Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 (bigg boss 10)ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ రోహిత్ నాయుడు పట్నం (Rohit Naidu Patnam) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా నాగార్జున(Nagarjuna) గురించి అలాగే ఆయన హోస్టింగ్ గురించి రోహిత్ నాయుడు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
గత కొన్ని సీజన్ల నుంచి నాగార్జున హోస్టింగ్ గురించి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈయన కొంతమందికి మాత్రమే మద్దతుగా మాట్లాడుతారని తప్పు చేసిన వారిని ప్రశ్నించరు అంటూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా యాంకర్ వర్ష ఈ విషయం గురించి ప్రశ్న వేశారు. ఇప్పుడు నాగ్ సర్ ఏదైతే చెబున్నారో అదంతా నాగ్ సర్ చెప్తుందేనా? లేకపోతే టీం చెప్తే ఆ విషయాన్ని నాగార్జున గారు స్టేజ్ మీద చెబుతారా? అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు రోహిత్ సమాధానం చెబుతూ.. నాగ్ సర్ హి ఇస్ ఏ ఫేస్.. ఆయనకి టీం నుంచి స్క్రిప్ట్ మొత్తం వస్తుందని దాని ప్రకారమే స్టేజ్ పై మాట్లాడతారు.. ఆయన షో చూడరని రోహిత్ తెలిపారు.
అగ్ని పరీక్షలో గెలిచి వచ్చేసి చేసేద్దాం అంటూ మాట్లాడుతుంటారని వర్ష అడగడంతో అది చాలా తక్కువ , ఆయన తొక్కలో అగ్నిపరీక్ష అన్న రోజులు కూడా ఉన్నాయని, మీ జ్యూరీ ఇలాంటి వారిని సెలెక్ట్ చేసింది ఏంటి అంటూ కోప్పడ్డారని కూడా రోహిత్ తెలిపారు. ఫైల్ టాస్క్ లో ముఖేష్ ను విగన్ అని పిలుస్తాడు. ఆ వీడియో మాత్రం బయటకు రాలేదు కానీ బ్యాగర్ టాస్క్ సమయంలో శాలిని F అనే పదాన్ని అడ్రస్ చేసి మరి చూపించారు అంటూ రోహిత్ బిగ్ బాస్ షో గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. రోహిత్ ఉద్దేశం ప్రకారం వారికి కావలసిన వారిని హైలెట్ చేస్తూ వారికి సంబంధించిన వాటిని ఎడిట్ చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.
ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా రోహిత్ కంటెస్టెంట్ ల గురించి, నాగార్జున గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక రోహిత్ ఈ కార్యక్రమంలో ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారనే విషయాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక రోహిత్ అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చారు మొదటి వారం నుంచి ఎంతో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్న రోహిత్ విన్నర్ అవుతారని భావించారు కానీ ఊహించని విధంగా ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: రాంప్రసాద్ గుంట నక్క.. దెబ్జానీ కాదు ఫేక్జానీ: రోహిత్