E-Paper
Advertisement

రాంప్రసాద్ గుంట నక్క.. దెబ్జానీ కాదు ఫేక్జానీ: రోహిత్

రాంప్రసాద్ గుంట నక్క.. దెబ్జానీ కాదు ఫేక్జానీ: రోహిత్
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ వారం బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిత్ నాయుడు (Rohit Naidu) హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా రోహిత్ బిగ్ బాస్ జర్నీ గురించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి, అదేవిధంగా నాగార్జున గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.. ఇలా బిగ్ బాస్ నుంచి ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన రోహిత్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

రాంప్రసాద్ గుంట నక్క ..

ఇక ఈ కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ నాయుడుకి వర్ష ప్రశ్న వేస్తూ.. నేను హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల పేర్లు చెబుతాను వారికి నువ్వు ఏ పేరు పెడతావో చెప్పాలి అంటూ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. మొదటగా రాంప్రసాద్ (Ram Prasad)పేరు చెప్పగానే రోహిత్ గుంట నక్క అంటూ పేరు పెట్టారు. ఇలా రాంప్రసాద్ ను ఉద్దేశించి గుంట నక్క అని చెప్పడంతో వెంటనే వర్ష అసలు రాంప్రసాద్ ఎవరి జోలికి వెళ్లడు కదా అంటూ వర్షా అడగగా, నేను కూడా అదే అనుకున్నాను కానీ స్కెచ్ లో మెయిన్ ప్లాంటింగ్ వేసింది రాంప్రసాద్ అంటూ రోహిత్ సమాధానం చెప్పడంతో వర్ష షాక్ అయ్యారు.

దెబ్జానీ రెండు తలల పాము..

Advertisement

ఇక వర్ష మరో ప్రశ్న వేస్తూ రెండు తలల పాము ఎవరు అంటూ ప్రశ్న వేయగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రోహిత్ ఫేక్జానీ అంటూ సమాధానం చెప్పారు.దెబ్జానీ(debjani) కాదు ఫేక్జానీ.. మీరు నా ఈ పాయింట్స్ రెడ్ లైన్ తో హైలెట్ చేసుకోండి.. ఈమె ఫేస్ పర్సనాలిటీని బట్టి మాట్లాడుతూ ఉందని , తెలుగు రాదు అంటూనే అందరిపైనా బూతులు మాట్లాడుతుందని రోహిత్ తెలిపారు. ముఖేష్ ను కాలబందర్ అంటూ మాట్లాడారు. ఇలా తెలుగు రాదంటూనే బూతులు మాట్లాడుతుంది అలాగే మనిషిని బట్టి మాట తీరు మారుస్తుందని ఆమె ఫేక్ అంటూ దెబ్జానీను ఫేక్జానీ అని అభివర్ణిస్తూ రోహిత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇక హౌస్లో మిగిలిన కంటెస్టెంట్ ల గురించి రోహిత్ ఏం మాట్లాడారు వారికి ఎలాంటి పేర్లు ఇచ్చారు అనేది తెలియాలి అంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ ఎపిసోడ్ ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం అవుతుంది. ఇక రోహిత్ విన్నర్ రేసులో ఉంటారని అందరూ భావించారు కానీ అనూహ్యంగా ఈయన బయటకు రావడంతో త్రిగున్ విన్నర్ అంటూ అభిమానులు ఫిక్స్ అయ్యారు. మరి సీజన్ 10 విన్నర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: ఎలిమినేషన్.. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.. రోహిత్ ఎమోషనల్!

Related News

ఎలిమినేషన్.. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.. రోహిత్ ఎమోషనల్!

శాలిని ప్రపోజల్.. తెగ సిగ్గుపడిపోయిన రోహిత్..మ్యాటర్ ఏంటి బ్రో?

త్రిగుణ్ పీఆర్ టీమ్ పై రోహిత్ ఫైర్.. ఆడవాళ్ళపై పిచ్చి కామెంట్స్ అంటూ!

ప్రియుడు శివ్ కోసం తిరుమలలో మోకాళ్లపై మెట్లెక్కిన ప్రియాంక జైన్!

ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు.. అన్ ఫేర్ ఎలిమినేషన్ అంటున్న రోహిత్!

ఇది బిగ్ బాస్ కాదురోయ్ ..మాటలతో రెచ్చిపోయిన రోహిత్- అపూర్వ!

చిన్న కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ 10 కంటెస్టెంట్.. ఎంత ముద్దుగా ఉందో!

Big Stories

Advertisement
×