E-Paper
Advertisement

చిన్నపిల్లల ఇంజక్షన్ ధరపై నిజాలు చెప్పిన మురళీమోహన్!

చిన్నపిల్లల ఇంజక్షన్ ధరపై నిజాలు చెప్పిన మురళీమోహన్!
Advertisement

Kissik Talks:అభం శుభం తెలియని చిన్నారులలో అరుదైన వ్యాధులు.. అటు పిల్లలను, ఆ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే ఇంజక్షన్ ఖరీదును తట్టుకోలేక ఇటు తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలను చంపుకోలేక..అలాగని అన్ని కోట్ల రూపాయలను తీసుకురాలేక.. ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు పడే వేదన వర్ణనాతీతం. అయితే ఇంత ఖరీదు ఉండడానికి గల కారణం ఏంటి? అనే విషయంపై ఎప్పటికప్పుడు పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నప్పటికీ.. ధర తగ్గించే మార్గం లేకపోవడమే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వాలు ఎందుకు ఇలాంటి మెడిసిన్ ఉచితంగా ఇవ్వవు? అనే ప్రశ్న కూడా అందరిలో మొదలవుతుంది..ఇదే విషయంపై ప్రముఖ సినీనటులు మురళీమోహన్ (Murali Mohan) తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik talks) షోకి వచ్చి ఈ విషయంపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఖరీదైన ఇంజక్షన్ ను ప్రభుత్వం ఎందుకు ఉచితంగా ఇవ్వడం లేదు?

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా నవంబర్ 8వ తేదీన ఆదివారం రాత్రి 8:00గంటలకు ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. “ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు అక్కడక్కడ అరుదైన వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు, రూ.18 కోట్లు అని చెబుతున్నారు. అసలు ప్రభుత్వం ఎందుకు ఫ్రీగా ఆ మెడిసిన్ ఇవ్వలేకపోతోంది?” అంటూ వర్షా ప్రశ్నించింది.

బడ్జెట్ లేదా?

Advertisement

ఈ విషయంపై మురళీమోహన్ మాట్లాడుతూ ..”బడ్జెట్లు సరిగ్గా లేకపోవడమే. అభివృద్ధి పనులు కూడా ఈ బడ్జెట్ లోకే సరిగా జరగడం లేదు” అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు మురళీమోహన్.

రీసెంట్ గా చూసిన సినిమా అదే – మురళీమోహన్

ఇదే ఇంటర్వ్యూలో రీసెంట్ టైంలో మీరు చూసిన మూవీ ఏంటి? అని వర్ష ప్రశ్నించగా.. రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా చూశాను అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తాను ధరించే మాల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. “నేను అయ్యప్ప స్వామి భక్తుడిని. ఇప్పటివరకు సుమారుగా 39 సార్లు మాల వేశాను. ఈ సంవత్సరం 40వసారి”. అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

Advertisement

also read:దానాలు చేయడంపై.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!

కోరిక కాదు.. నిజమైన భక్తి కావాలి..

దేవుడిని ఎక్కువగా కోరుకునే కోరిక ఏంటి? అని మళ్లీ వర్షా ప్రశ్నించగా.. “దేవుడిని ఏ కోరిక కోరుకోకూడదు. మనం భక్తితో ఉంటే దేవుడే మనకు కావాల్సింది ఇస్తాడు” అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మురళీమోహన్ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడంతో.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి పూర్తి ఎపిసోడ్ లో ఇంకెన్ని విషయాలు పంచుకుంటారో చూడాలి.

Related News

దానాలు చేయడంపై.. మురళీ మోహన్ కామెంట్స్ వైరల్!

జీవితసత్యం చెప్పిన మురళీమోహన్.. మరి ఎందుకు ఈ పాకులాట!

అప్పుడు గాజులు గల గల ..ఇప్పుడు ఇరుముడి కట్టు ..అస్సలు తగ్గట్లేదుగా !

ఏడాదిలో 2 కంపెనీలు మూతపడ్డాయి.. అప్పులిచ్చినవాళ్లు నా వెంటబడ్డారు: మురళీ మోహన్

ఇష్టం లేకపోయినా పొలిటికల్ ఎంట్రీ.. ఆ నెగెటివిటీ తప్పలేదన్న మురళీమోహన్!

చావు అంచుల వరకు వెళ్లొచ్చిన సీరియల్ నటి?

దొంగ గేమ్ ఆడొద్దు.. కర్మ అనుభవిస్తావ్.. త్రిగుణ్ పై నీతూ మాస్టర్ ఫైర్..

Big Stories

Advertisement
×