BigTV English

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : కొత్త కొత్త కథలతో వెబ్ సిరీస్ లు హడలెత్తిస్తున్నాయి. ఆడియన్స్ కి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్, భవిష్యత్‌లో మగాళ్లు లేని ప్రపంచంలో మహిళలు ఎలా జీవిస్తారో చూపిస్తుంది. ఇది 2021 న్యూజిలాండ్ టెలివిజన్ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా సిరీస్ అవార్డును కూడా గెలిచింది. ఈ సరికొత్తగా సిరీస్ ఓటీటీలో, టాప్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘క్రీమరీ’ (Creamerie) 2021లో వచ్చిన న్యూజిలాండ్ బ్లాక్ కామెడీ వెబ్ సిరీస్. దీన్ని జే.జే. ఫాంగ్, పెర్లినా లావు, రోజాన్నే లియాంగ్, అల్లీ స్యూ క్రియేట్ చేశారు. ఇందులో మావ్ (అల్లీ స్యూ), థియా (జే.జే. ఫాంగ్), లోటస్ (పెర్లినా లావు), రాబ్ (జే ర్యాన్) మెయిన్ క్యారెక్టర్స్ గా ఉన్నారు. మొత్తం 6 ఎపిసోడ్‌లు, ఒక్కో ఎపిసోడ్ 20 నుంచి 25 నిమిషాల నిడివి ఉంటుంది. ఇది 2021మార్చి లో TVNZ OnDemandలో రిలీజ్ అయ్యింది. తర్వాత నెట్‌ఫ్లిక్స్, హులులోకి వచ్చింది. IMDbలో 7.4/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ భవిష్యత్‌లో జరుగుతుంది. ఒక వైరస్ వల్ల ప్రపంచంలో దాదాపు అందరు మగవాళ్ళు చనిపోతారు. మిగిలిన వాళ్లను న్యూజిలాండ్‌లో ఒక ఫెసిలిటీలో పెడతారు. కానీ వాళ్లు కూడా సర్వైవ్ కాలేరు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మహిళలు నడుపుతుంటారు. ఇక ఈ కథలో మావ్, థియా, లోటస్ అనే ముగ్గురు సిస్టర్స్, న్యూజిలాండ్‌లో ఒక డైరీ ఫామ్ ను నడుపుతుంటారు. వాళ్ల లైఫ్ ఫన్నీగా, హ్యాపీగా సాగుతుంది. కానీ ‘వెల్‌నెస్’ అనే గవర్నమెంట్ వాళ్లను స్ట్రిక్ట్ రూల్స్‌తో కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మగవాళ్ళు లేకపోవడంతో, పిల్లల కోసం స్పెర్మ్ బ్యాంక్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఒక రోజు వాళ్ల ఫామ్‌లో రాబ్ అనే మగాడు దాక్కుని ఉన్నాడని తెలుస్తుంది. రాబ్ ఫెసిలిటీ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు ఆ ముగ్గురూ అతన్ని సీక్రెట్‌గా దాచుకుంటారు. కానీ ఇది వాళ్ల లైఫ్‌ను గందరగోళంలో పడేస్తుంది.


రాబ్‌ను మావ్, థియా, లోటస్ వెల్‌నెస్ గవర్నమెంట్‌కు తెలియకుండా దాచుకుంటారు. రాబ్ ఒక ఇన్నోసెంట్ మగాడు కావడంతో వాళ్లకు కొత్తగా అనిపిస్తాడు. అతనితో ఫన్నీ సీన్స్ వస్తాయి. మగవాడులు లేని ప్రపంచంలో అతను ఎలా అడ్జస్ట్ అవుతాడో చూస్తారు. మగాడు లేని ప్రపంచంలో ఫ్రీడమ్, ఫ్రెండ్‌షిప్, లవ్ గురించి వాళ్లు చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇక వెల్‌నెస్ ఆఫీసర్స్ ఆ ఫామ్‌లో సస్పిషన్ ఫీల్ అయి, చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ టైమ్‌లో సిరీస్ ఫన్నీగా, డార్క్ హ్యూమర్ తో సాగుతుంది. ఇక్కడ అంటే డేంజర్ కూడా పెరుగుతుంది. వెల్‌నెస్ గవర్నమెంట్ రాబ్ గురించి తెలుసుకుంటుంది. మావ్, థియా, లోటస్ అతన్ని సేవ్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తారు. గవర్నమెంట్‌తో ఫైట్ చేస్తారు. చివరికి ఊహించని ట్విస్ట్ తో ఈ క్లైమాక్స్ ముగుస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? రాబ్ ని వెల్‌నెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ? ఈ సిస్టర్స్ రాబ్ ని సేవ్ చేస్తారా ? ఇక్కడ పిల్లల కోసం ఎలాంటి పద్దతులు పాటిస్తారు ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also : గ్రామంలో అందరినీ భయపెట్టే ఆత్మ… మతి పోగొట్టే మర్డర్ కేసు… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

Related News

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

OTT Movie : సమాజంపై కోపంతో సైకోగా మారే ఫెయిల్డ్ కమెడియన్… IMDb రేటింగ్ 8.3 ఉన్న 7,500 కోట్ల మూవీ

Big Stories

×