Intinti Ramayanam Today Episode November 6th : భానుమతి ఏంట్రా పల్లవి మీద అరుస్తున్నావు నువ్వు ఎందుకు పల్లవి ఇంటికి వస్తే బాధపడుతున్నావు భయపడుతున్నావు పల్లవి ఏంటి కోడలు మీ ఇద్దరికీ ఇంకా విడాకులు రాలేదు నువ్వు ఎందుకురా అని వెళ్ళిపో అని అంటున్నావు నువ్వు ఇక్కడే తను ఉంటే ఎక్కడా తనకి కరిగిపోతానని భయపడుతున్నావా అని భానుమతి అంటుంది. దానికి ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా కూడా దానిమీద మనసు రాదు ప్రేమ పుట్టదు అని కమల్ అంటాడు. దాంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పండగ అయిపోయేంతవరకు పల్లవి నేను ఇక్కడే ఉంటామో అప్పటివరకు మీరు ఒక్క మాట అనడానికి వీల్లేదు అని భానుమతి కావాలని బలవంతంగా పలు విని ఇంట్లో పెడుతుంది..
పల్లవి ఇంటికి రావడం లేదు అనర్థానికి కారణంగా ఉంది. నాకు చాలా భయమేస్తుంది. అసలు పల్లవి ఎందుకు ఇంటికి వచ్చింది. ఏదో ప్లాన్ ప్రకారం వచ్చింది అని అక్షయ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అసలు పల్లవి ఇలా వచ్చింది అంటే కచ్చితంగా ఏదో చేయడానికి వచ్చింది అని అనుకుంటారు. అయితే అప్పుడే పల్లవి లోపలికి రావడం చూసి నన్ను క్షమించండి అని ఎంతగా అడిగినా సరే అక్షయ్ మాత్రం అస్సలు మాట్లాడడానికి కూడా ఇష్టపడడు. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు నువ్వు చేసిన మోసాలు ఘోరాలు అన్నీ నా కళ్ళముందు ఇంకా కనిపిస్తున్నాయి. ఇకనుంచి వెళ్ళు అని పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. ఇక ప్రణతి భరత్ లో రావడంతోకు అందరూ చాలా సంతోషంగా ఉంటారు.
ప్రణతి భరతులు ఇంటికి రావడంతో కూతురు అల్లుడు ఇంటికి వచ్చారని పార్వతి బట్టలు పెట్టాలని అనుకుంటుంది. ఇక అక్షయ్ అవనీలు ప్రణతి భరత్లకు బట్టలు పెట్టేందుకు అంత సిద్ధం చేస్తారు. అయితే వీళ్ళందరూ కలిసి వాళ్ళకి బట్టలు పెట్టేందుకు కూర్చోబెట్టి మరి మర్యాదలు చేస్తారు. అప్పుడు ప్రణతికి బట్టలు పెట్టిన తర్వాత భారత్ కి బట్టలు పెడితే మా అక్కకి బట్టలు పెట్టరా అని అడుగుతాడు.. పల్లవి అలాగే భానుమతి ఎవరితో సంబంధం లేకుండా అలా ఉన్నారు కదా.. అందుకు కారణం వీళ్లే వీళ్ళకి కచ్చితంగా బుద్ధి చెప్పాలి అని భరత్ అనుకుంటాడు. ఇంటి కోడలైనా మా అక్కకి ఎందుకు బట్టలు పెట్టలేదు అని అడుగుతాడు తనకి పెట్టలేదు అంటే నాకు కూడా అవసరం లేదు అని అబద్ధం విసిరి కొట్టగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..
పల్లవి శ్రేయ బాబుని ఎత్తుకోవాలని చూస్తుంది అయితే అప్పుడు అక్కడికి వచ్చిన శ్రేయ నా బాబుని గొంతు విసిగి చంపేద్దామని చూస్తున్నావా అని అడుగుతుంది. నేనెందుకు అలా చేస్తాను. ఎప్పుడో జరిగిన పొరపాటుతో మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని పల్లవి ఎంతగా చెప్పాలని చూసినా సరే.. అటు శ్రియ ఇటు శ్రీకర్ ఇద్దరు వినరు నీలాంటి దుర్మార్గాన్ని నా తమ్ముడు వద్దనుకోవడంలో తప్పులేదు అని శ్రీకర్ కమల్ కి సపోర్ట్ గా ఉంటాడు. నువ్వు అలా చేయడం అస్సలు బాగోలేదు. నీలాంటి దాన్ని నా ఇంట్లో కూడా రానివ్వడానికి నాకు ఇష్టం లేదు అని శ్రీకర్ అంటాడు. అయితే ఎలాగైనా సరే నువ్వు ఇప్పుడు ఇకనుంచి వెళ్ళిపో లేకపోతే మాత్రం నేను చాలా కోపంగా ఉంటాను నేనేం చేస్తారో నాకు తెలీదని శ్రీకర్ అంటాడు. ఇక పల్లవి తనకి అవమానం జరిగిందని ఫీల్ అయిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భానుమతికి చెప్పగానే భానుమతి పొయ్యి నీ మొగుడిని లైన్ లో పెట్టుకోవాలి అని సలహా ఇస్తుంది.
అవని రెడీ అయిన తర్వాత ఆరాధ్యుని కూడా రెడీ చేసేస్తుంది. అయితే అమ్మ పల్లవి పిన్ని ఎందుకు వచ్చింది రాదు అని చెప్పావు కదా.. మళ్లీ ఇక్కడే ఉండి పోతుందా అని అడుగుతుంది. ఆరాధ్య కానీ అవని మాత్రం పల్లవి పిన్ని ఇక్కడికి రావడానికి రాలేదమ్మా పండగ కదా అందుకే వచ్చింది. అయితే ఇకమీదట పల్లవి పిన్ని ఇక్కడ ఉండదు అని చెప్పగానే సరే అమ్మ అని అంటుంది అరాధ్య. ఇక నన్ను బాగా రెడీ చేసి ప్రైజ్ రావడానికి కారణమైన రమ్య ఆంటీని కూడా పిలుద్దాం అమ్మ అని ఆరాధ్య అనగానే సరే అని అంటుంది.. అవని ఇక రమ్య కి ఫోన్ చేయగానే తన వాళ్ళు ఎవరు లేకపోయినా.. తను ఇంత ప్రేమగా చూసుకుంటుంది అని అవని మాటలకు ఎమోషనల్ అయిపోతుంది రమ్య వస్తాను అని చెప్తుంది.
నీ మొగుడిని బుట్టలో వేసుకొని భానుమతి కమల్ గది వరకు తీసుకుని వెళ్తుంది. ఇక భానుమతి చెప్పినట్లుగానే పల్లవి సరే నీ లోపలికి వెళుతుంది అయితే అక్కడ ఉన్న కమల్ తో నన్ను క్షమించు బావ అని ఎంతగా అడుగుతున్నా సరే అసలు వినకుండా.. కమల్ మీద పడిపోతూ ఉంటుంది కమల్ ఒక్కసారిగా తనని తోసేసి చెంపలు వాయిస్తాడు. అయితే భానుమతి కమల్ ఇంక మారడాని భయపడిపోతూ ఉంటుంది. అటు మీనాక్షి కూడా తన కూతురు బాగుండాలి అని కోరుకుంటూ ఉపవాసం ఉంటుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : వీక్లీ టీఆర్పీ రేటింగ్.. ఆ రెండు సీరియల్స్ అవుట్..!