప్పుకుంటుంది.
ప్రణతి మొహంలో సంతోషం ఉండదు అది గమనించిన అవని ప్రణతి ఏదాని గురించి బాధపడుతుందని అనుకుంటుంది. ప్రణతి మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది మొత్తానికైతే ఎంగేజ్మెంట్ ని పూర్తి చేస్తే ఇస్తారు. అబ్బాయి మరో వారం రోజుల్లో అమెరికా వెళ్లాల్సి ఉంటుంది అందుకే పెళ్లి కూడా తొందరగా చేస్తే బాగుంటుందని పెళ్లి వాళ్ళు రాజేంద్రప్రసాద్ అంటారు. రాజేంద్రప్రసాద్ కూడా మీరు ఎలా అంటే అలానే బావగారు మీ ఇష్టప్రకారమే అన్ని కానిద్దామనేసి అంటాడు. ఇక పార్వతి కూడా మీరు ఏది అనుకుంటే అదే అన్నయ్యగారు అనేసి అంటుంది.
మా సాంప్రదాయం ప్రకారం ఈ ఇంటి పెద్ద కోడలికి చీర పెట్టాలి కానీ మీరు టీచర్ కదా మీరు గురువు లాంటి వారు అంటే పెద్ద వాళ్లే అందుకే మీకు ఈ చీర పెట్టాలని అనుకుంటున్నాం టీచర్ గారు రండి అనేసి అవినీతి వాళ్ళు చీర పెడతారు. ఇక తర్వాత మరో రెండు రోజుల్లో పెళ్లి ఉంటుందని చెప్పేసి వెళ్లిపోతారు. పార్వతి మాత్రం అవనిని దారుణంగా తిడుతుంది. నన్ను చంపాలని చూసావు నా కూతురి జీవితాన్ని కూడా పాడు చేయాలని చూస్తున్నావా అని అరుస్తుంది. అటు పల్లవి కూడా పిలవని దానికి ఎందుకు రావాలి? ఇంట్లో నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదు నువ్వు రావాల్సిన అవసరం ఏంటి అని అవనిని తిడుతుంది ఇక కమ్మలు పల్లవి వదిన ఒక్క మాట అన్న కూడా నేను అస్సలు ఊరుకోను అని రెచ్చిపోతాడు..
అందరూ తలా ఒక మాట అనడంతో అవని బాధపడుతుంది. ఇక రాజేంద్రప్రసాద్ పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలాంటి గొడవలు ఏంటి అని అంటాడు ఇక పార్వతి అవని బయటికి వెళ్లి పొమ్మని చెప్తుంది. అవని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రణతి నాకు ఏదో చెప్పాలని చూసింది కానీ చెప్పలేకపోయింది అదేదో తెలుసుకోవాలి లేకుంటే తను చాలా ఇబ్బంది పడేలా ఉంది అని అవని అనుకుంటుంది. ఇక రాత్రి భానుమతికి కమలు కమలాకర్ వేషంలో వచ్చి నాలుగు ఇస్తాడు. అవని చాలా మంచిది అవని నేను ఎందుకు ఇలా చేస్తున్నావ్ అనేసి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…