Sravanthi Chokkarapu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది లేడీ యాంకర్స్ గా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో ఝాన్సీ, ఉదయభాను వంటి వారు టాప్ యాంకర్స్ గా కొనసాగేవారు . వీరి తర్వాత సుమ కనకాల(Suma Kanakala) ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమయ్యారు. గత పాతిక సంవత్సరాలుగా ఈమె యాంకర్ గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్తవారు యాంకర్లుగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో బిజీగా ఉన్న వారిలో స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) ఒకరు. కెరియర్ మొదట్లో యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా మొదలైన ఈమె ప్రయాణం ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతో బిజీగా గడుపుతున్నారు.
చిన్న సినిమా నుంచి మొదలుకొని పెద్ద హీరోల సినిమాలకు కూడా ఈమె యాంకర్ గా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వారంలో నాలుగు ఐదు రోజులు సినిమా ఈవెంట్లతో స్రవంతి ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమా ఈవెంట్లతో పాటు పలు బుల్లి తెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న స్రవంతి నెల వారి ఆదాయం ఎంత ఉంటుందనే విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది. స్రవంతి ఒక్కో సినిమా ఈవెంట్ కు సుమారు లక్ష నుంచి 1.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం.
ఇలా సినిమా ఈవెంట్లతో పాటు బుల్లితెర కార్యక్రమాలు, అదేవిధంగా పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ , సోషల్ మీడియా వంటి ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నారని తెలుస్తోంది. ఈమె నెలవారి ఆదాయం సుమారు 50 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నెలకి 50 లక్షలు సంపాదన అంటే ఏడాదికి సుమారు 6 కోట్లకు వరకు సంపాదిస్తున్నారని చెప్పాలి. ఈ సంపాదన హీరోయిన్లను మించి ఉందని తెలుస్తోంది. కెరియర్ మొదట్లో స్రవంతి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు పలు సందర్భాలలో తెలియజేశారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఈమె యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా పాల్గొని సందడి చేశారు.
ఇలా బిగ్ బాస్ తర్వాత స్రవంతి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ యూట్యూబ్ ద్వారా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూ చేస్తూ సక్సెస్ అందుకున్నారు. అప్పటి నుంచి వరుస సినిమా ఈవెంట్లతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె యాంకర్ గా సక్సెస్ కావడంతో సుమకు సినిమా ఈవెంట్లు కాస్త తగ్గాయని సుమను మించి ఏం సినిమా ఈవెంట్లకు యాంకర్ గా కొనసాగుతూ భారీగా సంపాదిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు దర్శక నిర్మాతలు స్రవంతి గురించి మాట్లాడుతూ స్రవంతి యాంకరింగ్ చేసింది అంటే సినిమా హిట్ అయినట్టే అంటూ ఈ మెనూ లక్కీ హ్యాండ్ గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.
Also Read: అఫీషియల్ జైలర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే!