Intinti Ramayanam Today Episode November 18th : గత ఎపిసోడ్ లో.. అందరు సరదాగా భోజనం చేసి ఇంట్లో డైనింగ్ హాల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తారు. ఆ తర్వాత అందరూ సంతోషంగా టీవీ చూస్తుంటే పల్లవి అది చూసి ఓర్చుకోలేక పోతుంది. వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉంటే నా పగ ఎలా తీరుతుంది అని పల్లవి లోలోపల రగిలిపోతుంది. వీళ్ళ నవ్వుని ఎలాగైనా దూరం చేయాలని పల్లవి అనుకుంటుంది. ఇక సీరియల్స్ పెట్టుకుని చూస్తుంటే ప్రణవి సినిమాలు పెట్టొచ్చు కదా అని అడుగుతుంది. దానికి బామ్మ ఇప్పట్లో సినిమాలు లేవు ఈ సీరియల్ అని అయిపోయిన తర్వాతే సినిమాలు పెడతానని అంటుంది. టీవీ చూస్తే ఆయుష్ తగ్గిపోతుంది నువ్వు ముసలిదానివి అయిపోతావని కమల్ అంటాడు. దానికి అందరూ నవ్వుకుంటారు. అవని కూడా సరదాగా నవ్వుకుంటుంది. అవని నవ్వును చూసి నవ్వుకో ఇంకా సేపట్లో బావగారు వస్తారు ఈ నవ్వు ఇక దూరమైపోతుంది అని అనుకుంటుంది. ఇక అప్పుడే అక్షయ్ ఇంట్లోకి వస్తాడు. ప్రణవి అన్నయ్య వచ్చాడు అని అంటుంది. అక్షయ్ రాగానే కోపంగా అందరు వంక చూస్తాడు. బాక్స్ ను విసిరి గోడతాడు. దాంతో ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. ఇక అవని బాధ పడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని గొడవ జరగడం పై ఆలోచిస్తుంది. అసలు తప్పు ఎక్కడ జరిగింది అని ఆలోచిస్తుంది. పార్వతి అక్కడికి వెళ్తుంది. అక్షయ్ అన్న మాటలకి బాధపడుతున్నావా అమ్మ అనేసి పార్వతి అనగానే లేదు అత్తయ్య అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియట్లేదు అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. పార్వతి అవని మాట్లాడుకోవడం పల్లవి వింటుంది. ఆయనకు ఈమధ్య నామీద చిన్న చిన్న విషయానికి విసుక్కుంటున్నాడు కోప్పడుతున్నాడు అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అనేది అంటుంది. ఆఫీసులో ఏదో టెన్షన్ ల వల్ల వాడు అలా మాట్లాడుతున్నాడు.. ఇక ఆఫీస్ లో అందరు అలా అనడంతో భాద కోపడ్డాడు. అంతే వాడి ఆవేశం తగ్గితే మళ్లీ వాడే వచ్చి సారీ చెబుతాడు అని అంటుంది. ఇక ఆ విషయాన్ని పల్లవి వింటుంది. అవని దగ్గరకు పల్లవి వస్తుంది. నువ్విలా బాధపడుతుంటే చూడలేని అక్క అనేసి పల్లవి అంటుంది. ఈ చిన్నదానికే ఇంతగా బాధపడితే ముందు ముందు ఇంకెన్ని చూడాలో అనేసి పల్లవి అనగానే ఇదంతా చేసింది నువ్వేనా అని అడుగుతుంది. నువ్వు తెలివైన దానివి అక్క ఇదంతా చేసింది నేనే అని పల్లవి అవనితో అంటుంది.
నీ బుద్ధి మార్చుకొని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవాని అవని పల్లవి చంప పగలగొడుతుంది. చిన్న చిన్న వాటికి అవమానంగా ఫీల్ అయితే ఇక జీవితంలో ముందు వెళ్లలేమని పల్లవి అవనితో అంటుంది. ఎప్పుడో చనిపోతాం కదా అని ఇప్పుడు మన జీవితాన్ని వదిలేసుకుంటామా ఏంటి అని పల్లవి అవనితో మాటకు మాట సమాధానం చెబుతుంది. నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు అని అవని పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. తర్వాత రోజు ఉదయం అక్షయ్ కిందకు వస్తాడు. ఆరాధ్య స్కూలుకు రెడీ అవ్వకుండా ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. ఆరోగ్యాన్ని స్కూల్ టైం అవుతున్న నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అక్షయ్ అడుగుతాడు. మమ్మీ నన్ను ఇంకా రెడీ చేయలేదు డాడీ అంటే అక్షయ అవని ఎక్కడికి వెళ్లిందని అవని అని పిలుస్తాడు.
అవని ఇంట్లో లేదని పార్వతి చెప్పడంతో అవని ఎక్కడికి వెళ్తారా అని అడుగుతారు. దానికి బామ్మ సీరియస్ అవుతుంది. పెద్ద కొడుకు కోడలు అని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె అడిగేవారు లేరని రెచ్చిపోతుంది. దానికి పల్లవి కూడా తోడై అవని పై ఇంకా చాడీలు చెప్తారు. ఇక ఆ తర్వాత కమల్, ప్రణవి, పార్వతి అవనికి సపోర్ట్ చేస్తారు. కానీ అక్షయ్ మాత్రం కోపంగానే ఉంటాడు. ఇక పార్వతి ఆరాధ్యను నేను రెడీ చేస్తాను నువ్వు ఆఫీస్ కి రెడీ అవ్వు అని చెప్తుంది. మీనాక్షికి హాస్పిటల్ ఇంజక్షన్ వేయలేదని డాక్టర్ భరత్నే తిడుతుంది ఇక భరత్ తన దగ్గర డబ్బులు లేవని అవనికి ఫోన్ చేసి చెప్తాడు అవని వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి భరత్ తో కలిసి మందులు తీసుకుంటుంది. మందులు లేవంటే డబ్బులు లేవని ఆగిపోవడం కాదు నాకు ఫోన్ చేయాల్సింది కదా అని భరత్ ని అంటుంది. ఇక అక్షయ్ బయట వాళ్ళిద్దర్నీ చూస్తాడు. ఏడిపించినందుకు వాన్ని జైల్లో పెట్టించాము కానీ అవని వారిని విడిపించి తీసుకెళ్తుంది అంటే అసలు అవనిని ఏమనుకోవాలి అని అక్షయ్ ఇంటికొచ్చాక అవని అడగాలని అనుకుంటాడు.
ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చాను నేను ఇంటికి వెళ్తాను అని అవని భర్త చెప్పి వెళ్తుంటే అమ్మ నేను చూడాలని అనుకుంటుంది అని భరత్ చెప్పగానే అవని సరే చూసి వెళ్తానని వెళ్తుంది. ఇక పల్లవిని కమల్ జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు. పల్లవి వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతుంటే నువ్వు ఫోన్లు ఈ టైంలో మాట్లాడకూడదు నేను జాగ్రత్తగా చూసుకోమని నాన్న చెప్పాడు నువ్వు ఈ టైం లో బిడ్డ గురించి ఆలోచించాలి తప్ప ఫోన్ పట్టుకోకూడదు అని పల్లవితో అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవని ఇంటికి రాగానే బామ్మ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. వెనకాల అక్షయ్ వచ్చి తన ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్తానని అంటాడు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి అవని తన తల్లి తమ్ముడు గురించి అసలు నిజం చెప్తుందా లేక మరొక అబద్ధం చెప్తుంది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..