Podarillu Today Episode November 27th: ఇక విక్కీ ప్రతిసారి మహాలక్ష్మి దగ్గరికి వచ్చి తనకి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.. అయితే మహాలక్ష్మి దగ్గర కూర్చొని నీకేం కావాలి అని ఎంతగా అడిగిన సరే నాకు ఇదొక్కటే చాలు అని మహాలక్ష్మి అంటుంది. విక్కీ తనతో ఎలాంటి పులిహోర కలపాలని చూసిన సరే.. నేను మహాలక్ష్మి దాంట్లోనే షేర్ చేసుకుని తింటాను అని ఎంత చెబుతున్నా సరే.. మహాలక్ష్మి మాత్రం నాకు వేరే వాళ్ళతో షేర్ చేసుకుని అస్సలు నచ్చదు అని అంటుంది. ఆ మాటతో విక్కి చాలా సీరియస్ అవుతాడు. ఇక చక్రికి మెసేజ్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది.. చక్రి రాగానే విక్కీ మహాలక్ష్మికి కారు డోర్ తీస్తాడు కానీ చక్రి దగ్గరికి వెళ్లి కార్ ఎక్కుతుంది మహాలక్ష్మి.. తను నా గర్ల్ నువ్వు చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి అని చక్రికి వార్నింగ్ ఇస్తాడు దాంతో చక్రి చాలా సీరియస్ అవుతాడు.
మహాలక్ష్మి ఇంటికొచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది కాని చక్రి మాత్రం చాలా కోపంగా ఉంటాడు.. ఏంటమ్మా ఇంత లేట్ అయింది భోజనం చేసావా అని అడుగుతాడు. మాధవ్ కానీ మహాలక్ష్మి మాత్రం పార్టీ ఇచ్చారని చెప్తుంది. తనకి వాళ్ళ బాసు మంచి రెస్టారెంట్లో ఫుడ్ పెట్టించారు. మన ఇంట్లో ఉంటుంది తెల్ల అన్నం ఒకటే కూర కదా అని చక్రి చాలా కోపంగా అంటాడు. కానీ కన్నా మాత్రం మహాలక్ష్మిని హగ్ చేసుకుని ఐ లవ్ యు చెప్పింది అని చెప్పగానే మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతుంది. చక్రి మహాలక్ష్మి చెప్పింది విని కోపంగా బయటికి వెళ్తాడు.. చక్రీ చాలా కోపంగా బయటికి వెళ్లాడు కదా ఇప్పుడు మళ్ళీ వస్తాడు రాడు అంటూ అందరూ కంగారు పడిపోతూ ఉంటారు కానీ నారాయణ మాత్రం ఎక్కడికి పోతాడు ఆడే వస్తాడులే అని అంటాడు.
ఇక చక్రి మళ్ళీ లోపలికి వచ్చి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా వింటాడు అయితే కేశవ బయట వీధి చివర పునుగులు బండి దగ్గరికి వెళ్లి ఒక మూడు నాలుగు ప్లేట్లు లాగిస్తూ ఉంటాడు. వాడు ఆకలికి అస్సలు ఆకలేడు అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు? నేను ఆకలికి అస్సలు ఆగలేను మొత్తం తినేస్తూ ఉంటాను అండ్ కోపంగా వెళ్ళిపోతాడు మహాలక్ష్మి ఎంతగా బతిమిలాడినా కూడా అసలు వినకుండా చక్రి చాలా సీరియస్ గా ఉంటాడు కానీ మహాలక్ష్మి మాత్రం తన మీద కౌంటర్లు వేస్తూ నవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఉదయం లేచిన తర్వాత చక్రి ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే చక్రి కనపడుటలేదు అంటూ ఒక పోస్టర్ పెట్టడంతో అందరూ కాసేపు నవ్వుకుంటారు.
చక్రి కనపడుటలేదని పోస్టర్ పెట్టడంతో చక్రి దాన్ని చూసి ఏంటి చక్రి కనిపించడం లేదా.. అసలు ఈ పోస్ట్ ఎందుకు పెట్టారు. అసలు ఈ పోస్ట్ పెట్టడానికి అసలు కారణం ఏంటి అంటూ చక్రి చాలా కోపంగా ఉంటాడు అయితే అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఏంట్రా నువ్వు ఎక్కడున్నావ్ రా అని అడుగుతాడు. నేను కనిపించట్లేదు.. తప్పిపోయాను అంటూ పోస్టులు పెట్టారు అని చక్రి బాధపడుతూ చెప్తాడు. అయితే తన ఫ్రెండ్ అవునా ఎవర్రా అంత మంచి వ్యక్తి దండేసి సన్మానం చేయాల్సిందే ఆవిడకి అని అంటాడు. ఇక చక్రి కనిపించట్లేదు అని మహాలక్ష్మి పెట్టిన పోస్ట్ గురించి అందరికీ చెప్తుంది అయితే వెంటనే వస్తాడు అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది.
ఇక విక్కీ మహాలక్ష్మి చాలా కోపంగా ఉంది అని తనని కూల్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి ఇక విక్కీ మహాలక్ష్మి చాలా కోపంగా ఉంది అని తనని కూల్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు ఉదయం ఆఫీసుకు రాగానే వికీ మహాలక్ష్మి తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తాడు కానీ.. తను మాత్రం అస్సలు మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా ఉంటుంది.. కానీ నువ్వు చేసిన పెద్ద పనికి నేను చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని రింగ్ ని ప్రజెంట్ చేస్తాడు అది చూసినా అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. దాని స్టేటస్ పెడతాడు అది చూసిన చక్రి చాలా ఫీల్ అయిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ‘పొదరిల్లు ‘ పరిస్థితి ఏంటి..?