Telugu TV Serials: బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న వాటిలలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవల కాలంలో సీరియల్స్ ఉన్నంత డిమాండ్ మరి ఏ దానికి లేదు అని అందరికీ తెలుసు. ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ ప్రతిరోజు క్యూరియాసిటీని పెంచుతూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్స్ కి ఉన్నంత డిమాండ్ మరి ఏ సీరియల్స్ కి లేదు. గత వారంతో పోలిస్తే ఇక్కడ వచ్చే సీరియల్స్ కి ఈ వారం మంచి రేటింగ్ నమోదు అయిందని తెలుస్తుంది. మరి ఈవారం ఎలాంటి సీరియల్స్ మంచి రీడింగ్ నమోదు చేసుకున్న ఈ అన్న విషయం గురించి ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. మరి ఆ సీరియల్స్ ఏవి? ఏ సీరియల్స్ రేటింగ్ తగ్గింది అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
ప్రతివారం సీరియల్స్ కి రేటింగ్ నమోదు అవుతుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇటీవల కాలంలో స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ని నమోదు చేసుకుంటూ వస్తున్నాయి. సినిమాలుకు ఎలాగైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు ఉంటాయో.. సీరియల్స్ కి కూడా ప్రతివారం రేటింగ్ అనేది ఉంటుంది అయితే ఈ వారం రేటింగ్ విషయంలో రెండు సీరియల్స్ మాత్రం ఇప్పుడు శుభం కార్డు వేసుకోబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి బ్రహ్మ ముడి అలాగే ఏ దేవి వరమో నీవు. ఈ సీరియల్స్ కి ఈ మధ్య రేటింగ్ బాగా తగ్గడంతో ఇవి త్వరలోనే ఎండ్ కార్డు వేసుకోబోతున్నాయి అని టాక్ వినిపిస్తుంది. మరి నిజంగానే ఈ సీరియల్స్ కి రేటింగ్ తగ్గిందా? త్వరలోనే సీరియల్స్ గుడ్ బై చెప్పబోతున్నాయి అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇటీవల కాలంలో టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ కథతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. ఈ సీరియల్ రేటింగు 12.83 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.60 ఉంది. పొదరిల్లు 11. 75, ఇంటింటి రామాయణం 11.54, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.67, నువ్వులేక నేను లేను10.60, నిండు మనసులు 9.60, చిన్ని 8.63, బ్రహ్మముడి 8.47.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్‌ను నమోదు చేసుకున్నాయి. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత పెరుగుతుందో చూడాలి.. చివరం మరి ఏ సీరియల్స్ ఎలాంటి రేటింగ్ ని నమోదు చేసుకుంటాయి అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..
Also Read :శుక్రవారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కరోజే 14 సినిమాలు..!