E-Paper
Advertisement

ఎలిమినేషన్.. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.. రోహిత్ ఎమోషనల్!

ఎలిమినేషన్.. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.. రోహిత్ ఎమోషనల్!
Advertisement

Big Tv Kissik Talks: రోహిత్ నాయుడు పట్నం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఒక సామాన్యుడిగా వృత్తిపరంగా ఉద్యోగం చేస్తూ ఉన్న  రోహిత్ నాయుడు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. అగ్నిపరీక్ష కార్యక్రమంలో ఛాన్స్ అందుకున్న రోహిత్ అగ్నిపరీక్షలో తనదైన శైలిలో ఆట తీరును కనబరుస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే ఊహించని విధంగా రోహిత్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇలా ఎలిమినేట్ అయిన రోహిత్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు .

ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయిన రోహిత్..

ఈ నేపథ్యంలోనే రోహిత్ నాయుడు బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks )  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి వారం నుంచే రోహిత్ (Rohit )అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ గట్టి పోటీ ఇచ్చారు. దీంతో రోహిత్ కచ్చితంగా విన్నర్ అవుతారని అభిమానులు కూడా భావించారు. కానీ రోహిత్ మాత్రం ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఎవరి కర్మకు వాళ్లు పోతారు..

Advertisement

అగ్ని పరీక్ష ద్వారా తన కొడుకు హౌస్ లోకి వెళ్లి అక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తూ విన్నర్ కావాల్సిన వ్యక్తి ఇలా బయటకు వచ్చారని అమ్మ  ఫీలయ్యారా అంటూ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రోహిత్ సమాధానం చెబుతూ అమ్మ బాగా ఎమోషనల్ అయ్యారని, బాగా ఏడ్చారని తెలియచేశారు. ఇప్పుడు నేనేం చేయలేను .. మన చేతులు దాటి వెళ్లినప్పుడు ఏం చేయలేము ఎవరి కర్మకు వాళ్ళు వెళ్తారు.. అంతకుమించి నేనేం చేయలేను అంటూ సమాధానం ఇచ్చారు.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష మరో ప్రశ్న వేశారు. వర్షా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ నుంచి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాము మీరు వెళ్తారా లేక శాలిని పంపిస్తారా అంటే ఏం చెబుతారని అడిగారు. అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న వాతావరణం మొత్తం ప్యూర్ టాక్సిక్.. రేపు నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఆడిన ఈ సీజన్ చూస్తే.. అరే ఏంట్రా మా డాడీ ఇలా ఉన్నాడా? ఇంత టాక్సిక్ గాడ? నడుము మూతులు అంటూ వరుసలు కూడా తెలియకుండా.. ఇదా నా తండ్రి అని నా పిల్లలు అనుకోకూడదు అందుకే నా వాళ్లను ఎవరిని పంపించను దేనికైనా నేనే వెళ్లి ఫైట్ చేస్తాను అంటూ రోహిత్ మాట్లాడారు. మరి ఈయన ఈ కామెంట్స్ దేనిని ఉద్దేశించి చేశారు అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: శాలిని ప్రపోజల్.. తెగ సిగ్గుపడిపోయిన రోహిత్..మ్యాటర్ ఏంటి బ్రో?

Related News

శాలిని ప్రపోజల్.. తెగ సిగ్గుపడిపోయిన రోహిత్..మ్యాటర్ ఏంటి బ్రో?

త్రిగుణ్ పీఆర్ టీమ్ పై రోహిత్ ఫైర్.. ఆడవాళ్ళపై పిచ్చి కామెంట్స్ అంటూ!

ప్రియుడు శివ్ కోసం తిరుమలలో మోకాళ్లపై మెట్లెక్కిన ప్రియాంక జైన్!

ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ కాలేదు.. అన్ ఫేర్ ఎలిమినేషన్ అంటున్న రోహిత్!

ఇది బిగ్ బాస్ కాదురోయ్ ..మాటలతో రెచ్చిపోయిన రోహిత్- అపూర్వ!

చిన్న కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ 10 కంటెస్టెంట్.. ఎంత ముద్దుగా ఉందో!

బిగ్ బాస్ లోకి రాకముందు రోహిత్ నాయుడు జీతం ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×