Mushfiqur Rahim Retirement: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎన్నో సంవత్సరాలుగా బంగ్లాదేశ్ కు సేవలు అందిస్తున్న… ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ ( Mushfiqur Rahim ) సంచలన ప్రకటన చేశాడు. తాను… వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా వెల్లడించాడు ముష్ఫికర్ రహీమ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశాడు. కేవలం వన్డేలకు మాత్రమే రిటర్మెంట్ తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అంటే మిగతా ఫార్మాట్ లు కూడా ముష్ఫికర్ రహీమ్ ( Mushfiqur Rahim Retirement )… ఆడతాడు అన్నమాట.
Also Read: SA vs NZ: సౌతాఫ్రికా ఇంటికి.. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్స్ !
దాదాపు 19 సంవత్సరాల పాటు బంగ్లాదేశ్ తనదైన సేవలు అందించాడు రహీం. అయితే అతని వయసు పై పడటం… యంగ్ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడం.. లాంటి పరిణామాల నేపథ్యంలో… రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటన చేశాడు రహీం. ఇక ఈ 19 సంవత్సరాలుగా తనకు మద్దతు ఇచ్చిన… క్రికెట్ అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ తనకు సపోర్ట్ గా నిలిచినందుకుగాను… వాళ్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ ( Mushfiqur Rahim ).
తన 19 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో ఎన్నో అవకతవకలు ఎదుర్కొన్నానని… ఆ సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కూడా తనకు సపోర్ట్ గా నిలిచింది అన్నాడు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ జట్టుకు… సేవలు అందించేందుకు వేరే ఏదైనా పదవి చాన్స్ వస్తే.. కచ్చితంగా తీసుకుంటానని.. వెల్లడించాడు. బంగ్లాదేశ్ వన్డే జట్టును వదలడం చాలా బాధాకరంగా ఉందని కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇది ఇలా ఉండగా రహీం ఇప్పటికే t20 క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
2022 సంవత్సరంలోనే… అంతర్జాతీయ టి20 మ్యాచ్ లకు గుడ్ బై చెప్పాడు రహీం. తాజాగా వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే కేవలం టెస్ట్ ఫార్మాట్ లో మాత్రమే రహీం ఆడబోతున్నాడు. వైట్ జెర్సీలో కనిపించి జట్టుకు సేవలు అందించే దిశగా అడుగులు వేయనున్నాడు. ఇక 2006 సంవత్సరంలో…. రహీం వన్డే కెరీర్ ప్రారంభమైంది. అది కూడా తొలి వన్డే జింబాబ్వే… జట్టు పైన ఆడి… తనదైన ముద్ర వేసుకున్నాడు ముష్ఫికర్ రహీమ్ ( Mushfiqur Rahim ).
ముష్ఫికర్ రహీమ్ వన్డే రికార్డు
చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా గత నెల 24వ తేదీన న్యూజిలాండ్ పైన చివరి వన్డే మ్యాచ్ కూడా ఆడేశాడు. ఇక ఇప్పటివరకు…. 274 వన్డే మ్యాచ్లు ఆడాడు రహీం. ఇందులో 7795 పరుగులు చేశాడు. అంతే కదా ఇప్పటివరకు 9 సెంచరీలు చేసిన రహీం 49 అర్థ శతకాలు కూడా సాధించాడు. వికెట్ కీపర్ గా 243 క్యాచ్లను అందుకోవడం జరిగింది. 56 మందిని స్టంప్ అవుట్ చేశాడు ముష్ఫికర్ రహీమ్ ( Mushfiqur Rahim ).
Also Read: SRH Fan Meet: IPL 2025 కంటే ముందే ఫాన్స్ కు గుడ్ న్యూస్.. SRH కీలక ప్రకటన !
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Bangladesh's legendary wicketkeeper Mushfiqur Rahim has announced his retirement from the ODI format 🇧🇩🤝
He is the most capped player in ODIs for Bangladesh with 274 matches and the second-highest run-scorer for his team in ODIs with 7,795 runs 🧤🙇… pic.twitter.com/UlaoKdewqj
— Sportskeeda (@Sportskeeda) March 5, 2025