Nindu Noorella Saavasam Serial Today Episode: రామ్మూర్తి తీసుకొచ్చిన యాభై లక్షలు కొట్టేయాలనుకున్న మనోహరి అందుకోసం మంచి ప్లాన్ ఆలోచిస్తుంది. ప్లాను ప్రకారం అమర్ వాళ్లు తినే ఫుడ్‌లో మత్తు మందు కలపమని చంభాకు చెప్తుంది. అలాగేనని మనోహరి ఇచ్చిన మత్తు మందును చంభా కలిపేస్తుంది. అందరూ భోజనం చేస్తుంటే.. మనోహరి చేయడం లేదని అమర్ పిలిచి భోజనం చేయమంటాడు. మనోహరి షాక్ అవుతుంది. చంభా మాత్రం మెల్లగా మనోహరితో నువ్వు ఇప్పుడు భోజనం చేయకపోతే అనుమానం వస్తుంది అని చెప్తుంది. తప్పించుకునే మార్గం లేక మనోహరి కూడా మత్తు మందు కలిపిన ఫుడ్ తింటుంది. భోజనం తర్వాత అందరూ వెళ్లి పడుకుంటారు.
రూంలో పడుకున్న యాదమ్మ నిద్ర లేచి టైం చూసి అమ్మో అప్పడే పన్నెండు అయింది. అందరూ నిద్రపోయి ఉంటారు. ఆ డబ్బులు కొట్టేయడానికి ఇదే సరైన టైం అనుకుంటూ మనోహరి పిలుస్తుంది. మనోహరి మత్తుగా గాఢ నిద్రలో ఉంటుంది. చివరికి మనోహరి ముఖం మీద వాటర్ చల్లి నిద్ర లేపుతుంది యాదమ్మ. మత్తుగా లేచిన మనోహరి ఏంటి చంభా అంటే.. డబ్బులు కొట్టేయవా అని యాదమ్మ అడిగితే.. నువ్వే వెళ్లి తీసుకురాపో చంభా అని మనోహరి చెప్తుంది. యాదమ్మ మాత్రం భయపడుతుంది. తాను ఆ పని చేయలేనని అంటుంది. మనోహరి మత్తుగా లేచి అమర్ రూంలోకి వెళ్లి యాభై లక్షలు ఉన్న బ్యాగ్ తీసుకుని రూంలోని బట్టలు, పుస్తకాలు విసిరకొట్టి ఎవరైనా చూస్తూ ఇంట్లో దొంగలు పడ్డారు అనుకునేలా చేసి డబ్బులతో వెళ్లిపోతుంది.
రూంలోకి డబ్బులు తీసుకుని వెళ్లిన మనోహరిని యాదమ్మ పొగడ్తలతో ముంచెత్తుతుంది. నువ్వు సూపర్ మనోహరి.. ఇంత మత్తులో కూడా అంత కరెక్టుగా డబ్బులు కొట్టేశావు అంటుంది. సరే డబ్బులు జాగ్రత్త అంటూ మనోహరి మళ్లీ మత్తుగా నిద్రపోతుంది. ఈ డబ్బులతో కోల్‌కతా పారిపోతే హ్యాపీగా బతకొచ్చు అని యాదమ్మ అనుకుంటుంది.
మరుసటి రోజు ఉదయమే రాథోడ్ ఇంటికి వెళ్తాడు. ఇంట్లో ఎవ్వరూ కనిపించకపోయే సరికి మిస్సమ్మ, యాదమ్మ అంటూ గట్టిగా పిలుస్తూ మనోహరి రూంలోకి వెళ్తాడు. మనోహరి, యాదమ్మ ఫుల్లుగా నిద్రపోతుంటారు. అక్కడి నుంచి రాథోడ్ పిల్లల రూంలోకి వెలితే అమ్ము, మిస్సమ్మ, ఆనంద్, ఆకాష్ నిద్రపోతుంటారు. రాథోడ్.. మిస్సమ్మను నిద్రలేపితే.. మిస్సమ్మ పిల్లలను నిద్రలేపి అమ్మో ఆయన జాగింగ్‌కు వెళ్తారేమో అనుకుంటూ అమర్ రూంలోకి పరుగెడుతుంది.
రూంలో వస్తువులు చిందర వందర ఉంటాయి. షాకింగ్‌గా వెళ్లి అమర్‌ను నిద్రలేపుతుంది మిస్సమ్మ. నిద్ర లేచిన అమర్ రూం మొత్తం తేరిపార చూసి బీరువా వైపు చూస్తాడు. అది ఓపెన్‌గా ఉంటుంది. దగ్గరకు వెళ్లి చూస్తాడు అమర్. ఏమైందండి అని మిస్సమ్మ అడిగితే ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు. యాభై లక్షలు ఎత్తుకుపోయారు అని అమర్ చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.