Kissik Talks: చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ అందుకొని అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న మురళీమోహన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినిమాల ద్వారానే కాదు ఇటు రాజకీయ రంగంలో కూడా చక్రం తిప్పిన ఈయన అటు బిజినెస్ లో మరింత పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు నిర్మాణ రంగంలో కూడా దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మురళీమోహన్ తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా నవంబర్ 8 ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ వర్షా మాట్లాడుతూ ..2029లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం గా నిలవబోతున్నారు అంటూ ఆమె ప్రశ్నించింది. మురళీమోహన్ మాట్లాడుతూ.. “అర్హత ఉన్నవాళ్లు.. ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్లు మనకు నాయకుడిగా రావాలి తప్పా.. ఓటుకి ఇంత డబ్బు తీసుకొని ముసుగేసుకుని పడుకుంటే.. ఇక జీవితాంతం మనం బెగ్గర్స్ గానే మిగిలిపోతాము.. వాళ్లు మాత్రం మేడలు, మిద్దెలు కట్టుకొని ఎదిగిపోతారు” అంటూ చెప్పుకొచ్చారు
“నరకాసురుడు చనిపోయిన రోజు కాబట్టి నరక చతుర్దశి అని సంబరపడతాము కానీ ఇవాళ ఎంతమంది రాక్షసులు ఉన్నారో తెలుసా? వీధికో రాక్షసుడు ఉన్నాడు. మానభంగాలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రోజుకో సంఘటన అంటూ ఎన్నో విషయాలను ఆయన చెప్పబోతుండగా ప్రోమో కట్ చేశారు. ఇక పూర్తి విషయాలు తెలుసుకోవాలి అంటే ఆదివారం పూర్తి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. మొత్తానికి అయితే మురళీమోహన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆయన చెప్పినట్టుగానే ఓటుకు నోటు కాకుండా ప్రజలకు మంచి చేస్తారు అని భరోసా ఇచ్చే వాళ్లకే ఓటు వేసి వారిని నాయకులుగా ఎన్నుకోవాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
also read:చిన్నపిల్లల ఇంజక్షన్ ధరపై నిజాలు చెప్పిన మురళీమోహన్!
తెలుగు సినిమా నటుడిగా, టెలివిజన్, నిర్మాణ రంగంలో ఎంతో కృషి చేశారు. నిర్మాతగా, రాజకీయవేత్త అయిన ఈయన 40 సంవత్సరాలకు పైగా సాగిన తన కెరీయర్లో సుమారుగా 350కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో వివిధ పదవులలో పనిచేశారు. 2015 ఎన్నికల వరకు తెలుగు సినిమా కళాకారుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. సినీ ఇండస్ట్రీకి చేసిన విశేష సేవకు గాను 2026లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని కూడా అందుకున్నారు. అంతేకాదు తన సినిమాల ద్వారా 3 రాష్ట్ర నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఈయన తన కెరియర్ లో జగమే మాయ, నేరము శిక్ష , బలిపీఠం, లక్ష్మణ రేఖ, తూర్పు పడమర, యవ్వనం కాటేసింది, దేవతలారా దీవించండి ఇలా ఎన్నో చిత్రాలు ఆయన కెరియర్లో మైలురాయిగా నిలిచిపోయాయి. చివరిగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. ఇటు సినిమాలలోనే కాకుండా అటు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు.